చం. చదువది యెంత - 100 పద్యాలు

 

చ. చదువది యెంత గల్గిన

దువది యెంత గల్గిన రజ్ఞత యించుక చాలకున్న నా
దువు నిరర్థకంబుగుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం
నుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొవెడొ నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా! 

1.    చదువది యెంత గల్గిన

2.    రసజ్ఞత యించుక చాలకున్నన్

3.    ఆ చదువు నిరర్థకంబు

4.    గుణ సంయుతులెవ్వరు 

5.    మెచ్చరు ఎచ్చటం

6.    పదనుగ మంచికూర 

7.    నలపాకము చేసిననైనన్

8.    అందున్ ఇంపు ఒదవెడున్ 

9.    ఉప్పు లేక 

10.          రుచి పుట్టఁగన్ 

11.          ఏర్చునటయ్య 

12.         భాస్కరా!

అర్ధాలు:

రసజ్ఞత = సహృదయత; యించుక కొంచెము; నిరర్థకమ్ము పనికిరానిది; గుణ మంచి గుణములు; సంయుతులు ఉన్నవారు; మెచ్చరు మెచ్చుకోరు; ఎచ్చటన్ ఎక్కడైన; పదనుగ చక్కగా; నలపాకము మంచి వంటకము (నల మహారాజు చేసిన వంటకం వంటిది); ఇంపు చక్కగ; ఉప్పు ఉప్పు; ఏర్చును చక్కగా ఉండుట

భావం:

భాస్కరా!  చదువులు ఎంత చదువుకున్నా, మానవునికి రసజ్ఞత అనేది తగినట్టుగా ఉండాలి. అలా లేని చదువు నిరుపయోగమైనది. మంచివారెవ్వరూ మెచ్చుకోరు. ఉదాహరణకు, ఏదైనా వంటకం చాలా చక్కగా చేసి, దానిలో ఉప్పు తగిన పాళ్లలో వేయకపోతే రుచి సరిగా ఉండదు కదా.

Comments