5-13 : హనుమంతుడు లంకను చూచుట - రంగనాథ రామాయణం - ద్విపద కావ్యం
సుందరాకాండ: #5 - #13 (page: 230, pdf page: 250 ) య ట దక్షిణము చూచి య ప్పు డిట్లనియె - న టఁ ద్రికూటాద్రిపై న మరెడుదాని గ ద లక ధర్మార్థ కా మము ల్మూడు - పొ ది గొన్న సిరివోలెఁ బొ లుపొందుదాని న మ రావతీపురం న బ్ధిమధ్యమునఁ - గ మ నీయగతి నొప్పు గ లిగినదాని న ల క కుబేరుతో న లుకమై నచట - నె ల కొన్న కైవడి నె గడెడుదానిఁ గ ల కాలమును నధో గ తి నుండలేక - తె లి విమై భోగవ తీ నగరంబు జ ల రాశి వెలువడి స రి త్రికూటమున - వె ల సిన కైవడి వి లసిల్లుదాని నం బు ధి యావర ణాం బువు లాఁగఁ - బం డి న ప్రభ నొప్పు బం గారుకోట బ్ర హ్మాం డవిధముగాఁ బ రికింప నొప్పు - బ్ర హ్మా ద్యభేద్యమై ప రఁగెడుదాని మొ న సి లోకములకు మొ న యెక్కుడగుచుఁ - .... భావం: అటు దక్షిణ దిశగా చూసి హనుమంతుడు ఇలా అనుకున్నాడు - "ఆ త్రికూట పర్వతం మీద, ధర్మ, అర్ధ, కామములు మూడు కలగలసి ఉన్నట్టుగా, దేవతల అమరావతీ పురం సముద్రం మధ్యలో ఉన్నట్టుగా, అలకాపురి రాజైన కుబేరుడు ఇంకా లంకలోనే నివాసమున...