Posts

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 47

ఈ భాగంలో కూడా రాక్షసుల దూకుడు వ్యవహారం చిత్రించే పద్యాలు చూద్దాం. గత రెండు భాగాల లాగానే పక్కపక్క పద్యాలు. ముందుగా కథా సందర్భం. సప్తమ స్కంధలోని ప్రహ్లాద చరిత్రలోనివి. ప్రహ్లాదుడు జన్మించక ముందు జరిగినది. హిరణ్యాక్షుడిని శ్రీమహావిష్ణువు వరాహవతారం ధరించి సంహరించాడు. అతడి అన్న, హిరణ్యకశిపుడు విష్ణువు ఉన్న చోట్లను, తన అనుచరులతో, నాశనం చేయించాడు. మృత్యువును, దేవతలను, విష్ణువును జయించాలని తీవ్రమైన తపస్సు చేసి, బ్రహ్మదేవుడి నుంచి వరాలను సంపాదించాడు. ఆ వరాల గర్వంతో, తన సోదరుడిని చంపారన్న పగతో, ముల్లోకాలనూ తానే స్వయంగా నాశనం చేస్తున్నాడు. అతడి అనుచర గణం కూడా అందరినీ గద్దిస్తూ బెదిరిస్తున్నారు. ఇవిగో పద్యాలు. 7-95-సీ.  (హిరణ్యకశిపుడు నాశనం చేయుట) సీ. ఒకనాఁడు గంధర్వ యూధంబుఁ బరిమార్చు దివిజుల నొకనాఁడు దెరలఁ దోలు భుజగుల నొకనాఁడు భోగంబులకుఁ బాపు గ్రహముల నొకనాఁడు గట్టివైచు నొకనాఁడు యక్షుల నుగ్రత దండించు నొకనాఁడు విహగుల నొడిసిపట్టు నొకనాఁడు సిద్ధుల నోడించి బంధించు మనుజుల నొకనాఁడు మదము లడఁచు తే. కడిమి నొకనాఁడు కిన్నర ఖచర సాధ్య చారన ప్రేత భూత పిశాచ వన్య సత్త్వ విద్యాధరాదుల సంహరించి దితితనూజుండు దుస...

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 46

గత భాగంలాగానే, ఈ భాగంలో కూడా రాక్షసుల అత్యుత్సాహాన్ని తెలియజేసే పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భం. సప్తమ స్కంధంలోని ప్రహ్లాదచరిత్రలోని పద్యాలు. ప్రహ్లాదుడు జన్మించడానికి ముందు జరిగిన విషయం. ప్రహ్లాదునికి తండ్రి హిరణ్యకశిపుడు, పినతండ్రి హిరణ్యాక్షుడు. శ్రీమహావిష్ణువు వరాహ అవతారం ధరించి, హిరణ్యాక్షుడిని సంహరించాడు. ఆ విషయం తెలుసుకున్న హిరణ్యకశిపుడు, తన తమ్ముని చావుకు ప్రతీకారంగా,  తన రాక్షస గణాలను ప్రేరేపిస్తున్నాడు. ఇవిగో పద్యాలు. 7-34-సీ.  (హిరణ్యకశిపుడు రాక్షసులను ప్రేరేపించుట) సీ. పొండు దానవులార! భూసురక్షేత్ర సంగత యైన భూమికి గములు గట్టి మఖతప స్స్వాధ్యాయ మౌనవ్రతస్థుల వెదకి ఖండింపుఁడు విష్ణుఁ డనఁగ నన్యుఁ డొక్కఁడు లేఁడు యజ్ఞంబు వేదంబు నతఁడె భూదేవ క్రియాది మూల మతఁడె దేవర్షి పిత్రాది లోకములకు ధర్మాదులకు మహాధార మతఁడె    గీ. యే స్థలంబున గో భూసురేంద్ర వేద వర్ణ ధర్మాశ్రమంబులు వరుస నుండు నా స్థలంబుల కెల్ల నీ రరగి చెఱిచి దగ్ధములు సేసి రండు మీ దర్ప మొప్ప. 7-36-సీ.  (రాక్షసులు నాశనం చేయుట) సీ. గ్రామ పురక్షేత్ర ఖర్వట ఖేట ఘో షారామ నగరాశ్ర మాదికములు గాలిచి కొలఁకు...

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 45

ఈ భాగంలో రాక్షసుల అత్యుత్సాహాన్ని చూపించే పద్యాలు చూద్దాం. రెండూ వరుస పద్యాలు. ముందుగా కథా సందర్భం. దశమ స్కంధం పూర్వభాగం లోనివి. వసుదేవుడు శ్రీకృష్ణుడుని రేపల్లెలో యశోదానందుల ఇంటిలో ఉంచి అక్కడ పుట్టిన యోగమాయను తీసుకొని వచ్చాడు. కంసుడు ఆ ఆడపిల్లను చంపబోతే, ఆమె ఆకాశానికి ఎగిరిపోయి కంసుడిని, "నిన్ను సంహరించే వాడు వేరే చోట పెరుగుతున్నాడు" అంటూ హెచ్చరించింది. కంసుడు తన మంత్రులందరినీ సమావేశ పరిచాడు. అసలు విష్ణువు ఎక్కడ ఉంటాడో, ఆయా స్థలాలను, వస్తువులను ముందుగా నాశనం చేసేస్తే మంచిది అంటూ ముందుగా వారి నుంచి ఒక సలహా వచ్చింది. ఇవిగో పద్యాలు. 10.1-168-మ. (విష్ణువు ఉండే చోట్లు) అమరశ్రేణికి నెల్లఁ జక్రి ముఖరుం డా చక్రి యేధర్మమం దమరున్; గోవులు భూమిదేవులు దితిక్షామ్నాయ కారుణ్య స త్యములున్ యాగ తపోదమంబులును శ్రద్ధాశాంతులున్ విష్ణుదే హము లిన్నింటిని సంహరించిన నతం డంతంబునుం బొందెడిన్. 10.1-170-ఉ. (నాశనం చేయుటకు ఉత్సాహం) చంపుదుమే నిలింపులను? జంకెల ఱంకెలఁ దాపసావళిం బంపుదుమే కృతాంతకుని పాలికిఁ? గ్రేపులతోడ గోవులం ద్రుంపుదుమే? ధరామరులఁ దోలుదుమే? నిగమంబులన్ విదా రింపుదుమే? వసుంధర హరింపుదు మే? జననాథ...

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 44

ఈ భాగంలో శ్రీహరి చింతన చేసే పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. సప్తమ స్కంధంలోని ప్రహ్లాద చరిత్రలోనిది. హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. ఆ సమయంలో గర్భంతో ఉన్న అతడి భార్య లీలావతికి నారదుడు ఆశ్రయం కల్పించాడు. రోజూ శ్రీమహావిష్ణువు గురించి బోధించేవాడు. కడుపులోనున్న బిడ్డ ఆ కథలన్నీ విని, పుట్టినప్పటి నుండే శ్రీహరి యందు భక్తి పరాయణుడిగా ఉండేవాడు. ఆ ప్రహ్లాదుడు ఏమి చేసినా సదా శ్రీహరి ధ్యానమే.  రెండవది. దశమ స్కంధం - పూర్వ భాగంలోనిది. చెరసాలలో ఉన్న దేవకి అష్టమ గర్భం ధరించింది. కంసునికి ఎక్కడ చూసినా, ఏమి చేస్తున్నా ఆ శ్రీహరి ధ్యానమే. ఇవిగో పద్యాలు. 7-123-శా. పానీయంబులు ద్రావుచున్‌ గుడుచుచున్‌ భాషింపుచున్‌ హాస లీ లా నిద్రాదులు సేయుచున్‌ దిరుగుచున్‌ లక్షింపుచున్‌ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సం ధానుం డై మఱచెన్‌ సురారిసుతుఁ డే త ద్విశ్వమున్‌ భూవరా! 10.1-85-క. తిరుగుచు గుడుచుచు ద్రావుచు నరుగుచు గూర్చుండి లేచు చనవరతంబున్‌ హరి దలచి దలచి జగమా హరి మయమని జూచె కంసు డారని యలుకన్‌ ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండింటి లోనూ, సదా శ్రీహరి ధ్యానములో నిమగ్నమైన వ్యక్తులను...

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 43

ఈ భాగంలో శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శన చక్రాన్ని వర్ణించే పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. ప్రధమ స్కంధంలోనిది. ఉపపాండవులను చంపిన అశ్వత్థామను చంపకుండా, పాండవులు, కేవలం తలలోని మణిని పెరికి విడిచిపెట్టేసారు. అశ్వత్థామ, ఉత్తర కడుపులోనున్న బిడ్డ మీదకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆమె వచ్చి శ్రీకృష్ణునికి మొర పెట్టుకుంది. అంగుష్ఠమాత్రుడై, భగవంతుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. రెండవది. అష్టమ స్కంధంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలోనిది. మొసలితో పోరాడుతూ గజేంద్రుడు అలసిపోయాడు. భగవంతునికి శరణాగతి చేసాడు. వైకుంఠపురములోనున్న శ్రీహరి హుటాహుటిన వచ్చి, తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఇవిగో పద్యాలు. 1-184-మ.  (ఉత్తర గర్భాన్ని రక్షించుట) తన సేవారతిచింత గాని పరచింతాలేశమున్ లేని స జ్జనులం బాండుతనూజులన్ మనుచు వాత్సల్యంబుతో ద్రోణనం దను బ్రహ్మాస్త్రము నడ్డుపెట్టఁ బనిచెన్ దైత్యారి సర్వారి సా ధన నిర్వక్రము, రక్షితాఖిల సుధాంధశ్చక్రముం, జక్రమున్ 8-109-మ.  (గజేంద్రుడిని రక్షించుట) కరుణాసింధుఁడు శౌరి వారిచరమున్ ఖండింపఁగాఁ బంపె స త్త్వరితాకంపిత భూమిచక్రము, మహోద్యద్విస్ఫులింగచ్ఛటా పర...

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 42

ఈ భాగంలో పద్య శిల్పం ద్వారా చెప్పే విషయాన్ని కవి ఎలా పండిస్తాడో చూద్దాం. రెండూ, ప్రథమ స్కంధంలోని, ఒకటే కథా సందర్భంలోనివి. మొదటిది. సూతుడు సౌనకాది మునులకు భాగవతం చెప్పడం మొదలు పెట్టాడు - మహాభారత యుద్ధం పూర్తయింది. తొడలు విరిగి పడి ఉన్న దుర్యోధనుడికి, "పాండవుల వంశ నాశనం చేస్తా"నని, అశ్వత్థామ మాట ఇచ్చాడు. రాత్రిపూట వెళ్లి, నిదురిస్తున్న ఉప పాండవులను చంపివేశాడు. పారిపోయిన అశ్వత్థామను అర్జునుడు, శ్రీకృష్ణుడు వెళ్లి పట్టుకున్నారు. ఆవేశంలో ఉన్న అర్జునుడిని కృష్ణుడు, అశ్వత్థామను ఎందుకు చంపకూడదో చెప్తున్నాడు. రెండవది. అశ్వత్థామను బంధించి, విలపిస్తున్న ద్రౌపది దగ్గరకు, తీసుకువచ్చారు. నిదురిస్తున్న వారిని చంపడానికి నీకు చేతులెలా వచ్చాయని ద్రౌపది, అశ్వత్థామను ప్రశ్నిస్తోంది. ఇవిగో పద్యాలు. 1-156-చ. (శ్రీకృష్ణుడి మాటలు) వెఱచినవాని, దైన్యమున వేఁదుఱు నొందినవాని, నిద్ర మై మఱచినవాని, సౌఖ్యమున మద్యము ద్రావినవాని, భగ్నుడై పఱచినవాని, సాధు జడభావమువానిని, గావు మంచు వా చఱచినవానిఁ, గామినులఁ జంపుట ధర్మము గాదు, ఫల్గునా! 1-163-శా. (ద్రౌపది మాటలు) ఉద్రేకంబున రారు, శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కి...

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 41

ఈ భాగంలో భాగవతంలోని కథా ప్రారంభంలోని పద్యాలు రెండు చూద్దాం. మొదటిది. శౌనకాది మహామునులు, నైమిశారణ్యంలో ఉన్న సూతుని దగ్గరకు వచ్చారు. భగవంతుని గురించి చెప్పమని అడిగారు. సూతుడు భాగవతం చెప్పటానికి నిర్ణయించుకుని, "ఈ భాగవతాన్ని వ్యాసుడు, తన కుమారుడైన శుక మహర్షికి చెప్పాడు. ఆ శుక మహర్షి, గంగానదిలో ప్రాణం విడవబోతున్న పరీక్షిత్తు మహారాజుకు చెప్పాడు" - అంటూ మొదలుపెట్టాడు. "అదేమిటీ అత్యంత బలము, సంపద, వంశము కలిగిన పరీక్షిత్తు అన్నీ వదులుకొని ప్రాణాలు విడవటమేమిటి. వివరంగా చెప్పండి" అంటూ కథలో లీనమవుతున్నారు శౌనకాది మునులు. రెండవది. సూతుడు కథ మొదలు పెడుతున్నాడు. మహాభారత యుద్ధము పూర్తయింది. శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వెడుతున్నాడు. కుంతీదేవి శ్రీకృష్ణుడిని చూడటానికి వచ్చింది. ఇంత కాలం తననూ, తన సంతానాన్ని కాపాడిన శ్రీకృష్ణుడికి నమస్కృతులు తెలియచేసుకుంటోంది. 1-79-సీ. (శౌనకాదుల ప్రశ్న)  పాండవ వంశంబు బలము మానంబును వర్ధిల్లఁ గడిమి నెవ్వాఁడు మనియెఁ బరిపంథిరాజులు భర్మాదిధనముల నర్చింతు రెవ్వని యంఘ్రియుగముఁ గుంభజకర్ణాది కురుభటవ్యూహంబు సొచ్చి చెండాడె నే శూరుతండ్రి గాంగేయసైనికాక్రాంత గోవర్గ...

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 40

ఈ భాగంలో బాలకృష్ణుడి మీద రెండు పద్యాలు చూద్దాం. రెండూ దశమస్కంధం పూర్వభాగంలోనివి. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. బాలకృష్ణుడికి సుమారు మూడు నెలల వయసు. ఒత్తిగిల్ల పడుతున్నాడని, యశోద నలుగురినీ పిలిచి పేరంటం చేసింది. ఆ హడావుడి అయినాక పిల్లవాడిని పడుకోపెట్టింది. ఆ పడుకొన్న పిల్లవాడికి ఆకలివేసింది. అటూఇటూ కదులుతూ, కాళ్లూచేతులు ఆడిస్తూ ఒక బండిని తన్నాడు. ఆ బండిరూపంలో ఉన్న మాయా రాక్షసుడు ఆకాశంమీదకు ఎగిరి క్రిందపడి చనిపోయాడు. పక్కనే ఉన్న పిల్లలు బాలకృష్ణుడే తన్నాడని చెప్పారు. "పిల్లవాడేమిటి బండిని తన్నటమేమిటి" అంటూ గోపగోపికలు ఆశ్చర్యపోతున్నారు. రెండవది. కృష్ణుడికి ఏడు సంవత్సరాల వయస్సు. తనకి పూజచేయడం లేదని, ఇంద్రుడు గొప్ప గాలివాన కురిపించాడు. అందరిని రక్షించేందుకు, బాలకృష్ణుడు, చిటికెన వ్రేలిపైన గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. దాని క్రిందకు చేరడానికి కొందరు సందేహిస్తున్నారు. "ఇతడు పిల్లవాడు, అంత పెద్దకొండని ఎత్తి ఉంచగలడా అని సందేహించకండి" అంటూ వారికి కృష్ణుడు చెప్తున్నాడు. ఇవిగో పద్యాలు. 10.1-257-శా. "బాలుం డెక్కడ? బండి యెక్కడ? నభోభాగంబుపైఁ జేడ్పడం గాలం దన్నుట యెక్క? డేల పడు...

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 39

ఈ భాగంలో పంచభూతాలకు అధిపతి అయిన భగవంతుని గురించిన రెండు పద్యాలను చూద్దాం. రెండూ ఎనిమిదవ స్కంధంలోనివి. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. ఎనిమిదవ స్కంధంలోని రెండవ ఘట్టం, సముద్ర మథనం లోనిది. దేవతలు, రాక్షసులు మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని సముద్రాన్ని చిలుకుతున్నారు. మొదట హాలాహలం పుట్టింది. అందరూ వెళ్లి, "పంచభూతాలకూ అధిపతివి నీవే" అని శివుడిని శరణుకోరుతున్నారు.  రెండవది. ఎనిమిదవ స్కంధంలోని మూడవ ఘట్టం. వామన చరిత్రలోనిది. శ్రీమహావిష్ణువు, వామన అవతారమెత్తి బలి చక్రవర్తిని మూడు అడుగులు అడిగాడు. బలి తాను ఇచ్చిన మాట ప్రకారం దానం చేసాడు. వామనుడు, భూమి, ఆకాశాన్ని ఆక్రమించి మూడవ అడుగుతో బలి "తల"ను తొక్కివేసి, బంధించాడు. బ్రహ్మదేవుడు వచ్చి, "పంచభూతాలకూ అధిపతివి నీవే! అంతటి దానపరుడుని బంధించడం న్యాయమా!" అని అడుగుతున్నాడు. 8-222-సీ.   (శివునితో బ్రహ్మాది దేవతలు) భూతాత్మ! భూతేశ! భూత భావనరూప! దేవ! మహాదేవ! దేవవంద్య! యీ లోకముల కెల్ల నీశ్వరుండవు నీవ; బంధమోక్షములకుఁ బ్రభుఁడ వీవ; యార్త శరణ్యుండ వగు గురుండవు నిన్నుఁ; గోరి భజింతురు కుశలమతులు; సకల సృష్టిస్థితిసంహారకర్తవై; బ్రహ్మ ...

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 38

ఒక ప్రశ్నకు బదులు చెప్పడం కన్నా జోడీ ఏముంటుంది? అది కూడా ఒక రకమైన ద్వంద్వమే. ఈ భాగంలో ఇటువంటి "ప్రశ్న-బదులు" చూద్దాం. ముందుగా కథా సందర్భం. ఎనిమిదవ స్కంధంలోని వామన అవతార ఘట్టంలోనివి. శ్రీమహావిష్ణువు, కపట వడుగు వేషంలో బలి చక్రవర్తి దగ్గరకు వెళ్లాడు. బలి చక్రవర్తి ఏమి కావాలో కోరుకోమని తన దగ్గర సంపద చిట్టా చదివేడు. వామనుడు తనకు మూడు అడుగుల మేర చాలునని చెప్పాడు. "అంతేనా? ఇంకా ఏమైనా కోరుకో" అంటున్నాడు బలి చక్రవర్తి. "ఈ మాత్రం చాలు" అని బదులు ఇస్తున్నాడు వామనుడు. ఇవిగో పద్యాలు. 8-570-మ. (బలి ప్రశ్న) "వసుధాఖండము వేఁడితో? గజములన్ వాంఛించితో? వాజులన్ వెసనూహించితొ? కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో? పసి బాలుండవు; నేర వీ వడుగ; నీ భాగ్యంబు లీపాటి గా కసురేంద్రుండు పదత్రయం బడుగ నీ యల్పంబు నీ నేర్చునే?" 8-572-మ. (వామనుడి బదులు) గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో, వడుఁ గే నెక్కడ భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్. ఇప్పుడు ద్వంద్వ శిల...

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 37

 ఈ భాగంలో వామనుడి నడకను వర్ణించే పద్యాలను చూద్దాం. అన్నింటి కథా సందర్భాలు ఒకటే. అష్టమ స్కంధంలోని వామనావతార ఘట్టంలోనివి. కశ్యప మహర్షి, అదితి పుత్రుడయిన వామనుడు, ఇంద్రునికి  మరలా రాజ్యం ఇప్పించాలనే ఉద్దేశంతో బలి చక్రవర్తి దగ్గరకు వెళ్తున్నాడు. ఆ సమయంలో బలి గొప్పయాగం చేస్తున్నాడు. పొట్టివాడయిన వామనుడు అందరిని పలుకరిస్తూ బలి చక్రవర్తి ఉన్న చోటుకు చేరుకున్నాడు. ఇవిగో పద్యాలు. 8-526-క. హరిహరి! సిరియురమునఁ గల  హరి హరిహయు కొఱకు దనుజునడుగన్‌ జనియెన్‌ బరహితరతమతియుతు లగు  దొరలకు నడుగుటలు నొడలి తొడవులు పుడమిన్‌.  8-538-క వెఱచుచు వంగుచు వ్రాలుచు  నఱిముఱి గుబురులకుఁ జనుచు హరిహరి! యనుచున్‌ మఱుఁగుచు నులుకుచు దిరదిరఁ  గుఱుమట్టపు పొట్టివడుగు గొంత నటించెన్‌ 8-541-క వెడవెడ నడకలు నడచుచు  నెడనెడ నడుగిడఁగ నడరి యిల దిగఁబడఁగన్‌ బుడిబుడి నొడువులు నొడువుచుఁ  జిడిముడి తడఁబడఁగ వడుగు సేరెన్‌ రాజున్‌ ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. మూడూ కంద పద్యాలు. మూడూ సర్వలఘువు కందాలు కాకాపోయినా, లఘువులు ఎక్కువగా ఉన్న పద్యాలు. మూడూ పొట్టివాడైన వామనుడి నడకను వర్ణిస్తున్న పద్యాలు. ఒక పొట్...

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 36

ఈ భాగంలో, చాలా రోజుల తరువాత ఇంటికి వచ్చిన భర్త, భార్యని అడిగే కుశల ప్రశ్నల పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. ప్రథమ స్కంధంలోనిది. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చాడు. భార్యలను కుశలప్రశ్నలు వేస్తున్నాడు. రెండవది. అష్టమ స్కంధంలోని వామనావతార ఘట్టం ఆరంభంలోనిది. కశ్యప మహాముని ఎన్నో రోజుల తపస్సు తరువాత ఇంటికి వచ్చాడు. తన భార్య అదితిని కుశల ప్రశ్నలు వేస్తున్నాడు. ఇవిగో పద్యాలు. 1-268-మ. (శ్రీకృష్ణుడు భార్యలను పరామర్శ చేయట) "కొడుకుల్ భక్తివిధేయు లౌదురు గదా? కోడండ్రు మీ వాక్యముల్గ డవంజాలక యుందురా? విబుధ సత్కారంబు గావింతురా?  తొడవుల్ వస్త్రములుం బదార్థ రస సందోహంబులుం జాలునా? కడమల్ గావు గదా? భవన్నిలయముల్ గల్యాణయుక్తంబులే? 8-463-మ. (కశ్యపుడు అదితిని పరామర్శ చేయుట) తెఱవా! విప్రులు పూర్ణులే? చెలగునే దేవార్చనాచారముల్? తఱితో వేలుతురే గృహస్థులు? సుతుల్ ధర్మానుసంధానులే? నెఱి నభ్యాగత కోటి కన్న మిడుదే? నీరంబునుం బోయుదే? మఱ లే కర్థుల దాసులన్ సుజనులన్ మన్నింపుదే? పైదలీ! ఇప్పుడు ద్వంద్వశిల్పం చూద్దాం. రెండూ మత్తేభవృత్త పద్యాలు. రెండింటిలోనూ భార్యను భర్త కుశ...

ఛందస్సు పద్యాలు చదువుకోవడం ఎలా - 3?

Image
  మొదటి భాగంలో  లఘువులు, గురువుల ద్వారా పదాల కూర్పును చూసాం. గురువులు పద్యాల ఎత్తుగడకు ఉపయోగపడతాయి. లఘువులు దమ్ము తక్కువగా ఉన్నప్పుడు వాడతారు.  రెండవ భాగంలో  ఆ లఘువులు, గురువులగు అమర్చుకోవడం ద్వారా నడకలు ఎలా ఏర్పాడతాయో చూసాం. ఈ భాగంలో ఈ లఘువులు, గురువుల అమరికను రసపోషణకు ఎలా వాడతారో చూద్దాం.  రసపోషణ - పద్యనిర్మాణం ఊపిరి/దమ్ము ఎక్కువగా ఉన్నప్పుడు, గురువు ఎత్తుకోవడానికి అనువు అని మొదటి భాగంలో చెప్పుకున్నాం. మన మనస్సులో ఏ భావం ఉన్నప్పుడు ఊపిరి బిగపడతాం? ఆ భావం వ్యక్తపరచడానికి గురువులు ఎక్కువగా ఉన్న పద్యం ఎత్తుకుంటారా? ఉదాహరణకు ఏదైనా ఉద్వేగం, ఉత్కంఠం అయిన సన్నివేశం చెప్పాలంటే గురువులు ఎక్కువగా ఉన్న పద్యం వ్రాస్తారా? మరి పద్యంలో లఘువులు ఎక్కువగా ఉంటే ఏ భావం పలుకుతుంది? ఏదైన కరుణ రసం పలికించాలంటేనో లేదా నీతి బోధ వంటివి చేయాలంటేనో ఎక్కువగా లఘువులు ఉన్న పద్యం ఎత్తుకోవాల్సిందేనా?   లఘువులు, గురువులు కాస్త అటూ ఇటూగా సమానంగా ఉంటే సాధారణ వర్ణనకు అనుకూలం. గురువులు ఒక రవ్వ ఎక్కువగా ఉంటే గాంభీర్యానికి అనుకూలం.  పట్టిక వృత్త పద్యాలను పూర్వభాగం (మొదటి అక్షరం నుండి యతి వ...

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 35

ఈ భాగంలో భగవంతుని మీద దృష్టి ఎలా పెట్టాలో చెప్పే పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. ప్రథమ స్కంధంలోనిది. మహాభారత యుద్ధం పూర్తయింది. శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్లిపోతూ అంపశయ్య మీద, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచిచూస్తున్న భీష్ముడి దగ్గరకు వెళ్లాడు. ఆ భీష్ముడు అన్ని ఆలోచనలు మాని, ప్రశాంత చిత్తంతో భగవంతుడిని ధ్యానిస్తున్నాడు. రెండవది. అష్టమ స్కంధంలోని గజేంద్రమోక్షం ఘట్టంలోనిది. తన సరస్సులోనికి వచ్చి అల్లరి చేస్తున్న గజేంద్రుడిని, మొసలి అదను చూసి, శబ్దంచేయకుండా, దృష్టి కేంద్రీకరించి ఒక యోగీంద్రుని వలెనే పట్టుకుంది. ఇవిగో పద్యాలు. 1-217-శా. (భీష్ముడు) ఆలాపంబులు మాని, చిత్తము మనీషాయత్తముం జేసి, దృ గ్జాలంబున్ హరిమోముపైఁ బఱపి, తత్కారుణ్యదృష్టిన్ విని ర్మూలీభూత శరవ్యధా నిచయుఁడై మోదించి, భీష్ముండు సం శీలం బొప్ప నుతించెఁ గల్మషగజశ్రేణీహరిన్, శ్రీహరిన్. 8-65-శా (యోగీంద్రుని వంటి మొసలి) పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియో న్మాదంబుం బరిమార్చి బుద్ధిలతకున్ మాఱాకు హత్తించి ని ష్ఖేదబ్రహ్మపదావలంబనరతిం గ్రీడించు యోగీంద్రు మ ర్యాదన్నక్రము విక్రమించెఁ గరిపాదాక్రాంతనిర్వక్రమై. ఇప్పుడు ద...

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 34

33వ ,  31వ  భాగాలలో శరణాగతి చేస్తూ భగవంతుడిని "ఓ"యని పిలచిన పద్యాలు చూసాం. మరి ఆ పిలుపు ఒక మధ్యవర్తి ద్వారా, లేఖ రూపేణా పంపితే భగవంతుండు ఎలా స్పందిస్తాడో ఇప్పుడు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. రెండూ దశమ స్కంధం పూర్వభాగంలోని రుక్మిణీకల్యాణ ఘట్టం లోనివి. మొదటిది.  రుక్మిణీదేవికి ఇష్టంలేని పెళ్లి నిర్ణయించారు. రుక్మిణీదేవి, అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుని ద్వారా శ్రీకృష్ణునికి లేఖ పంపించింది. ఆ సందేశం విన్న శ్రీకృష్ణుడు, "నేను వస్తున్నాను!" అంటూ భరోసా ఇస్తున్నాడు. రెండవది. ఇచ్చినమాట ప్రకారం శ్రీకృష్ణుడు బయలుదేరి ఒక్క రాత్రిలో విదర్భకు చేరుకున్నాడు. బలరాముడు, ఎందుకైనా మంచిదని, వెనుకనే యదువీరులని తీసుకుని బయలుదేరాడు. శ్రీకృష్ణుడు, రుక్మిణిని తీసుకుని వెళ్లిపోతున్నాడు. రుక్మిణి అన్న రుక్మి, ఇతర వీరులు వెంబడిస్తున్నారు. శ్రీకృష్ణుడు, రుక్మిణికి ధైర్యం చెప్తూ భరోసా ఇస్తున్నాడు. ఇవిగో పద్యాలు. 10.1-1717-క  (అగ్నిద్యోతనుతో మాటలు) వచ్చెద విదర్భభూమికిఁ; జొచ్చెద భీష్మకుని పురము; సురుచిరలీలన్ దెచ్చెద బాలన్ వ్రేల్మిడి వ్రచ్చెద నడ్డంబు రిపులు వచ్చినఁ బోరన్." 10.1-1756-క.  (రుక్మ...

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 33

31వ భాగంలో శరణాగతి చేస్తూ భగవంతుడిని "ఓ"యని పిలచిన పద్యాలు చూసాం. ఈ భాగంలో అగ్ని ద్వారా బాధపడుతున్న భక్తుల ఆర్తి చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది, ప్రధమ స్కంధంలోనిది. కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది. తొడలు విరిగి పడివున్న దుర్యోధనుడికి,  "పాండవులకి వారసులు లేకుండా చేస్తా"నని, అశ్వద్ధామ మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం నిద్రపోతున్న ఉపపాండవులని రాత్రిపూట చంపివేశాడు. ఉత్తర గర్భంలో ఉన్న శిశువును సంహరించాలని బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఆ బాణాగ్ని ధాటికి విలవిల్లాడుతున్న ఉత్తర రక్షించమని శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నది. రెండవది. దశమ స్కంధం పూర్వ భాగంలోనిది. బాలకృష్ణుడు, అడవిలోని కాళింది మడుగులో కాళీయ మర్దన చేసాడు. ఆ మడుగు చూట్టూ గోపికలు, గోపబాలురందరూ చేరారు. చీకటి పడిపోయిందని అక్కడ ఆ రాత్రి గడిపారు. ఇంతలో ఆ అడవిలో కార్చిచ్చు బయలుదేరింది. అందరూ బలరామకృష్ణులను ప్రార్థిస్తున్నారు.  ఇవిగో పద్యాలు. 1-179-మ.  (ఉత్తర ప్రార్ధన) "ఇదె కాలానల తుల్యమైన విశిఖం బేతెంచె దేవేశ! నేఁ| డుదరాంతర్గత గర్భ దాహమునకై యుగ్రప్రభన్ వచ్చుచు| న్నది దుర్లోక్యము మానుపన్ శరణ మన్యం బేమియున్ లేదు నీ...

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 32

ఈ భాగంలో ఎనిమిదవ స్కంధం నుంచి ఏనుగుల గూర్చిన మూడు పద్యాలను చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. ఎనిమిదవ స్కంధంలోని మొదటి ఘట్టం, గజేంద్రమోక్షం లోనిది. గజేంద్రుడు మదంతో నిండి ఉన్నాడు. ఆ ధాటికి అన్ని దిక్కులు, లోకాలు దడదడ లాడుతున్నాయి. రెండవది. గజేంద్రుడు తన పరివారంతో కలసి సరస్సులోనికి దిగాడు. ఆ ఏనుగులన్నీ జలకాలాడుతూ గోలచేస్తున్నాయి. మూడవది. ఎనిమిదవ స్కంధంలోని రెండవ ఘట్టం, సముద్ర మథనం లోనిది. రాక్షసులు, దేవతలు సముద్రమధనం చేస్తున్నారు. ముందుగా హాలాహలం వచ్చింది. శివుడు దానిని భక్షించాడు. తురువాత ఐరావతం, కల్పవృక్షం వగైరా పుట్టాయి. లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించింది. పండితులు వేదవచనాలు చదువుతుంటే, ఆమెకు ఏనుగులు మంగళ స్నానాలు చేయిస్తున్నాయి. ఇవిగో పద్యాలు. 8-36-క. (గజేంద్రుని మదం) తొండంబుల మదజలవృత గండంబుల కుంభములను ఘట్టన సేయం గొండలు దలక్రిందై పడు బెండుపడున్‌ దిశలు సూచి బెగడున్‌ జగముల్‌. 8-45-క. (గజేంద్రుని జలకాలాటలు) తొండంబులఁ బూరింపుచు గండంబులఁ జల్లుకొనుచు గళగళ రవముల్‌ మెండుకొన వలుదకడుపులు నిండన్‌ వేదండకోటి నీరుం ద్రావెన్‌. 8-270-క. (లక్ష్మీదేవి మంగళ స్నానాలు) పండితసూక్తుల తోడుతఁ దుండంబుల...

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 31

ఈ భాగంలో ఏడవ స్కంధంలోని ప్రహ్లాద చరిత్ర, ఎనిమదవ స్కంధంలోని గజేంద్రమోక్ష ఘట్టంలోని మరో రండు పద్యాలను చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. హిరణ్యకశిపుడు తన మాటవినని ప్రహ్లాదుడిని దండించాలనుకున్నాడు. భటులు ప్రహాదుడిని తీసుకువెళ్లి కొండల మీద నుంచి త్రోసారు, నిప్పుల మీద పడేసారు, నీళ్లలోకి తోసారు, ఏనుగులతో తొక్కించారు - ఇలా ఎన్నో బాధలకు గురిచేసారు. కానీ ఆశ్చర్యం! ప్రహ్లాదునికి చిన్న గాయమైనా కాలేదు. నిరంతరం హరినామ జపం చేస్తూ ఉన్నాడు. రెండవది. గజేంద్రుడు, మొసలిబారిన పడి పోరాడి అలసిపోయాడు. భక్తులు పిలవగానే "ఓయ్" యంటూ వచ్చే భగవంతుడిని, గజేంద్రుడు "ఓ" అంటూ శరణాగతి చేస్తున్నాడు. ఇవిగో పద్యాలు. 7-193-ఉ.  (ప్రహ్లాదుని ప్రార్ధన) తన్ను నిశాచరుల్ వొడువ దైత్యకుమారుఁడు మాటిమాటి కో పన్నగశాయి! యో దనుజభంజన! యో జగదీశ! యో మహా పన్న శరణ్య! యో నిఖిలపావన! యంచు నుతించుఁ గాని తాఁ గన్నుల నీరుదేఁడు భయకంప సమేతుఁడు గాఁడు భూవరా! 8-92-ఉ.  (గజేంద్రుని శరణాగతి) ఓ కమలాప్త! యో వరద! యో ప్రతిపక్ష విపక్షదూర! కు య్యో! కవి యోగి వంద్య! సుగుణోత్తమ! యో శరణాగతామరా నోకహ! యో మునీశ్వర మనోహర! యో విపులప్రభావ! రా వే...

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 30

29వ భాగంలో వలెనే గజేంద్రమోక్ష ఘట్టానికి, సముద్ర మథనం ఘట్టానికి సంబంధించిన మరొక రెండు పద్యాలను చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. గజేంద్రమోక్షంలోనిది. సరస్సులోనికి దిగి, మొసలి బారిన పడిన గజేంద్రుడు తన శక్తి కొలదీ పోరాటం చేస్తున్నాడు. నువ్వా నేనా అన్నట్టుగా ఉంది వాటి పోరాటం. అమీతుమీ తేలటంలేదు. రెండూ హేమాహేమీలే. పెనుగులాడుతున్నాయి. రెండవది. సముద్ర మథనం లోనిది. దేవతలు, రాక్షసులు మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని సముద్రాన్ని చిలుకుతున్నారు. మొదట హాలాహలం పుట్టింది. శివుడు దానిని నివారించాడు. కామధేనువు, రెక్కలగుర్రం, ఐరావతం, కల్పవృక్షం వగైరా పుట్టాయి. వీటితో పాటుగా లక్ష్మీదేవి పుట్టినది. దేవతలందరిలోకీ విష్ణువును వరమాల వేసి వరించింది. ఒకరినొకరు సిగ్గుతో చూసుకోవడానికి తొందర పడుతున్నారు. ఇవిగో పద్యాలు. 8-54-క. కరిఁ దిగుచు మకరి సరసికిఁ గరి దరికిని మకరిఁ దిగుచు గరకరి బెరయన్  గరికి మకరి మకరికిఁ గరి భర మనుచును నతల కుతల భటు లరుదు పడన్ 8-285-క. హరి చూచిన సిరి చూడదు సిరి చూచిన హరియుఁ జూఁడ సిగ్గును బొందున్ హరియును సిరియునుఁ దమలో సరిఁజూపులఁజూడ మరుఁడు సందడి పెట్టెన్. ఇప్పుడు ద్వంద్వశిల్పం చూద్...

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 29

ఈ భాగంలో భగవంతుడు "కలడు" అనే పద్యాలు రెండు చూద్దాం. రెండూ పక్కపక్క ఘట్టాలలోనివి.  ముందుగా కథా సందర్భాలు. మొదటిది. ఎనిమిదవ స్కంధంలోని మొదటి ఘట్టం, గజేంద్రమోక్షంలోనిది. సరస్సులోనికి దిగి, మొసలి బారిన పడిన గజేంద్రుడు  తన శక్తి కొలదీ పోరాటం చేసాడు. డస్సిపోయాడు. చివరికి ఈశ్వరుడిని శరణు వేడుకున్నాడు. అంతలోనే ఉన్నాడో లేడో అనే సందేహం వచ్చింది. రెండవది. ఎనిమిదవ స్కంధంలోని రెండవ ఘట్టం, సముద్ర మథనం లోనిది. దేవతలు, రాక్షసులు మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని సముద్రాన్ని చిలుకుతున్నారు. మొదట హాలాహలం పుట్టింది. అందరూ  వెళ్లి శివుడిని శరణుకోరుతున్నారు. "కొందరు నీవు ఉన్నావో లేవో అనుకుంటారు", అంటున్నారు. ఇవిగో పద్యాలు. 8-86-క. కలఁ డందురు దీనుల యెడఁ, గలఁ డందురు పరమయోగి గణముల పాలం, గలఁ డందు రన్నిదిశలను, గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో? 8-225-క. కొందఱు గలఁ డందురు నినుఁ; గొందఱు లేఁ డందు; రతఁడు గుణి గాఁ డనుచుం గొందఱు; గలఁ డని లేఁ డని కొందల మందుదురు నిన్నుఁ గూర్చి మహేశా! ఇప్పుడు ద్వంద్వంశిల్పం చూద్దాం. రెండూ కందపద్యాలు. రెండింటిలోనూ కష్టాలలో ఉన్న జీవులు ఈశ్వరునికి మొరపెట్టుకుంటున్న సందర్...

ఛందస్సు పద్యాలు చదువుకోవడం ఎలా? - 2

Image
  ప్రస్తావన: మొదటి భాగం లో చెప్పుకున్నట్టు, ఛందస్సు శబ్దప్రమాణము. పద్యాలలోని విరుపును ఎలా గుర్తించాలో చూసాము. పదబంధాలు (phrases) గురు శబ్దములతో మొదలు పెట్టి, లఘు శబ్దములతో ముగించాలని సూత్రీకరించాం.  ఈ భాగంలో గురు, లఘు శబ్దాలతో నడక ఎలా వస్తుందో గమనిద్దాం. మరొక్కసారి గురు శబ్దము అంటే ఎక్కువ దమ్ము-కాలం, లఘు శబ్దము అంటే తక్కువ దమ్ము-కాలం అని గుర్తుచేసుకుందాం. నడక అంటే ఏమిటి? పద్యంలో లయ, నడక అంటూ ఉంటారు. ఈ నడక అంటే ఏమిటి? కాళ్లతో నడచే నడకకు, పద్యాలలో నడకకూ ఏమైనా సంబంధం ఉన్నదా? ఒక దాని ద్వారా ఇంకొకటి అర్ధం చేసుకోగలమా? “కాళ్ల నడక” అంటే కొంత సమయంలో, ఒకచోటి నుండి మరొక చోటికి (move in space over time) చేసే ప్రక్రియ. “పద్య నడక” అంటే కొంత సమయంలో, ఒక శబ్దం(స్వరం) నుంచి మరొక శబ్దం(స్వరం) కలుపుకుంటూ (movement in frequencies over time) చేసే ప్రక్రియ. “కాళ్ల నడక”లో - మామూలు నడక, కుంటి నడక, పరుగు, గెంత్తుట, కుప్పించి ఎగయుట, నాట్యం - ఇలా రకరకాలుగా విన్యాసాలు చేయవచ్చు. అలాగే నిర్దిష్టమైన రీతిలో (అదే ఛందస్సు) చేయగలిగితే పద్యాలలో కూడా మరిన్ని విన్యాసాలు వినవచ్చు. అందుకే పాదము (సంసృతంలో) అంటే “పద్య...

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 28

ఈ భాగంలో మూడు కంద పద్యాలు చూద్దాం. మూడూ ఒకటే సందర్భంలోనివి.భాగవతంలోని ఎనిమిదవ స్కంధంలోని మంధర పర్వతాన్ని కవ్వంగా చేసి సముద్రాన్ని చిలికే ఘట్టంలోనివి.  మొదటి పద్యం. దేవతలు, రాక్షసులు కలసి మంధర పర్వతాన్ని పెకలించి తీసుకొని వచ్చి, సముద్రం మధ్యలో పెట్టారు. వాసుకిని బ్రతిమాలి తాడుగా చేసికొన్నారు. చిలకడం మొదలుపెట్టారు. అడుగుభాగం స్థిరంగా లేనందున పర్వతం అటూఇటూ ఊగుతున్నది. వాసుకి విడవండని పలికాడు. ఆ పర్వతం కాస్తా మునిగిపోయింది. రెండవ,మూడవ పద్యాల సందర్భం. శ్రీమహావిష్ణువు కూర్మావతారం ధరించి ఆ పర్వతానికి నిలకడ కలిగించాడు. ఇప్పుడు ఆ సాగర మథనం నిరాఘాటంగా సాగుతున్నది. ఆ హడావిడికి భయపడి సముద్రంలోని జీవాలన్నీ ఎగసిపడుతున్నాయి. ఇవిగో పద్యాలు.  8-199-క. (మంధరగిరి ఒరిగిపోవుట) వి డు విడుఁ డని ఫణి పలుకఁగఁ గ డు భరమున మొదలఁ గుదురు గలుగమి గెడఁవై బు డ బుడ రవమున నఖిలము వ డ వడ వడఁకఁగ మహాద్రి వనధి మునింగెన్. 8-211-క. (సాగరమథనం సాగుట) ఎ డ మఁ గుడి మునుపు దిరుగుచు గు డి నెడమను వెనుకఁ దిరుగు కులగిరి గడలిం గ డ లెడల సురలు నసురులుఁ దొ డి తొడి ఫణి ఫణము మొదలుఁ దుదియును దిగువన్. 8-212-క. (...

కావ్య భాష - పత్రికల భాష - పోలిక

 సరదాగా కొన్ని చొప్పదంటు ప్రశ్నలు. పోతన భాగవతంలోని కావ్యభాషలో ఏ అక్షరం ఎక్కవ వాడబడినది? పొడి అక్షరాలు ఎక్కువ వాడబడ్డాయా లేకపోతే సంయుక్తాక్షరాలా? ద్విత్వాలా? అసలు ఎన్ని అక్షరాలు వాడబడ్డాయి? ఏ అక్షరం ఎన్నిసార్లు వాడబడినదో ఒక పట్టిక తయారుచేయచ్చా? అలాగే, ఈ కాలంలోని వార్తాపత్రికలలోని తెలుగు భాషకు కూడా ఒక అక్షరాల పట్టిక తయారుచేసి, పోతన భాగవతం ద్వారా వచ్చిన అక్షర పట్టికతో పోలిస్తే ఏమవుతుంది? ఏమి విషయాలు తెలుకోవచ్చు? మొబైల్ యాప్స్ చేసిన అనుభవంతో ఇలాంటి గణాంకాల పట్టిక ఒకటి తయారు చేసాను. ఈ క్రింది పట్టిక లోని మొదటి రెండు నిలువరసలు చూడండి. పోతన భాగవతంలో ఎక్కవగా వాడబడిన మొదటి 25 అక్షరాలు. మూడవ వరుసలో ఆ పాతిక అక్షరాలు, వార్తాపత్రికలలో, ఎలా వాడబడినాయో గణాంకాల శాతం. పోతన భాగవతం ~1500 CE వార్తాపత్రికలు - 2020 CE న 3.66% 2.14% ల 2.83% 1.99% ము 2.66% 0.62% ని 2.23% 1.97% డు 2.18% 0.92% అ 2.07% 1.66% న్ 2.06% 0.41% ను 2.02% 0.98% క 1.93% 1.70% లు 1.81% 2.19% త 1.71% 1.41% వ 1.62% 1.58% ర 1.61% 1.47% మ 1.46% 1.34% ప 1.39% 1.25% వి 1.24% 0.86% బు 1.15% 0.17% గ 1.13% 0.76% ద 1.13% 0.92% రు 1.12% 1.25% ...