Posts

Showing posts from March, 2022

మ. కలయో! వైష్ణవ మాయయో! - 100 పద్యాలు

  10.1-342-మ. కలయో! వైష్ణవ మాయయో! క ల యో! వైష్ణవ మాయయో! యితర సం క ల్పార్థమో! సత్యమో!   త లఁ పన్ నేరక యున్నదాననొ! యశో దా దేవిఁ గానో! పర స్థ ల మో! బాలకుఁ డెంత?  యీతని ముఖ స్థం బై యజాండంబు ప్ర జ్వ ల మై యుండుట కేమి హేతువొ! మహా శ్చ ర్యంబు చింతింపఁగన్ 1.      కల యో!  2.     వైష్ణవ మాయయో!  3.     యితర సం క ల్పార్థమో!  4.     సత్యమో!   5.     తలఁ పన్ నేరక యున్నదాననొ!  6.     యశో దా దేవిఁ గానో!  7.     పర స్థల మో!  8.     బాలకుఁ డెంత ?  9.     యీతని ముఖ స్థం బై  10.   యజాండంబు  11.   ప్ర జ్వల మై యుండుట కేమి హేతువొ! 12.   మహా శ్చ ర్యంబు చింతింపఁగన్ అర్థం :  కలయో  =  కలా? ;  వైష్ణవ  =  శ్రీహరి, దేవుని ;  మాయయో  =  మాయా? ;  యితర  =  వేరే ;  సం క ల్పార్థమో =  కారణమా ;  సత్యమో  =  సత్యమేనా? ; ...

శా. బాలుండీతడు - 100 పద్యాలు

  10.1-921- శా. బాలుండీతడు బా లుం   డీతఁడు;  కొండ దొడ్డది ;  మహా భా రంబు సైరింపఁగాఁ జా లం డో;  యని దీని క్రింద నిలువన్   శం కింపఁగా బోల;  దీ శై లాం భోనిధి జంతు సంయుత ధరా చ క్రంబు పైఁబడ్డ నా కే   ల ల్లాడదు;  బంధులార! నిలుఁ డీ   క్రిం దం బ్రమోదంబునన్ 1.       బాలుం   డీతఁడు ;  2.      కొండ దొడ్డది ;  3.      మహా భా రంబు సైరింపఁగాఁ  జాలం డో యని  4.      దీని క్రింద నిలువన్   శం కింపఁగా బోలదు 5.      ఈ శైలాం భోనిధి జంతు సంయుత  6.      ధరా చ క్రంబు పైఁబడ్డ  7.      నా   కే   ల ల్లాడదు ;  8.      బంధులార!  9.      నిలుఁ డీ   క్రిం దం బ్రమోదంబునన్ అర్థం :  బాలుండు  =  చిన్నపిల్లవాడు ;  ఈతడు  =  ఇతను ;   కొండ  =  గోవర్ధన పర్వతము ;   దొడ్డది  =...

మ. సిరికిం జెప్పడు - 100 పద్యాలు

  మ. సిరికిం జెప్పఁడు సి రి కిం జెప్పఁడు ;  శంఖచక్ర యుగముం   జే దోయి సంధింపఁ డే ప రి వారంబును జీరఁ డభ్రగపతిం   బ న్నింపఁ డాకర్ణికాం త ర   ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు వివా ద ప్రోత్థితశ్రీకుచో ప రి   చేలాంచలమైన వీడఁడు గజ ప్రా ణావనోత్సాహియై. 1.       సిరి కిం జెప్పఁడు ;  2.      శంఖచక్ర యుగముం   జే దోయి సంధింపఁడు 3.      ఏ పరి వారంబును జీరఁడు 4.      అభ్రగపతిం   బ న్నింపఁడు  5.      ఆకర్ణికాం తర   ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు 6.      వివా ద ప్రోత్థిత  7.      శ్రీకుచో  పరి చేలాంచలమైన వీడఁడు 8.      గజ ప్రా ణావనోత్సాహియై. అర్థం :  సిరి కిం  =  లక్ష్మీదేవికి ;  చెప్పఁడు   =  చెప్పలేదు  ;   శంఖ  =  శంఖము ;  చక్ర  =  సుదర్శన చక్రము ; యుగముం  =  రెండింటిని ;   చే దోయి  =  రెండు చేతులలోనూ ; ...

కలడంబోధి కలండుగాలి - 100 పద్యాలు

  మ.  కలడంభోధి ,  గలండు గాలి క ల డంబోధి ,  గలండు గాలి ,  గలడా కా శంబునం ,  గుంభినిం గ ల ,  డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్   ఖ ద్యోత చంద్రాత్మలం గ ల ,  డోంకారమునం ద్రిమూర్తుల ద్రిలిం గ వ్యక్తులం దంతటం గ ల ,  డీశుండు గలండు ,  తండ్రి! వెదకం గా   నేల నీ యా యెడన్ 1.     కల డంబోధి ,  2.     కలండు గాలి 3.     క లడా కా శంబునం ,  గుంభినిం 4.     కల డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్   5.     ఖ ద్యోత చంద్రాత్మలం 6.     కల డోంకారమునం  7.     త్రిమూర్తుల ద్రిలిం గ వ్యక్తులం దంతటం 8.     కగల డీశుండు  9.     కలండు ,  తండ్రి!  10.    వెదకం గా   నేల నీ యా యెడన్ కల డంబోధి  =  కలడు అంభోధి  =  నీటిలో ఉన్నాడు ;   క లండు గాలి  =  గాలిలో ఉన్నాడు  ; క లడా కా శంబునం  =  కలడు ఆకాశంబునం  =  ఆకాశము నందు ఉన్నాడు ; ,  కుం ...