అరణ్యకాండ: 1451-1469 - ఋష్యమూక పర్వత వర్ణన - రంగనాథ రామాయణం

సందర్భము: శ్రీరాముడు ఋష్యమూక పర్వత ప్రాంతం చేరుకుని, ఆ ప్రాతం వర్ణించుట. 

అరణ్యకాండ: 1451-1469

త్రైలోక్య విభులైన మ రాక చూచి - యాలోలమతి పొంగి యానంద మంది 
యంబు నొప్పెడు శ్రు పూరంబు -  సెలయేరుల మరిన దాని,
భావం: శ్రీరాముడు, లక్ష్మణుడు రాక చూసి, నదులన్నీ ఆనందబాష్పాలు కార్చుతున్నాయా అన్నట్లుగా సెలయేరులు పారుతున్నాయి.

నిల మేరుమందర హిమశైలపతులు - లిమీఱి నగియెడి గవులో యనఁగ 
సాంద్రంబులై యెందుఁ రుల దీపించు - చంద్రకాంతో పలచ్ఛాయల దాని, -
భావం: మేరు పర్వతం, మంథర పర్వతం, హిమాచలానికి ధీటుగా ఉన్న ఋష్యమూక పర్వతం నుండి వెలువడు జలధారల నుండి చల్లటి కాంతులు వస్తున్నాయి. 

సిజాసనుఁడు భూక్రంబు మీఁద - రఁగఁ బర్వత రాజట్టంబు గట్టి 
శిసునఁ బెట్టిన సేసఁ బ్రాలనఁగ - నురుశృంగములఁ జుక్క లొప్పెడి దాని, 
భావం: బ్రహ్మదేవుడు భూచక్రము మీద ఈ పర్వతానికి పట్టంకట్టి, ఆశీర్వదిస్తూ తలమీద వేసిన అక్షతల వలే, ఆ పర్వతశిఖరాల మీద చుక్కలు ఉన్నాయి.  

ను
రుమతిఁ దనుఁ జొచ్చి యున్న సుగ్రీవుఁ - రిభవించిన వాలిపై మండుచుండు 
తి సూర్య కాంతముల్ లయవెలుంగ - తుల ప్రతాపోగ్రమై యున్నదాని 
భావం: సుగ్రీవుని అవమానించిన వాలిపై కోపంతో మండిపడున్నట్లుగా సూర్యుడు ఈ పర్వతం మీద తన ప్రతాపము చూపిస్తున్నట్లుగా ఉన్నది.

మె
ఱుఁగులు కొమ్ములై మెఱయ నేతెంచి - నెయు సానువులందు నీలమేఘములు 
పొలుపొందు మదగజంబులు గాఁగఁ దలఁచి - యు సామజముల మా నైనదాని 
భావం: కొండ మీది నీలిమేఘాలు, వాటిలోని మెరుపులు చూస్తుంటే, అడవులలో తిరుగుతున్న మదపుటేనుగులు, వాటి దంతాలు వలే ఉన్నది. 

నం
జ హరు మౌళి లరు నాకాశ - గంయై యొప్పులఁ ర మొప్ప నొప్పి -
యాయెడఁ గ్రీడించు హంసమాలికలు - మాని విధు శిరో మాలికల్ గాఁగ -
హు శృంగ భూరుహ ల్లవ చయము - విహిత జటాజూట విభవమై యొప్ప
నాన్నులై సిద్ధుర్థి, సేవింప -  నాదాశివమూర్తి న నొప్పుదాని, 
భావం: శివుని తలపై ఉన్న ఆకాశగంగ చెంతన క్రీడించు హంసల వరుసలు, ఈ పర్వతానికి తలలో పెట్టుకున్న దండల వలె, అనేక శిఖరాలు, చెట్లు కలసి, ఆ శివుని విడువడిన జటాజూటము లాగా, అక్కడ ఉన్న సిద్ధులు సేవించే సదాశివుని లాగా ఆ పర్వతం ఉన్నది.

భేది మొదలుగాఁ రఁగు దేవతలు - య నంబుధి ద్రోచ్చి న్న వస్తువులు 
నివడి తమలోనఁ బాలు పోకున్న - నునిచిరో యమృతపానోన్మత్తు లగుచు -
చిరో యంతయు మంచితా వగుటఁ - దెఱఁగొప్ప దాచిరో దీనిపై ననఁగఁ 
ల్పవృక్షంబులఁ గామధేనువుల - వేల్పుకన్నియలను వివిధౌషధములఁ 
జింతామణుల నెందుఁ జెడని పెన్నిధుల - సంతాన తరువులు రి నొప్పుదానిఁ
భావం: ఆనాడు సముద్ర మథనంలో బయటకు వచ్చిన అనేక వస్తువులు రావటం వలన వదలిపోయారో, లేదా ఆ అమృతము తాగిన మత్తులో మరచిపోయారో, లేదా కావాలనే దాచిపెట్టారో, ఈ కొండ మీది వృక్షములు, కల్పవృక్షముల వలే, కామధేనువలుగా రకరకాల ఔషధాలు, చింతామణులు ప్రసాదిస్తూ ఉన్నాయి.


--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/

Comments