మ. కలయో! వైష్ణవ మాయయో! - 100 పద్యాలు

 

10.1-342-మ. కలయో! వైష్ణవ మాయయో!

యో! వైష్ణవ మాయయో! యితర సంల్పార్థమో! సత్యమో! 
లఁపన్ నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర
స్థమో! బాలకుఁ డెంత? యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వమై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్

1.    కలయో! 

2.   వైష్ణవ మాయయో! 

3.   యితర సంల్పార్థమో! 

4.   సత్యమో! 

5.   తలఁపన్ నేరక యున్నదాననొ! 

6.   యశోదాదేవిఁ గానో! 

7.   పరస్థలమో! 

8.   బాలకుఁ డెంత

9.   యీతని ముఖస్థంబై 

10. యజాండంబు 

11. ప్రజ్వలమై యుండుట కేమి హేతువొ!

12. మహాశ్చర్యంబు చింతింపఁగన్

అర్థం
కలయో = కలా?; వైష్ణవ = శ్రీహరి, దేవుని; మాయయో = మాయా?; యితర = వేరే; సంల్పార్థమో = కారణమా; సత్యమో = సత్యమేనా?; తలఁపన్ = ఆలోచన; నేరక = లేకుండా; యున్నదాననొ = ఉన్నానా?;యశోదాదేవిఁన్ = యశోదను ; కానో = కాదా?; పరస్థలమో = వేరే చోటున ఉన్నానా;బాలకుఁ డెంత = చిన్న పిల్లవాడు ఎంత; యీతని = ఇతని యొక్క ; ముఖస్థంబై = నోటిలోపల; అజాండంబు = బ్రహ్మాండము;ప్రజ్వలమై = ప్రకాశవంతగా; యుండుటకు = ఉండటానికి; ఏమి = ఏమిటి; హేతువొ = కారణమో;మహాశ్చర్యంబు = చాలా ఆశ్చర్యముగా ఉన్నది; చింతింపఁగన్ = ఆలోచించగా;
భావం
ఈ పద్యం పోతన వ్రాసిన ఆంధ్ర మహాభాగవతం లోనిది. బాలకృష్ణుడు మట్టి తిన్నాడని యశోద కోపగించుకున్నది. నోరు తెరవమన్నది. తీరా చూస్తా బాలకృష్ణుని నోట్లో సమస్త బ్రహ్మాండాలు కనిపించాయి. అప్పుడు యశోద మనసులోని భావనలు తెలిపే పద్యం ఇది.
 
నేను కలగనటంలేదు కదా! లేకపోతే ఇదంతా విష్ణుమాయ కాదుగదా! దీనిలో మరింకేదైనా అర్థం ఉందా! కాకపోతే ఇదే సత్యమైనదేమో! నా మనసు సరిగా ఆలోచించటం లేదేమో! నేను నిజంగా యశోదాదేవినేనా! ఇది అసలు మా యిల్లేనా! ఇదంతా ఏమిటి ఈ పిల్లాడు చూస్తే ఇంత ఉన్నాడు. ఈ బ్రహ్మాండ మంతా ఇతని నోట్లో ఎందుకు వెలిగిపోతోందో ఏమిటో! ఆలోచిస్తున్న కొద్దీ ఎంతో ఆశ్చర్యం కలుగుతోంది.

Comments