Posts

Showing posts from May, 2022

సీ. మరల నిదేల రామాయణం - విశ్వనాథ సత్యనారాయణ - 100 పద్యాలు

  సీ. మరల నిదేల రామాయణం బన్నచో మ రల నిదేల రా మా యణం బన్నచో ,  నీ   ప్రపంచకమెల్ల   నె ల్ల వేళ తి నుచున్న అన్నమే   తి నుచున్నదిన్నాళ్ళు ,  త న రుచి బ్రదుకులు   త నివి గాన చే సిన సంసార మే   చేయు చున్నది ,  త నదైన అనుభూతి   త నది గాన త లచిన రామునే   త లచెదనేనును ,  నా   భక్తి రచనలు   నా వి గాన   క వి ప్రతిభలోన నుండును   గా వ్యగత శ తాం శములయందు తొంబది యై న పాళ్ళు ప్రా గ్వి పశ్చిన్మతంబున   ర సము వేయి రె ట్లు గొప్పది నవకథా   దృ తిని మించి 1.     మరల నిదేల రామాయణం బన్నచో 2.     నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ 3.     తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు 4.     తన రుచి బ్రదుకులు తనివి గాన 5.     చేసిన సంసారమే చేయు చున్నది 6.     తనదైన అనుభూతి తనది గాన 7.     తలచిన రామునే తలచెదనేనును 8.   ...

యుద్ధకాండ: 310-314 - విభీషణుడు రావణాసురుని వారించుట

 సందర్భము: రావణాసురుడు మంత్రులతో కొలువుతీరి వారి ప్రతాపాలు వింటుండగా, విభీషణుడు యుద్ధం వద్దని వారిస్తున్నాడు. యుద్ధకాండ - 310-314 మే టి వానరు లిట  మీ ఱక మున్నె -  కో ట లు వారిచేఁ  గూ లకమున్నె,  సౌ మి త్రిబాణవ ర్ష ము రాకమున్నె -  రా ము నికోపాగ్ని  రాఁ జకమున్నె,  యా య గ్నిచే లంక  య డఁగకమున్నె -  యీ య సురావళి  యీ ల్గ కమున్నె,  సీ తఁ   బుచ్చుఁడు వేగ  శ్రీ రాముకడకు -  సీ తఁ   దెచ్చినకీడు  చేఁ   జేతఁ గుడుపు  ధ ర్మా త్ముఁ డౌ రామ  ధ రణీశ్వరుండు -  ధ ర్మం బువలననే  త గ నుండు జయము   భావం: ఆ వానర వీరులు చెలరేగక ముందే, కోటలు వారి ద్వారా కూలక మందే, లక్ష్మణుడి బాణవర్షము రాక ముందే, శ్రీరాముని కోపాగ్ని రాజుకోక మందే, ఆ అగ్నివలన లంకా నగరము నాశనము కాక ముందే, రాక్షసజాతి చనిపోక ముందే, వేగమే సీతను శ్రీరాముని వద్దకు పంపించు, సీతను తీసుకువచ్చిన పాపము అనుభవించు, ధర్మాత్ముడైన శ్రీరాముడుకు ధర్మము వలననే గెలుపు తధ్యము. ఈలుగు  = చచ్చు పుచ్చు  = పంపు -- రంగనాథ రామాయణం - PDF -  ht...

యుద్ధకాండ: 266-277 - రాక్షస వీరులు రావణునికి ప్రతాపములు చెప్పుట

సందర్భము: శ్రీరాముడు అటుతీరంలో కపివీరులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడని రావణాసురుడు మంత్రులతో సమాలోచన ఏర్పాటు చేసాడు. రాక్షస వీరులందరూ కలసి తమ ప్రతాపము తెలియచేస్తున్నారు. నా ది గాఁ గల్గు మ హా దైత్యవరులు -  నా దై త్యవల్లభు  న గ్రభాగమునఁ  గ న్ను లఁ గోపంబు  గ డలుకొనంగ -  మి న్ను లు ముట్టంగ  మీ టి పల్కుచును  బ్ర ళ యావసర మహా ప వన నిర్ధూత  -  కు ల పర్వతములన  గుం భిని యదర  నొం డొ రుఁ జూచుచు  ను ద్దండవృత్తి -  నొం డొ రు మెచ్చక  యు గ్రత మెఱసి  యూ ర్పు లు నిగుడ న త్యు గ్రత మగ్గు -  స ర్పం బులును బోలె  స రభస వృత్తి . శూ లం బు లంకించి   సు రియలు బిగిచి -  వా ల ము ల్జళిపించి  వ ర తనుత్రాణ   స బ ళంబు అమరించి  చ క్రము ల్ద్రిప్పి -  ప్ర బ లంబు లగు భిండి వా లము ల్దిగిచి  ప ట్ట సం బెసఁగించి  ప్రా సము   ల్ద్రిప్పి  -  గ ట్టి  విండ్లు ను గుణ కం పము ల్చేసి  యు డు గక యెలుగు లొం డొం టితో రాయ -  మి డు గురు ల్మంటలు  మి క్కుటంబుగను  ఒం ...

యుద్ధకాండ - 104-115 - యుద్ధానికి కపివీరుల ఉత్సాహము

  సందర్భము: లంక మీదకు యుద్ధానికి సిద్ధం అవమని రాముని ఆజ్ఞ విని కపి వీరులు ఉత్సాహంతో బయలుదేరి నడుస్తున్నారు. యుద్ధకాండ:  104-115 న ప్పు డు కపివీరు   లం దఱు చెలఁగి -  య ప్ప రమేశ్వరుఁ   డా నందమొంద   నా ర వంబున మ్రోసె   నా కాశవీథి -  నా ర వంబున భూమి   య టునిటు పడియె   నా ర వంబు నఁ బెల్చ   న ద్రులు వణఁకె -  నా ర వంబున మ్రొగ్గె   నా దిగ్గజములు.   నా ర వంబున భార   మ య్యె శేషునకు -  నా ర వంబునఁ గూర్మ   మ ణఁచె శిరంబు   భావం: యుద్ధానికి శ్రీరాముని పిలుపును విన్న కపివీరులు ఉత్సాహంతో గర్జించారు. ఆ గర్జనకు దిక్కులు పిక్కటిల్లాయి. భూమి కంపించింది. పర్వతాలు ఊగిసలాడాయి. అష్టదిగ్గజాలు తలవంచాయి. భూమిని మోసే ఆదిశేషునికి బరువెక్కింది. ఆదికూర్మము తలవంచింది.   ఇ టు సేన నడవంగ   నె గసినధూళి -  ప ట లంబు మిన్నంది   బ హువర్ణములను   ఆ ర వంబున భార మై   యిల నెసఁగు -  తో రం పు నిశ్వాస  ధూ మంబు లనఁగ భావం: అశేషమైన వానర సేన నడుస్తుంటే పైకి ఎగసిన ధూళి, ఆ వీరులు భీకర గర్జనలకు భూమికి భార...