అరణ్యకాండ: 833-846 - మాయలేడి వర్ణన - రంగనాథ రామాయణం
సందర్భము: మారీచుడు అందమైన మాయలేడిగా మారుట.
అరణ్యకాండ: 833-846
గపట సారంగమై కదియ నేతెంచి - యుపమింప నరుదైన యొప్పుల నొప్పి
నెమకుచుఁ బులు మేయు నిజవాల రుచుల - రమణమై వన మయూరముల నాడించుఁ
దఱమిడి యొకమాటు తన పార్శ్వ రుచుల - బఱపైన వన మెల్లఁ బసిఁడి గావించుఁ
గుదియక యొకమాటు కుప్పించి దాఁటి - త్రిదశేంద్రచాపంబు తెఱఁగు గావించు
వొకమాటు చెంగున నుప్పరం బెగసి - ప్రకటించు నతుల శంపాలతా రుచులఁ
దఱిగొని యొకమాటు తన పార్శ్వరుచుల - నెఱి చంద్రకాంతముల్ నీఱు గావించు
మృగయూథములఁ గూడి మెలఁగుచు మేయు - మృగములు బెదరించు మెల్లనె డాగు
నంతంత బొడచూపు నటఁ జేరవచ్చు - నంతలో బెదరి చుట్టదరి కుప్పించుఁ
దరుల నీడల కుల్కుఁ దగఁ బర్ణశాలఁ - జొరబాఱు నంతనె స్రుక్కి క్రేళ్లుఱుకు
వసుధ మూర్కొని చూచు వాల మల్లార్చు - దెసలకు జెవి చేర్చుఁ దెలియ నాలించు
గంచుమించై పాఱఁ గ్రమ్మఱఁ జేరుఁ - గుంచితాకృతి చెవి కొనఁ గదలించు
బచ్చికపట్ల పైఁ బవళించి లేచు - మచ్చిక నచ్చోట మౌనులఁ జేరు
ఖురములఁ జెవిగోకుఁ గొమ్ముల తుదల - విరులతీఁగె గదల్చి విరు లెల్ల రాల్చు
నందంద నందమై యాపర్ణశాల - ముందఱ మృగ మిట్లు మోదించుచుండె

భావం: మాయలేడి దగ్గరకు వచ్చి, ఎప్పుడూ చూడని అందాలతో కనపడుతోంది. తన తోకను అటూఇటూ ఊపుతూ, నెమళ్లను ఆడిస్తోంది. తన శరీరకాంతితో ఆ వనమంతా బంగారు రంగు పులుముతోంది. ఎగిరెగిరి దూకుతూ, ఇంద్రధనస్సును గుర్తుచేస్తోంది. ఒకమారు చెంగున ఎగిరి, మెరుపుతీగ లాగా కనబడుతోంది. తన వెలుగులో వెన్నెలవలే చంద్రకాంత శిలలను నీరు కారుస్తోంది. తోటి లేళ్లతో కలసి ఉంటుంది. అంతలోనే బెదరి ఎగిరి గంతు వేస్తుంది. చెట్ల నీడలో విశ్రమిస్తుంది. పర్ణశాలలోకి వస్తుంది. మళ్లీ గంతులు వేసుకుంటూ ఉఱుకుతుంది. నేల వాసన చూస్తుంది. తోక ఆడిస్తుంది. చెవులు రిక్కించి దిక్కులను వింటుంది. కనబడకుండా పారిపోతుంది. చెవులను అటూఇటూ ఊపుతుంది. పచ్చిక మీద పవళిస్తుంది. ఇష్టమైన మునుల దగ్గరకు పోతుంది. గిట్టలతో చెవి గోకుతుంది. కొమ్మలతో పూలతీగెలను కదల్చి, పూలన్నీ రాల్చేస్తుంది. అంత అందమైన పర్ణశాల ముందర ఆ లేడి ఆనందంతో ఉన్నది.
--
కదియు = దగ్గరకు వచ్చు
ఉపమించు = పోల్చు
ఒప్పులు = అందాలు
నెమకు = వెదకు
పులుమేయు = కొట్టు, ఊపు
తరమిడు = వరుసబెట్టు
పఱపైన = విస్తృతమైన
కుదియు = తగ్గు
ఉప్పరం = పైన, ఆకాశం
శంపాలత = మెరుపుతీగ
తఱిగొని = ప్రయత్నించి
యూథ = సజాతీయ సమూహము
స్రుక్కు = వెనుదీయు
క్రేళ్లు = గంతులు
కంచుమించు = కనబడక
కుంచిత = వంకర
ఖురము = డెక్క
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
Comments
Post a Comment