కిష్కింధా కాండ: 26-32 - వసంతకాల వర్ణన - రంగనాథ రామాయణం
సందర్భము: ఋష్యమూక పర్వత ప్రాంతంలో వసంత ఋతువు వచ్చుట. కిష్కింధా కాండ: # 26-32 గ ల కంఠకల కుహూ కా ర నిస్వనము - చె లఁ గించు వనము గ ర్జి లు ఘనాఘనము గు లు కు పుప్పొడి మించుఁ గ్రొ క్కారు మించు - ద లి రుగొమ్మలు శక్ర ధ నువుల యనువు వ సు ధ రాలెడి విరుల్ వ ర్షోపలములు - ము స రు తేనియసోన ముం చినవాన గా నొ ప్పుచు వసంత కా లంబుఁ జూడ - వా న కాలముఁ బోలి వ సుధ నొప్పియును జి గు రాకు శిఖలతోఁ జి ట్టాడు తేటి - పొ గ లతోఁ బొగడ పు ప్పొ డి బూదితోడ బూ రు గుపూవు ని ప్పు కలతో నెగడి - యా ర య విరహుల క గ్నియై నిగుడి కం తు ప్రతాపాగ్ని కం టెను గడఁగి - యెం తే ని నాచిత్త మె రియింపఁ దొడఁగె. భావం: కోకిల కూతలతో అడవిప్రాంతమంతా గర్జిల్లుతోంది. అందమైన పూవుల పుప్పొడి రాలుతుంటే తొలకరి జల్లులలాగా ఉన్నది. చిగురిస్తున్న కొమ్మలను చూస్తే ఇంద్రధనుస్సుల లాగా ఉన్నాయి. నేల మీద రాలుతున్న పూవులు వర్షపు నీటి బిందువుల లాగా ఉన్నాయి. వసంతకాల పూవుల నుంచి కారుతున్న తేనె వర్షంలాగా ఉన్నది. చూస్తు...