అయోధ్యాకాండ: 592-609 - సీత మాటలు - రంగనాథ రామాయణం

 సందర్భము: తనను వెంట రానివ్వమని సీత శ్రీరాముడిని వేడుకొనుట

అయోధ్యాకాండ: 592-609 

యెఱిఁగి నే చేసితినే మున్ను తప్పు - చి చేసితి నేను న్నింపు నన్ను 
టు శిలా కుటిలక ప్రచుర దేశములు -  నిన్ను గొలిచిరా లఁతయు లేదు 
రుణమై నీ విచ్చు కంద మూలములు - రుదార నమృతంబు వియును నాకు 
భావించి చూచిన బ్రాణ బంధుఁడవు - నీవె కావున వత్తు నీ తోడఁ బ్రీతి
భావం: (రామా!) నేను తెలిసీ చేసిన తప్పు ఏమీ లేదే? తెలియక చేసిన తప్పులుంటే మన్నించు. రాతి నేలలు, ఎగుడుదిగుడు నేలలు, ఎటువంటి చోటులయినా నాకు లెక్క లేదు, ప్రేమతో నీవు ఇచ్చు కందమూలాలు కూడా నాకు అమృత సమానము. నా ప్రాణాధారము నీవే కావున నీతో ఇష్టంగా వస్తాను.  

కుడు చింతింప నని చింతింప - ను నిష్టులగు బంధు నులు చింతింప 
నాథ సహధర్శచారిణి యందు - కునిచే నగ్నిసాక్షి గైకొంటి; 
లోక నుతుఁడవు త్యసంధుఁడవు - ను డించి నీకుఁ గాల కేగఁ దగునె ?
భావం: నా తండ్రి, తల్లి, బంధువులు అడ్డు చెప్పినా, నేను నీ సహధర్మచారిణి అని చెప్తాను, అగ్ని సాక్షిగా నిన్ను పొందాను. సర్వజనులచే నుతించబడువాడవు, సత్యసంధుడవు, నన్ను విడిచి నీవు అడవులకు వెళ్లుట తగునా?

యెన్ని దుఃఖము లైన నెన్నికఁ గాదు - న్నియు సౌఖ్యంబు గును నీ దయను
వాడ లీమేడ లీబంధు బృంద - మీ స్తుసంపద లీజీవనంబు 
నీవు లేకున్నచో నిస్సారమరయ - గావున నిచట నే రణి వేగింతు? 
భావం: ఎన్ని దుఃఖములైనా లెక్క లేదు. నీ దయ ఉంటే అన్ని సౌఖ్యములు కలుగుతాయి. ఈ వాడలు, ఈ మేడలు, ఈ బంధువులు, ఈ వస్తుసంపదలు, ఈ జీవితము నీవు లేకపోతే నిస్సారము. కావున ఇక్కడ నేను ఎట్లా ఉండగలను.

సావిత్రియను పుణ్యతి తనపతిని - సేవించినట్టి యా చెలువున నేను 
నీవెంట జనుదెంతు నీ నీడఁ బోలె - నావంటి సాధ్వికి దియె ధర్మంబు 
నినుఁ బాసి యిచ్చోట నిమిష మేనోర్వ - ముల నినుఁగూడి ర్తింపపనేర్తుఁ 
దునాలుగేండ్లల పాసెదనేను - దిసి వెయ్యేండ్లైనఁ డువేడ్కఁ గొలుతు 
భావం: సావిత్రి అనే పుణ్యవతి, తన భర్తను సేవించిన రీతి, నేను నీ వెంట, నీ నీడలాగా వస్తాను. నా వంటి భార్యకు అదే ధర్మము. నిన్ను విడచి ఈ చోట నిమిషము కూడా ఓర్వలేను. అడవులలో నిను కూడి పధ్నాలుగేళ్లు ఉంటాను.  వెయ్యేళ్లైనా సంతోషంగా ఉంటాను.

తులకుఁ బతులకు ను లెంచఁ దగిన - ము ప్రతిష్టింపు ఱి వేయునేల 
నీరణ్యములకు నిట నన్నువిడిచి - పోవుట నిజమైన బోవు బ్రాణములు 
లుకమై గాదేని గ్నిచే నైన - ముచే నైన విషంబుచే నైన 
యేచిన వగలతో నిట జత్తు నేను - నా చూపు డించిపో ను దించిపోకు 
భావం: ప్రజలు మెచ్చు భార్యాభర్తలుగా నడుచుకుందాము. నీవు అడవులకు నన్ను విడచి వెడితే నా ప్రాణాలు పోవుట నిజము. అలాగున కాదని నన్ను విడిచిపోతే, అగ్ని చేతనైనా, జలము చేతనైనా,  విషము చేతనైనా, బాధతో నేను ప్రాణం విడుస్తాను. నన్న వదలి వెళ్లుకు.

--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/

Comments