Posts

Showing posts with the label సంగీతం

కనకన రుచిరా - త్యాగయ్య కృతి

  కనకన రుచిరా కనకవసన! నిన్ను  ॥కనకన॥ అర్థం: నిన్ను మరలమరలా చూడాలని (కన-కన) కోరికగా (రుచి) ఉన్నది! ఓ లక్ష్మీనివాసా! దినదినమును మనసున చనువున నిన్ను ॥కనకన॥ అర్థం: ప్రతిదినమూ మనసులో ఇష్టంతో నిన్ను ...(మరల మరల చూడాలని కోరికగా ఉన్నది) పాలుగారు మోమున శ్రీ యపార మహిమ దనరు నిన్ను ॥కనకన॥ అర్థం: పాలుకారుతున్న ముద్దులొలుకు ముఖాన్ని కలగిన నిన్ను... (మరల మరల చూడాలని కోరికగా ఉన్నది) కలకలమను ముఖకళగలిగిన సీత కులుకుచు నోరకన్నులను జూచె నిన్ను ॥కనకన॥ అర్థం: అందగాడివైన నిన్ను, జానకి తన ఓర చూపులతో చూచిన నిన్ను ... (మరల మరల చూడాలని కోరికగా ఉన్నది) బాలార్కాభ! సుచేల! మణిమయ మాలాలంకృత కంధర! సరసిజాక్ష! వర కపోల సురుచిర కిరీటధర! సతతంబు మనసారగ ॥కనకన॥ అర్థం: ఉదయిస్తున్న   సూర్యుడి తేజుడవైన నిన్ను, మంచి వస్త్రాలను ధరించే నిన్ను, మణిమయమైన మాలలతో అలంకరించిన నిన్ను, పద్మాలవంటి కన్నులు కలిగిన నిన్ను, చక్కటి చెక్కిళ్లు కలిగిన నిన్ను, అందమైన కిరీటము ధరించిన నిన్ను, ఎల్లప్పుడూ మనసు నిండునట్లుగా ... (మరల మరల చూడాలని కోరికగా ఉన్నది) సాపత్నీ మాతయౌ సురుచి వే కర్ణశూలమైన మాట వీనుల  చురుక్కున తాళక శ్రీహరిని ధ...

Mangalampalli Balamurali Krishna - Top 10

Introduction :  Mangalampalli Balamurali Krishna (aka. M. Balamurali Krishna aka Balamurali aka. BMK) is a versatile carnatic vocalist. There are innumerable introductions about him. Some detailed and some very detailed. So, I attempted to pick “Top 10” songs but quickly realized that it is a futile attempt. He sang so many songs that any “Top 10 songs” will not do justice. So, here are “Top 10 composers/genre” he has sung and immortalized. Top 10: Jayadeva (1170 - 1245) - Sanskrit BMK has tuned many of the songs of Geeta Govinda. He brought out the Sringara, viraha, playfulness of the lyrics. Here is a link . Annamacharya (1408 - 1503) - Telugu / Sanskrit BMK has tuned several kirtanas of Annamayya and sung them melodiously. Here is a link . Purandara dasa (1484 - 1564) - Kannada / Sanskrit Purandara dasa is considered moola purusha for modern carnatic classical. BMK has immortalized him. Here is a link . Bhadrachala Ramadasu (1621 - 1680) - Telugu BMK has popularized Ramadasu so...

రాగం తానం పల్లవి - ఒక పరిచయం

పరిచయం: “ రాగం తానం పల్లవి ” (రా.తా.ప), అంటూ సాగే పాట, శంకరాభరణం (1980) సినిమాలోనిది. వేటూరి వ్రాసారు. నా చిన్నప్పుడు, మా మేనమామ, మా అమ్మకు ఇంట్లోని ముగ్గురు పిల్లల క్షేమం అడుగుతూ, “రాగం, తానం, పల్లవి ఎలా ఉన్నారు?” అని ఉత్తరం వ్రాసాడట. మా అమ్మ, ఆ విషయం ఇప్పటికీ మరిపెంగా గుర్తుచేసుకుంటారు. నాకు చాలా కాలం, రా.తా.ప. అంటే ఫలానా సినిమాలోని పాట అనే తెలుసు. అసలు, రాగం-తానం-పల్లవి (రా.తా.ప - RTP ), నేటి కర్ణాటక సంగీత కచ్చేరీలలో ప్రదర్శించే ఒక ప్రక్రియ. ఈ వ్యాసం కార్ణాటక సంగీతంలోని ఈ ప్రక్రియ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికోసం వ్రాసినది. ప్రవేశం ఉన్నవారు సరదాకి చదువుకోవచ్చును. సంగీతంలోని లోతులలోకి పోకుండా పైపైన గీసే రేఖాచిత్రం మాత్రమే. రా.తా.ప - రేఖాచిత్రం:  రా.తా.ప అనే ప్రక్రియను గాత్రం (vocal) లేదా వాయిద్య (instrument) విద్వాంసులు చేయవచ్చు. వీరిని ముఖ్యవిద్వాంసులనుకుంటే, వారితో పాటే “పక్క వాయిద్యాలు” కూడా ఉంటారు. ఈ పక్క విద్వాంసులు సాధారణంగా, పాటకు సాయం ( వయెలిన్ లేక/ఇంకా వీణ ) చేసేవారు, తరువాత లయకు సాయం చేసే తాళ వాయద్యాలు (percussion - మృదంగం లేక/ఇంకా ఘటం ). రా.తా.ప ను మూడు ఘ...