శా. బాలుండీతడు - 100 పద్యాలు

 

10.1-921-శా. బాలుండీతడు

బాలుం డీతఁడు; కొండ దొడ్డదిమహాభారంబు సైరింపఁగాఁ
జాలండో; యని దీని క్రింద నిలువన్ శంకింపఁగా బోల; దీ
శైలాంభోనిధి జంతు సంయుత ధరాక్రంబు పైఁబడ్డ నా
కే ల్లాడదు; బంధులార! నిలుఁ డీ క్రిందం బ్రమోదంబునన్

1.     బాలుం డీతఁడు

2.    కొండ దొడ్డది

3.    మహాభారంబు సైరింపఁగాఁ జాలండో యని 

4.    దీని క్రింద నిలువన్ శంకింపఁగా బోలదు

5.    ఈ శైలాంభోనిధి జంతు సంయుత 

6.    ధరాక్రంబు పైఁబడ్డ 

7.    నా కే ల్లాడదు

8.    బంధులార! 

9.    నిలుఁ డీ క్రిందం బ్రమోదంబునన్

అర్థం: బాలుండు = చిన్నపిల్లవాడు; ఈతడు = ఇతను; కొండ = గోవర్ధన పర్వతము; దొడ్డది = పెద్దది;మహాభారంబు = చాలా బరువు; సైరింపఁగాఁ = మోయ; జాలండో = లేడేమోనని; అని = అని; దీని = దీని;క్రింద = క్రిందన; నిలువన్ = నిలబడటానికి;  శంకింపఁగా = అనుమానం; బోలదు = వద్దుఈ శైలాంభోనిధి = ఈ శైల + అంబో నిధి  = ఈ పర్వతములు, సముద్రములు ; జంతు = జంతువులు ;  సంయుత = నిండియున్న; ధరాక్రంబు = భూచక్రము; పైఁబడ్డ = మీ పడ్డా; నా కేలు = నా చిటికెన వేలు; అలల్లాడదు = అదరదు;  బంధులార = బంధువులారా!; నిలుఁడు = నిలబడండి; క్రిందం = ఈ క్రిందన; ప్రమోదంబునన్నిశ్చింతగా;

భావంఈ పద్యం పోతన వ్రాసిన ఆంధ్ర మహాభాగవతం లోని దశమ స్కంధం లోనిది. బాలకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలు మీద ఎత్తిన తన బంధువర్గాని దాని క్రిందకు రమ్మని పిలుస్తున్న సందర్భంలోనిది ఈ పద్యం.

 

ఓ బంధువులారా! నేను చిన్నపిల్లవాడినని, ఈ పర్వతం చాలా పెద్దదని, దీని క్రిందన నిలబడటానికి సందేహం వద్దు. ఈ పర్వతాలు, సముద్రాలు, జంతువులతో నిండిన భూచక్రమంతా మీద పడ్డా నా చిటికెన వేలు చలించదు. సంతోషంగా దీని క్రిందన నిలబడండి.

Comments