89-97 : చంద్రుని వర్ణన - రంగనాథ రామాయణం - ద్విపద కావ్యం

సందర్భము - హనుమంతుడు లంకంతా వెతకి చివరకు అంతఃపురం చేరినాడు. చంద్రుడు గొప్పగా ఉన్నాడు.

89-97

యంతఃపురము చేర రుగునా వేళఁ - గంతునిమామ సత్కళలకు సీమ
లువలపైఁ బ్రేమల చందమామ - లిత బింబ లలామ తి నుదయించి
రాశిఁ దేలించి లజ షండముల - ల వాసి దూలించి గిబ్బిజక్క వల (?)
విహార్తి నెలయించి వెడ వింటివాని - కీర్తి నలయించి వాడిన కలువ
మొత్తము నలరించి ముగ్ధ జారిణుల - చిత్తంబు లదరించి చిమ్మచీఁకటుల
పంతంబు దరలించి దునైన చంద్ర - కాంతంబుఁ గరఁగించి ల చకోరముల
విందులఁ దనియించి విటవిటీ జనుల - పొందుల నలయించి పూర్ణచంద్రికల
దిక్కుల కెల్లను దెలివి దీపించి - చుక్కల గమిగాఁడు చూపట్టె మింట
పాని వీ డెల్లఁ రికింప వలసి - దేత లెత్తిన దీపమో యనఁగ

భావం: హనుమంతుడు లంకలో అంతఃపురము చేరుకున్న సమయంలో, చందమామ, సముద్రం నుండీ పైకి వచ్చి, తామర పూవుల వాసి తగ్గించి, కలువ పూలను అలరించి, మగువల హృదయాలను కదల్చి, చీకటిని పోగొట్టి, చంద్రకాంత శిలలను కరగించి, చకోర పక్షులకు వెన్నెల విందులు చేసి, అందరికీ శృంగార భావనలు కలిగిస్తూ చక్కటి వెన్నెల పరిచాడు. ఆ చందమామ, సీతాదేవిని వెతుకటానికి వీలుగా, దేవతలు ఎత్తిన దీపమేమో అన్నట్లుగా ఉన్నది.  


--

జలజ షండము = పద్మముల సమూహము

--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/


Comments