Posts

Showing posts from June, 2021

అరణ్యకాండ: 1477-1489 - చెట్టు వర్ణన - రంగనాథ రామాయణం

 సందర్భము: శ్రీరాముడు ఋష్యమూక పర్వత ప్రాంతం చేరి లక్ష్మణునితో మాటలు. అరణ్యకాండ: 1477-1489 వ న వాస మిటు తుద  వ చ్చిన మొదలు -  ఘ న మైన యద్రులు  ఘ నపుణ్య నదులు  ద ర మిడి కంటిమి ; ధా రుణి నిట్టి -  త రు   వెందుఁ గాన మీ  త రువుకు సవతు  సు ర పతి మొదలగు  సు రలెల్లఁ గూడి -  క ర మర్థి నీతరు  గా వించి రొక్కొ?  య జుఁ డె యీతరువున  కా యువుఁ బోసి -  ని జ ముగా నిచ్చట  ని లిపినాఁ డొక్కొ  ర వి  సుతు తపమున  రా గిల్లి బ్రహ్మ -  భు వి ని నీతరువును  బు ట్టించినాఁడొ ? సే విం చి యమృతంబు  చే కొని సురలు -  భా విం చి రవిసుతు  ప క్షంబుగలిగి  య ర యంగ మేలైన  య మృతంబుతోడఁ -  బు ర ణింపఁ దరువుగాఁ  బు ట్టించినారొ ? యి ను నితో నిష్టంబు  లిం పొందఁ జేయఁ -  జ ను  ధర్మమున నుండి  శా ఖ లున్నతము  ల ష్ట దిక్కులకును  న నువందఁ బాఱి -  యి ష్ట ఫలంబుల  వీఁ   గోరినట్లు  ప ఱ చు శాఖల రుచి  ప్ర భ నొప్పుమీఱి -   తె ఱ చి పర్ణంబులు  తే జం...

అరణ్యకాండ: 1451-1469 - ఋష్యమూక పర్వత వర్ణన - రంగనాథ రామాయణం

సందర్భము: శ్రీరాముడు ఋష్యమూక పర్వత ప్రాంతం చేరుకుని, ఆ ప్రాతం వర్ణించుట.  అరణ్యకాండ: 1451-1469 త్రై లో క్య విభులైన  త మ రాక చూచి -  యా లో లమతి పొంగి  యా నంద మంది  య న యంబు నొప్పెడు  న శ్రు పూరంబు -  ల న   సెలయేరుల  న మరిన దాని, భావం: శ్రీరాముడు, లక్ష్మణుడు రాక చూసి, నదులన్నీ ఆనందబాష్పాలు కార్చుతున్నాయా అన్నట్లుగా సెలయేరులు పారుతున్నాయి. ని ల  మేరుమందర  హి మశైలపతులు -  న లి మీఱి నగియెడి  న గవులో యనఁగ  సాం ద్రం బులై యెందుఁ  జ రుల దీపించు -  చం ద్ర కాంతో పల చ్ఛా యల దాని, - భావం: మేరు పర్వతం, మంథర పర్వతం, హిమాచలానికి ధీటుగా ఉన్న ఋష్యమూక పర్వతం నుండి వెలువడు జలధారల నుండి చల్లటి కాంతులు వస్తున్నాయి.  స ర సిజాసనుఁడు భూ చ క్రంబు మీఁద -  బ రఁ గఁ బర్వత రాజ ప ట్టంబు గట్టి  శి ర సునఁ బెట్టిన  సే సఁ బ్రాలనఁగ -  ను రు శృంగములఁ జుక్క  లొ ప్పెడి దాని,  భావం: బ్రహ్మదేవుడు భూచక్రము మీద ఈ పర్వతానికి పట్టంకట్టి, ఆశీర్వదిస్తూ తలమీద వేసిన అక్షతల వలే, ఆ పర్వతశిఖరాల మీద చుక్కలు...

అరణ్యకాండ: 1406-1418 - శబరి ప్రార్థన - రంగనాథ రామాయణం

 సందర్భము: తన ఆశ్రమానికి వచ్చిన రామలక్ష్మణలను శబరి ప్రార్థించుట. అరణ్యకాండ: 1406-1418 ద శ రథవరపుత్ర!  తా టకాజైత్ర! -  కు శి కసంభవ యాగ కు శల ప్రయోగ! చి ర  ముని ధ్యేయ! శి క్షి త తాటకేయ! -  ప ర మ గంగాతీర  పా దసంచార!  ప ద  రజోనైర్మల్య  పా లితాహల్య! -  వి ద ళిత హర చండ  వి పుల కోదండ!  భీ మ  భార్గవరామ  బి రుదాభిరామ! -  కా మి త పితృవాక్య  క రణ సుశ్లోక!  ప్ర క టాపరాధ వి రా ఢ నిరోధ! -  స క ల మునిత్రాణ!  స త్యప్రవీణ!  ఖ ర దూషణాది రా క్ష సశిరశ్ఛేది -  మ ర ణార్థి మారీచ  మ ర్దినారాచ! సీ తా వియోగ సూ చి త మోహరాగ! -  ఖ్యా త   ఖగాధ్యక్ష  క ల్పితమోక్ష!  య ల ఘు విక్రమధామ!  య తిపుణ్యనామ! -  నె ల కొని రఘురామ  ని నుజూడఁగంటిఁ,  బ రి కింప నాతపః ఫ ల మందఁగంటి -  న రు దైన పుణ్యంబు  ల న్నియుఁ గంటిఁ,  గా కు త్స్థ తెరువునఁ  గ డుడస్సితెందుఁ -  బో క   మా యాశ్రమం బు న నేఁడు నిలువు  అ న ఘాత్మ మాగురుఁ  డై న మతంగ -  ము ని...

అరణ్యకాండ: 1125-1131 - రావణాసురుడు గొప్పలు చెప్పుకొనుట - రంగనాథ రామాయణం

 సందర్భము: రావణాసురుడు సీతను అపహరించి లంకకు తీసుకుపోయి, ఆ పట్టణాన్ని చూపుట. అరణ్యకాండ: 1125-1131 యి వె   నా నివాసంబు;  లి వె నా ధనంబు -  లి వె   నా తురంగంబు  లి వి నా గజంబు;  లి వి   యేను దివిజుల  నె ల్ల భంజించి -   తి వు టమైఁ గైకొన్న  ది వ్యభూషణము ; లి దె   కుబేరుని గెల్చి  యే ను గైకొన్న -  మ ది కింపు గావించు  మ ణిపుష్పకంబు ; వీ రె   నా కుడిగముల్  వే ర్వేఱఁ జేయు -  చా ర ణామర సిద్ధ సా ధ్య కామినులు వా రె   నామాట గ ర్వ మునఁ గైకొనక -  కా రా గృహంబులు  గా సిల్లు సతులు ; అ వె   నాట్యశాల ల ల్ల వె కేళివనము -  లి వి   చంద్రశాల లో  యిం దీవరాక్షి ; క ర మర్థి నింతకుఁ  గ ర్తవై నీవు -  న రు దార భోగింపు  మ ఖిల సంపదల ; భావం: "ఇవే నా నివాసాలు, ఇవే నా ధనరాశులు, ఇవే నా గుర్రాలు, ఇవే నా ఏనుగులు, ఇవి నేను దేవతలను ఓడించి సాధించిన దివ్యభూషణాలు, ఇది నేను కుబేరుడిని గెల్చి సాధించిన పుష్పక విమానము, వీరు నాకు సేవలు చేసే దేవతా స్త్రీలు, ఈ బంధీగా ఉన్న స్త్రీలు నా...

అరణ్యకాండ: 1110-1119 - సీత ఆభరణములు ఋష్యమూక పర్వతం మీద వేయుట - రంగనాథ రామాయణం

 సందర్భము: సీత తన ఆభరణములు మూట గట్టి ఋష్యమూక పర్వతం మీద వేయుట. అరణ్యకాండ: 1110-1119 న ని మిష పథమున  కం త రావణుఁడు -  చ న  రయంబున సీత  చ రణ నూపురము - సు ర వైరి కుత్పాత  సూ చకం బగుచు -  ను రు వడిఁ జనుదెంచి  యు ల్కయై పడియె  జ గ తిపై జాహ్నవి  జ లధార లొలుకు -  ప గి ది నయ్యాకాశ ప థమున నుండి చె లు వ కుచంబులఁ  జెం దుహారములు -  దె లి య కందంద మే ది నిఁ దెగిపడియె నా లో న సీత హా హా రవం బంది -  లో లో నఁ గడు నడ లు చుఁ బోయి పోయి  య ట   ఋశ్యమూకంబు  నం దు వానరులు -  ప టు సత్త్వులేవురఁ  బ రికించి కాంచి త న వస్త్రమునఁ గొంత  త గఁ జించి పుచ్చి -  త న  భూషణంబులు  దా నె బంధించి,  వీ రై న రామ భూ వి భున కీవార్త -  లా ర యఁ దెలుపరే  య నుబుద్ధి నపుడు  ద డ యక రాముచే  ద శకంఠుఁ డింకఁ -  జె డు   నంచు ముడియు వై చి న విధంబునను  వా రి మధ్యంబున  వై చుచుఁ బోవ -  వా రు ను దాఁచిరి  వ డిఁ బుచ్చి దాని భావం: ఆకాశమార్గాన రావణుడు, సీతను అ...