సీ. మరల నిదేల రామాయణం - విశ్వనాథ సత్యనారాయణ - 100 పద్యాలు

 

సీ. మరల నిదేల రామాయణం బన్నచో

రల నిదేల రామాయణం బన్నచోనీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ
తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళున రుచి బ్రదుకులు నివి గాన
చేసిన సంసారమే చేయు చున్నదినదైన అనుభూతి నది గాన
లచిన రామునే లచెదనేనునునా భక్తి రచనలు నావి గాన

 

వి ప్రతిభలోన నుండును గావ్యగత శతాంశములయందు తొంబదియైన పాళ్ళు
ప్రాగ్వి పశ్చిన్మతంబున సము వేయిరెట్లు గొప్పది నవకథా దృతిని మించి

1.    మరల నిదేల రామాయణం బన్నచో

2.    నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ

3.    తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు

4.    తన రుచి బ్రదుకులు తనివి గాన

5.    చేసిన సంసారమే చేయు చున్నది

6.    తనదైన అనుభూతి తనది గాన

7.    తలచిన రామునే తలచెదనేనును

8.    నా భక్తి రచనలు నావి గాన

9.   కవి ప్రతిభలోన నుండును

10.        కావ్య గత

11.        శతాంశములయందు తొంబదియైన పాళ్ళు

12.        ప్రాగ్విపశ్చిన్మతంబున

13.        రసము వేయి రెట్లు గొప్పది

14.  నవకథా దృతిని మించి

అర్ధాలు: మరల = మళ్లీ; దేల = ఇది ఎందుకు; రామాయణం బన్నచో = రామాయణంబు + అన్నచో; తన రుచి = ఎవరి ఇష్టం, అభిరుచి; సంసారము = జీవనము; అనుభూతి = అనుభవం;  కావ్య గత = కావ్యాలలో; శత అంశములు = వందలో; తొంబదియైన పాళ్ళు  = తొంభై వంతులు; ప్రాగ్వి పశ్చిన్మతంబున = తూర్పు,పడమరలో, ఎటు చూసినా, ఎలా ఆలోచించినా; రెట్లు  = అధికముగా; రసము = రసము

భావం:

ఎవరైనా, మళ్లీ రామాయణమా? ఇప్పుడు ఎందుకు అంటారేమో? ఏం ప్రపంచమంతా ప్రతి దినమూ, అదే తిండి తినటం లేదా? అంతరూ, ప్రతి దినమూ, అదే జీవనం సాగించటం లేదా? ఎవరి అనుభవం వారిది. నేనూ అంతే. నా రాముడిని నేను తలచుకుంటాను. ఇది నేను భక్తితో రచించేది. ఆలోచిస్తే, తెలిసిన కథనే మళ్లీ చెప్పడంలోనే కవి ప్రతిభ తెలుస్తుంది. నూటికి తొంభై పాళ్లు కవి రసాన్ని ఎలా పండిస్తాడో, అనే విషయమే ముఖ్యము. కేవలం క్రొత్త కథ (చప్పగా) చెప్పడం గొప్ప కాదు.

Comments