శా. తల్లీ నిన్ను దలంచి - 100 పద్యాలు

 

శా. తల్లీ నిన్ను దలంచి

ల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్ సుశబ్దమ్ము శో
భిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
ఫుల్లాబ్జాక్షి! సరస్వతీ! భగవతీ! పూర్ణేందుబింబాననా!

1.    తల్లీ!

2.    నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితన్

3.    నీవు నా యుల్లంబందున నిల్చి

4.    జృంభణముగాన్

5.    ఉక్తుల్, సుశబ్దమ్ము

6.    శోభిల్లం పల్కుము

7.    నాదు వాక్కునను

8.    సంప్రీతిన్

9.    జగన్మోహినీ! ఫుల్లాబ్జాక్షీ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందుబింబాననా!

అర్ధాలు:

నిన్ను దలంచి = నిన్ను తలచుకొని; యుల్లము  = ఉల్లము = మనసు; జృంభణముగా = ధారగా; ఉక్తుల్ = వాక్యములు, మాటలు, విషయములు; శోభిల్లం = అందంగా; నాదు వాక్కునన్ = నా మాటలలో;  పల్కుము = పలుకుము; సంప్రీతిన్ = ఇష్టముతో; జగన్మోహినీ = జగత్ + మోహినీ; ఫుల్లాబ్జాక్షీ = ఫుల్ల + అబ్జ + అక్షి = విప్పారిన కన్నులతో; పూర్ణేందు బింబాననా  = పూర్ణ + ఇందు + బింబ + ఆననా = ప్రకాశవంతమైన ముఖముగల (తల్లీ)

భావం:
అమ్మా
! నిన్ను తలచుకుని పుస్తకము చేతిలోకి తీసుకుంటున్నాను. నీవు నా మనస్సులో నిలచి, నా మాటలను చక్కగా, మంచిగా, అందంగా పలికించుము. నీ విప్పారిన కన్నులతో మమ్ములను కరుణించు. ఓ జగన్మోహినీ! ఓ సరస్వతీ! ఓ భగవతీ! ఓ చంద్రముఖీ!


Comments