భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 20
త్రిమూర్తులకు మూల తత్వమైనటువంటి పరమాత్మ తత్వాన్ని, ఒక చిన్న కంద పద్యంగా 17 వ భాగంలో చూసాం. అదే భావన మొదటి స్కంధంలో నాలుగు స్తుతి పద్యాలుగా ఎలా కనబడుతుందో చూద్దాం. ఈ నాలుగు పద్యాలు షష్ఠ్యాంతాలుగా పిలువబడే వరుస పద్యాలు. ఇవి మొదటి స్కంధంలో ఇష్టదేవతారాధన పద్యాల తరువాత వచ్చే పద్యాలు. ఇవిగో ఆ నాలుగు షష్ఠ్యాంతాలు. 1-29-ఉ హారికి, నందగోకులవిహారికిఁ జక్రసమీరదైత్య సం హారికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్. 1-30-ఉ శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణ హస్త ని ర్మూలికి, ఘోర నీరదవిముక్త శిలాహతగోపగోపికా పాలికి, వర్ణధర్మపరిపాలికి, నర్జునభూజయుగ్మ సం చాలికి, మాలికిన్, విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్. 1-31-ఉ క్షంతకుఁ, గాళియోరగవిశాలఫణావళినర్తనక్రియా రంతకు, నుల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ హంతకు, నింద్ర నందన నియంతకు, సర్వచరాచరావళీ మంతకు, నిర్జితేంద్రియసమంచితభక్తజనానుగంతకున్. 1-32-ఉ . న్యాయికి, భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీమన స్థ్సాయికి, భూతసమ్మదవిధాయికి, సాధుజనానురాగ సం ధాయికిఁ, బీతవస్త్రపరిధాయికిఁ, బద్మభవాం...