పోతన భాగవతంలో భారత వర్షం

పోతన (1450 - 1510) వ్రాసిన ఆంధ్రమహాభాగవతంలో భారతవర్షం యొక్క భౌగోళిక వివరాలు తెలియజేసాడు. పంచమ స్కంధంలోని ఉత్తరభాగంలో ఈ వివరాలు ఉన్నవి.

మలయపర్వతము వంటి రకరాకాల పర్వతాలు, చంద్రవటి వంటి నదులు (తూర్పునకు ప్రవహించేవి, నర్మద వంటి నదాలు (పశ్చిమాని ప్రవహించేవి), వీటిలో పుట్టిపెరిగిన మనుషులు ఉత్తమగతులు చెందుతారు

(5.2-55) ".....మలయపర్వతంబును..<<>>..రామగిరియును నాదిగాఁ గల పుణ్య పర్వతంబు లనేకంబులు గలవా పర్వతపుత్రిక లైన చంద్రవటయు, దామ్రపర్ణియు,..<<>>..విశ్వయు నను నీ మహానదులును,నర్మద,..<<>>..యను నదంబులును నైన మహా ప్రవాహంబు లీ భారతవర్షంబునఁ గల; వందు సుస్నాతులైన మానవులు ముక్తిం జెందుదురు;మఱియు నీ భారత వర్షంబున జన్మించిన పురుషులు శుక్ల లోహిత కృష్ణవర్ణ రూపంబు లగు త్రివిధ కర్మంబులంజేసి క్రమంబుగ దేవ మనుష్య నరక గతులను త్రివిధ గతులం బొందుదురు; వినుము; రాగద్వేషాది శూన్యుండు, నవాఙ్మానసగోచరుండు, ననాధారుండు నగు శ్రీవాసుదేవమూర్తి యందుఁ జిత్తంబు నిలిపి భక్తియోగంబున నారాధించెడు మహాత్ముల విద్యాగ్రంథి దహనంబు గావించుట జేసి పరమ భాగవతోత్తములు పొందెడు నుత్తమగతిం జెందుదురు; కావున భారత వర్షంబు మిగుల నుత్తమం బని మహాపురుషు లిట్లు స్తుతించు చుండుదురు....."


--

ఇండియా, భారతం - ఈ రెండు పేర్ల గురించి ఈ మధ్యన జరుగుతున్నరగడ గురించి రెండు మాటలు. ఇండియా అనేది ప్రాచుర్యమున్న పేరు. దానిని "ఇండియా (I.N.D.I.A)" అంటూ కాంగ్రెసు కూటమి పేరు పెట్టేసుకుని చవకబారు రాజకీయం చేసింది. కష్టపడకుండా కూటమికి "పేరు" తెచ్చుకుందామని ఎత్తువేసింది. ఇప్పుడు తామేమీ తక్కువ తినలేదని రాజకీయ ప్రయోజనాల కోసం Indiaను Bharatగా మార్చుతాముంటూ పైఎత్తు వేసింది. ఇది కేవలం హిందీ పేరు అంటూ కాంగ్రెసు తరపున కొన్ని పత్రికలు భాషా ప్రాతిపదికన ఆ పేరును తిరస్కరించాలని సూచిస్తున్నాయి. వెరసి పెంటపెంటగా, చవకబారుగా దేశ రాజకీయాలు తోస్తున్నాయి. 

"పేరులోనేముంది?" అంటూ సరదాగా అనటం విన్నాం. ఇప్పుడు "పేరులో రాజీకీయం ఉన్నదయా!" అనక తప్పట్లేదు.



Comments