అయోధ్యాకాండ - 251-260 - కైకేయి నిష్ఠూరములు - రంగనాథ రామాయణం
సందర్భము: కైకేయి దశరథుడిని నిష్ఠూరమాడుట.
అయోధ్యాకాండ - 251-260
రాజేంద్ర సత్య పరాక్రమ స్ఫూర్తి - పూజిత కీర్తివై బొంకంగఁ దగునె?
ఇట్టి దేవతలంద రెఱుఁగంగ నొట్టు - పెట్టి తప్పెద వెట్టి పృథివి పాలుఁడవు ?
ఒక గువ్వకై తన యొడలి మాంసంబు - నొక డేగకును శిబి యొసఁగఁడె మున్ను ?
క్షోణిదేవున కలర్కుం డనురాజు - త్రాణతో నొసఁగఁడె తన లోచనములు ?
చెలరేఁగి జలధియుఁ జెలియలికట్ట - బలిమి దాఁటక లోను బడియుండలేదె ?
యది యటులుండె నీ యన్వయభవులు - మదిలోన నవ్వులమాటలకై న
కలలోన బొంక రిక్ష్వాకుండ వయ్యు - వెలయఁ గొసల్యకు వెఱచి బొంకెదవు.
బొంకెడువాఁ డొక్క పురుషుఁడే యనుచు - బొంకితి ననుఁ బొంద బుద్ధిగా దింక
విచ్చలవిడి నేను విష మైన మ్రింగి - చచ్చెద నటమీఁదఁ జంపింపు భరతుఁ
బావనుఁ డగు రాముఁ బట్టంబు గట్టు - నీవు కౌసల్యయు నెమ్మదినుండు

భావం: ఓ రాజా! సత్యమనే పరాక్రమము కలవాడవనే కీర్తి సంపాదించిన వాడివి, నీవు బొంక వచ్చునా? దేవతలందరూ సాక్షిగా ఒట్టు పెట్టి ఇప్పుడు తప్పుతానంటావా? ఒక పావురం కోసం శిబి చక్రవర్తి డేగకు తన శరీరములోని మాంసము ఇవ్వలేదా? అలర్కుడు అనే రాజు ఇచ్చిన మాటకోసం తన కళ్లు ఇవ్వలేదా? సముద్రుడు ఇచ్చిన మాటకు కట్టుపడి గట్టులోపలే ఉన్నాడు కదా? అవి అన్నియు కాదు కానీ, నీ వంశస్తులు హాస్యానికైనా, కలలోనైనా బొంకరు కదా. అటువంటి ఇక్ష్వాక వంశజుడవు, కౌసల్యకు భయపడి బొంకుతున్నావు. బంకువాడు అసలు మనిషేనా? నేను నీకు దక్కను. ఇక నేను విషము మింగి చచ్చెదను. తరువాత భరతుడను చంపించు. పావనమూర్తి అగు శ్రీరాముడికి పట్టు కట్టుకో. నీవు, కౌసల్య సుఖంగా ఉండండి.
--
త్రాణ = బలము, శక్తి
చెలియలికట్ట = సముద్రపు గట్టు
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
Comments
Post a Comment