శ్రీకృష్ణదేవరాయలు - తెలుగు నాట యుద్ధాలు

శ్రీకృష్ణదేవరాయలను కృతిపతిగా పొగుడుతూ ముక్కుతిమ్మన వ్రాసిన పారిజాతాపహరణము, అల్లసాని పెద్దన వ్రాసిన స్వారోచిషమనుసంభవము (మనుచరిత్ర) అనే కావ్యాల నుంచి, ఈ క్రింది పద్యాలను చూడండి. 

పారిజాతాపహరణము - 1.23

దయాద్రి వేగ యత్యుద్ధతి సాధించె, 
       వినుకొండ మాటమాత్ర హరించెఁ
గూటము ల్సెదరంగఁ గొండవీ డగలించె, 
       బెల్లముకొండ యచ్చెల్లఁ జెఱిచె, 
దేవరకొండ యుద్వృత్తి భంగము సేసె, 
       ల్లి పల్లె సమగ్రక్తి డులిచెఁ, 
గినుక మీఱ ననంతగిరి క్రిందుపడఁ జేసె, 
       గంబంబుమెట్ట గ్రక్కనఁ గదల్చె

టకమును నింక ననుచు నుత్కలమహీశుఁ
నుదినమ్మును వెఱచు నెవ్వనికి నతఁడు
రాజమాత్రుండె! శ్రీకృష్ణరాయవిభుఁడు.
నికాయము కాలిమట్టునె యడఁచుఁ

భావం: ఉదయాద్రి, వినుకొండ, కొండవీడు, బెల్లంకొండ, దేవరకొండ, జల్లిపల్లె, అనంతగిరి, కంబంబుమెట్ట వంటి వాటిని జయించిన శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు తన దాకా వస్తాడోనని, కటకం మహారాజు అనుదినమూ చింతిస్తున్నాడు.

మనుచరిత్ర - 1.37

తొలుదొల్త నుదయాద్రి శిలఁ దాఁకి తీండ్రించు,
     సిలోహమున వెచ్చనై జనించె, 
ఱి కొండవీ డెక్కి మార్కొని నలియైన,
     ల కసవాపాత్రు నంటి రాఁజె, 
ట సాఁగి జమ్మిలోయఁ బడి వేఁగి దహించెఁ,
    గో బిట్టేర్చెఁ, గొట్టానఁ దగిలెఁ, 
నకగిరిస్ఫూర్తిఁ రఁచె గౌతమిఁ గ్రాఁచె,
    వుల నాపొట్నూర వులుకొనియె

మాడెములు ప్రేల్చె, నొడ్డాది సి యొనర్చెఁ, 
టకపురిఁ గాల్చె గజరాజు లఁగి పఱవఁ
దోఁకచిచ్చన నౌర యుద్ధోర గృష్ణ
రాయబాహుప్రతాప జాగ్రన్మహాగ్ని

భావం: ఉదయాద్రి, కొండవీడు, జమ్మిలోయ ద్వారా వేగి, కోన, కొట్టం, కనకగిరి, గౌతమి, ఆవల నున్న పొట్నూరు, మాడెములు, ఒడ్డ ప్రదేశము, కటకపురిని శ్రీకృష్ణదేవరాయలు జయించాడు.

పై రెండు పద్యాలనూ పోల్చుకుంటే, పారిజాతాపహరణం కావ్యకాలానికి శ్రీకృష్ణదేవరాయలు కటకం (Cuttack)ను జయించలేదని, మనుచరిత్ర కావ్యరచనా కాలానికి కటకపురిని జయించాడని అర్థమవుతోంది. అంటే పారిజాతాపహరణం కావ్యమే మనుచరిత్రకు ముందు వ్రాయబడినదిని అనుకోవచ్చు. [ఈ విషయం పండితులు, విశ్లేషకులు చెప్పినదే. నా స్వంత ఆలోచన కాదని మనవి.]

సరే ఇంతకూ ఆ నాటి ప్రదేశాలు ఇప్పటికీ ఉన్నాయా అనే ఆలోచన వచ్చింది. పైగా కవులు చెప్పిన ప్రదేశాలు వరుస క్రమంలో జయించినవేనా అనే సందేహం కలిగింది. గూగుల్ మ్యాపులు పుణ్యమా అని వాటి గుర్తించా. క్రింది బొమ్మ చూడండి.




* పెద్దన పద్యంలో "గౌతమీనది, దాని అవతల ఉన్న పొట్నూరు" అని ఉన్నది కానీ నేటి మ్యాపులో పొట్నూరు "గోస్తనీ" నదికు ఆవల ఉన్నది. 

Comments