80-87 : హనుమంతుడు లంకలో వెతకుట - 3 - రంగనాథ రామాయణం - ద్విపద కావ్యం

సందర్భము - హనుమంతుడు లంకలో సీతాదేవి కోసం, రకరకాల ప్రదేశాలను, ప్రముఖుల ఇళ్లను వెతికి అంతఃపురం చేరుకున్నాడు.

సుందరాకాండ: #80 - #87

కరతోరణబద్ధ మాల్యజాలములఁ - బ్రకటిత ధూపసౌభవిశేషముల
త్నముక్తాఫల రంగవల్లికల - నూత్నేందుకాంతబంధుర వితర్దికల
ణిగణహాటకయ కవాటముల - నాధికోగ్ర విష్కంభసూత్రముల
స్ఫుటవజ్రకలిత కపోతమాలికల - టితేంద్ర నీలప్రకాశదేహళుల
రకత స్థగిత నిర్మలగవాక్షములఁ - గురువింద సందీప్త కుట్టిమస్థలుల
హనీయతర విద్రుస్తంభతతుల - హుశిరోగృహముల వనపాళికల
నాయధోజ్జ్వలహస్తునైన రాక్షసులఁ - బాయక యే ప్రొద్దు లసినయట్టి
రాణునగరు చేరఁగఁబోయి యచటఁ - గావలివారలఁ లయ శోధించి

భావం: మకర తోరణాలతోనూ, ధూప సౌరభాలతోనూ, రత్నాలతో పొదిగిన ముగ్గులతోనూ, మెరుస్తున్న అరుగులతోనూ, బంగారు తలుపులతోనూ, పెద్దపెద్ద గడియలతోనూ, గాలికి ఊగుతున్న మాలికలతోనూ, దివ్యమైన వెలుగులతో ఉన్న శిల్పాలతోనూ, పెద్దపెద్ద చెట్లతో, భవనాలతో, భయంకరమైన ఆయుధాలతో ఉన్న రాక్షసులతోనూ ఉన్న రావాణాసురుని అంతఃపురం దగ్గరకు పోయి, అక్కడు ఉన్న కావలి వాళ్లను చూసి...

-- 
వితర్ది = అరుఁగు, వేదిక
హాటక = బంగారు
కవాటము = తలుపు
విష్కంభము = అడ్డంకి
కపోత = గాలికి కదులునది
కుట్టిమ = శిల్పాదులతో కట్టబడిన నేల
విద్రుమ = చెట్టు
పాళిక = సముదాయము


--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php

Comments