అరణ్యకాండ: 939-947 - రావణాసురుని మాయా సిద్ధుని వేషము - రంగనాథ రామాయణం

సందర్భము: రావణాసురుని మాయా సిద్ధుని వేషం.

అరణ్యకాండ: 939-947

మున దండంబు న కమండలువు - నురు లలాటంబున నూర్ధ్వపుండ్రంబు 
కొలఁదులౌ వేళ్లను గుళపవిత్రములు - పొలుపొందు పేరురంబున జన్నిదములు 
రుదార వలకేల క్షమాలికయు - రిఁ బూని యున్న కాషాయవస్త్రములు 
తుసిపూసల పేర్లతోడ ముందటికి - నొప్ప నొక కొంత వాలిన మెడయు .
డుగు దేహంబును బావలు, చింపి - గొడుగును, వెడముడి గొన్నట్టి శిఖయు 
వడఁ గపట సన్న్యాసి వేషంబు - విసిల్ల వెడవెడ వేళ్లెన్ని కొనుచుఁ .
గొన్నిమంత్రంబులు గొణఁగుచు మునులు - న్నెఱింగెదరని త్తటించుచును, 
కొన్న ముదిమిచేఁ లవడంకంగ - యుచు నొలయుచు సు రుసు రనుచు 
నంతంత నిలుచుచు రి హరి యనుచు - శాంతిఁ బొందుచుఁ బర్ణశాల కేతెంచు

భావం: చేతిలో కమండలము, నుదుట వీబూధిరేఖలు, చేతివేళ్లకు పవిత్రములు, గుండెల మీద జంధ్యము, జపమాల, కాషాయ వస్త్రములు, తులసి పూసల మాలలతో వాలిపోయిత మెడ,  పావుకోళ్లు, చిరిగిపోయిన గొడుగు, ఒక పక్కగా జుట్టు ముడి - ఇలా కపట సన్యాసి వేషముతో, గబగబా వేళ్లు లెక్క పెట్టుకుంటూ, ఏవో మంత్రాలు గొణుగుతూ, ఎవరైనా మునులు తన వేషం గుర్తుపడతారేమేనని తత్తరతో, ముసలివాని లాగా తల వణుకుతూ, అసురుసురు అంటూ ఆయాసం నటిస్తూ, "హరి హరి" అంటూ, మెల్లగా పర్ణశాల వద్దకు వచ్చాడు.

--

పావలు = పావుకోళ్లు
వెడముట్టు = పక్కగా

--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/



Comments