ఉ. తొండమునేక దంతము - 100 పద్యాలు
ఉ. తొండమునేక దంతము
|
|
తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామ హస్తమున్ |
|
1. తొండమున + ఏకదంతమును 2. తోరపు బొజ్జయు 3. వామ హస్తమున్ 4. మెండుగ మ్రోయు గజ్జెలును 5. మెల్లని చూపులు 6. మందహాసమున్ |
7. కొండొక గుజ్జు రూపమున 8. కోరిన విద్యలకెల్లన్ 9. ఒజ్జవై యుండెడు 10.
పార్వతీ
తనయ 11.
ఓయి
గణాధిప! 12.
నీకు
మ్రొక్కెదన్ |
అర్ధాలు: ఏక
= ఒకటి; తోరపు =పెద్దదైన; వామ
= చిన్న, అందమైన; హస్తమున్ = చేతితో; మెండుగ = ఎక్కవగా,
చక్కగా; మ్రోయు =శబ్దముచేయు; మందహాసము = చిరునవ్వు;
కొండొక = చిట్టి, చిన్న ; గుజ్జు
= పొట్టి ; ఒజ్జ =
గురువు ; మ్రొక్కు=నమస్కరించు ; |
|
భావం: ఓ వినాయకా! పార్వతీ తనయా! నీవు
తొండమున ఏక దంతముతో, పెద్ద బొజ్జతో, అభయ హస్తముతో, చక్కటి శబ్దంచేసే గజ్జెలతో,
కరుణ కలిగిన చూపులతో, చిరునవ్వుతో, చిట్టిపొట్టి రూపముతో, మేము కోరిన
విద్యలన్నింటికి గురువుగా ఉన్న నీకు మ్రొక్కుతున్నాను. |
Comments
Post a Comment