కలడంబోధి కలండుగాలి - 100 పద్యాలు
మ. కలడంభోధి, గలండు గాలి | |
కలడంబోధి, గలండు గాలి, గలడాకాశంబునం, గుంభినిం | |
1. కలడంబోధి, 2. కలండు గాలి 3. కలడాకాశంబునం, గుంభినిం 4. కలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ 5. ఖద్యోత చంద్రాత్మలం | 6. కలడోంకారమునం 7. త్రిమూర్తుల ద్రిలింగవ్యక్తులం దంతటం 8. కగలడీశుండు 9. కలండు, తండ్రి! 10. వెదకంగా నేల నీ యా యెడన్ |
కలడంబోధి = కలడు అంభోధి = నీటిలో ఉన్నాడు; కలండు గాలి = గాలిలో ఉన్నాడు ;కలడాకాశంబునం = కలడు ఆకాశంబునం = ఆకాశము నందు ఉన్నాడు;, కుంభినిం =భూమిలో; కలడగ్నిన్ = కలడు అగ్నిన్ = అగ్నిలో ఉన్నాడు; దిశలం = అన్ని వైపులా; పగళ్ళ =పగలులో; నిశలన్ = రాత్రిలో; ఖద్యోత = సూర్యునిలో; చంద్ర = చంద్రునిలో; ఆత్మలం = అందరిలో; కలడోంకారమునం = ఓంకారములో ఉన్నాడు; త్రిమూర్తుల = త్రిమూర్తులలో;త్రిలింగ వ్యక్తులం = మూడురకాల వ్యక్తులలోనూ ; అంతటం = అంతటా; కలడీశుండు =ఉన్నాడు ఈశుండు; కలండు = ఉన్నాడు; తండ్రి! = తండ్రీ; వెదకంగాన్ = వెతకటం; ఏలన్ =ఎందుకు ; ఈ యా యెడన్ = ఇక్కడా, అక్కడా ; | |
భావం: శ్రీమహావిష్ణువు సముద్రంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, భూమిపై ఉన్నాడు, అగ్నిలో, దిక్కులయందు, పగళ్ళయందు, రాత్రులందు, సూర్యచంద్రులలో, ఆత్మలో కూడా ఉన్నాడు. ఓంకారములోను, త్రిమూర్తులలో, స్త్రీలలో, పురుషులలో, నపుంసకులలో అంతటా ఉన్నాడు తండ్రీ! అక్కడా ఇక్కడా అని వెదకడం ఎందుకు?పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెప్పిన పద్యం ఇది. |
Comments
Post a Comment