Posts

Showing posts from March, 2021

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 47

ఈ భాగంలో కూడా రాక్షసుల దూకుడు వ్యవహారం చిత్రించే పద్యాలు చూద్దాం. గత రెండు భాగాల లాగానే పక్కపక్క పద్యాలు. ముందుగా కథా సందర్భం. సప్తమ స్కంధలోని ప్రహ్లాద చరిత్రలోనివి. ప్రహ్లాదుడు జన్మించక ముందు జరిగినది. హిరణ్యాక్షుడిని శ్రీమహావిష్ణువు వరాహవతారం ధరించి సంహరించాడు. అతడి అన్న, హిరణ్యకశిపుడు విష్ణువు ఉన్న చోట్లను, తన అనుచరులతో, నాశనం చేయించాడు. మృత్యువును, దేవతలను, విష్ణువును జయించాలని తీవ్రమైన తపస్సు చేసి, బ్రహ్మదేవుడి నుంచి వరాలను సంపాదించాడు. ఆ వరాల గర్వంతో, తన సోదరుడిని చంపారన్న పగతో, ముల్లోకాలనూ తానే స్వయంగా నాశనం చేస్తున్నాడు. అతడి అనుచర గణం కూడా అందరినీ గద్దిస్తూ బెదిరిస్తున్నారు. ఇవిగో పద్యాలు. 7-95-సీ.  (హిరణ్యకశిపుడు నాశనం చేయుట) సీ. ఒకనాఁడు గంధర్వ యూధంబుఁ బరిమార్చు దివిజుల నొకనాఁడు దెరలఁ దోలు భుజగుల నొకనాఁడు భోగంబులకుఁ బాపు గ్రహముల నొకనాఁడు గట్టివైచు నొకనాఁడు యక్షుల నుగ్రత దండించు నొకనాఁడు విహగుల నొడిసిపట్టు నొకనాఁడు సిద్ధుల నోడించి బంధించు మనుజుల నొకనాఁడు మదము లడఁచు తే. కడిమి నొకనాఁడు కిన్నర ఖచర సాధ్య చారన ప్రేత భూత పిశాచ వన్య సత్త్వ విద్యాధరాదుల సంహరించి దితితనూజుండు దుస...

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 46

గత భాగంలాగానే, ఈ భాగంలో కూడా రాక్షసుల అత్యుత్సాహాన్ని తెలియజేసే పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భం. సప్తమ స్కంధంలోని ప్రహ్లాదచరిత్రలోని పద్యాలు. ప్రహ్లాదుడు జన్మించడానికి ముందు జరిగిన విషయం. ప్రహ్లాదునికి తండ్రి హిరణ్యకశిపుడు, పినతండ్రి హిరణ్యాక్షుడు. శ్రీమహావిష్ణువు వరాహ అవతారం ధరించి, హిరణ్యాక్షుడిని సంహరించాడు. ఆ విషయం తెలుసుకున్న హిరణ్యకశిపుడు, తన తమ్ముని చావుకు ప్రతీకారంగా,  తన రాక్షస గణాలను ప్రేరేపిస్తున్నాడు. ఇవిగో పద్యాలు. 7-34-సీ.  (హిరణ్యకశిపుడు రాక్షసులను ప్రేరేపించుట) సీ. పొండు దానవులార! భూసురక్షేత్ర సంగత యైన భూమికి గములు గట్టి మఖతప స్స్వాధ్యాయ మౌనవ్రతస్థుల వెదకి ఖండింపుఁడు విష్ణుఁ డనఁగ నన్యుఁ డొక్కఁడు లేఁడు యజ్ఞంబు వేదంబు నతఁడె భూదేవ క్రియాది మూల మతఁడె దేవర్షి పిత్రాది లోకములకు ధర్మాదులకు మహాధార మతఁడె    గీ. యే స్థలంబున గో భూసురేంద్ర వేద వర్ణ ధర్మాశ్రమంబులు వరుస నుండు నా స్థలంబుల కెల్ల నీ రరగి చెఱిచి దగ్ధములు సేసి రండు మీ దర్ప మొప్ప. 7-36-సీ.  (రాక్షసులు నాశనం చేయుట) సీ. గ్రామ పురక్షేత్ర ఖర్వట ఖేట ఘో షారామ నగరాశ్ర మాదికములు గాలిచి కొలఁకు...

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 45

ఈ భాగంలో రాక్షసుల అత్యుత్సాహాన్ని చూపించే పద్యాలు చూద్దాం. రెండూ వరుస పద్యాలు. ముందుగా కథా సందర్భం. దశమ స్కంధం పూర్వభాగం లోనివి. వసుదేవుడు శ్రీకృష్ణుడుని రేపల్లెలో యశోదానందుల ఇంటిలో ఉంచి అక్కడ పుట్టిన యోగమాయను తీసుకొని వచ్చాడు. కంసుడు ఆ ఆడపిల్లను చంపబోతే, ఆమె ఆకాశానికి ఎగిరిపోయి కంసుడిని, "నిన్ను సంహరించే వాడు వేరే చోట పెరుగుతున్నాడు" అంటూ హెచ్చరించింది. కంసుడు తన మంత్రులందరినీ సమావేశ పరిచాడు. అసలు విష్ణువు ఎక్కడ ఉంటాడో, ఆయా స్థలాలను, వస్తువులను ముందుగా నాశనం చేసేస్తే మంచిది అంటూ ముందుగా వారి నుంచి ఒక సలహా వచ్చింది. ఇవిగో పద్యాలు. 10.1-168-మ. (విష్ణువు ఉండే చోట్లు) అమరశ్రేణికి నెల్లఁ జక్రి ముఖరుం డా చక్రి యేధర్మమం దమరున్; గోవులు భూమిదేవులు దితిక్షామ్నాయ కారుణ్య స త్యములున్ యాగ తపోదమంబులును శ్రద్ధాశాంతులున్ విష్ణుదే హము లిన్నింటిని సంహరించిన నతం డంతంబునుం బొందెడిన్. 10.1-170-ఉ. (నాశనం చేయుటకు ఉత్సాహం) చంపుదుమే నిలింపులను? జంకెల ఱంకెలఁ దాపసావళిం బంపుదుమే కృతాంతకుని పాలికిఁ? గ్రేపులతోడ గోవులం ద్రుంపుదుమే? ధరామరులఁ దోలుదుమే? నిగమంబులన్ విదా రింపుదుమే? వసుంధర హరింపుదు మే? జననాథ...

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 44

ఈ భాగంలో శ్రీహరి చింతన చేసే పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. సప్తమ స్కంధంలోని ప్రహ్లాద చరిత్రలోనిది. హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. ఆ సమయంలో గర్భంతో ఉన్న అతడి భార్య లీలావతికి నారదుడు ఆశ్రయం కల్పించాడు. రోజూ శ్రీమహావిష్ణువు గురించి బోధించేవాడు. కడుపులోనున్న బిడ్డ ఆ కథలన్నీ విని, పుట్టినప్పటి నుండే శ్రీహరి యందు భక్తి పరాయణుడిగా ఉండేవాడు. ఆ ప్రహ్లాదుడు ఏమి చేసినా సదా శ్రీహరి ధ్యానమే.  రెండవది. దశమ స్కంధం - పూర్వ భాగంలోనిది. చెరసాలలో ఉన్న దేవకి అష్టమ గర్భం ధరించింది. కంసునికి ఎక్కడ చూసినా, ఏమి చేస్తున్నా ఆ శ్రీహరి ధ్యానమే. ఇవిగో పద్యాలు. 7-123-శా. పానీయంబులు ద్రావుచున్‌ గుడుచుచున్‌ భాషింపుచున్‌ హాస లీ లా నిద్రాదులు సేయుచున్‌ దిరుగుచున్‌ లక్షింపుచున్‌ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సం ధానుం డై మఱచెన్‌ సురారిసుతుఁ డే త ద్విశ్వమున్‌ భూవరా! 10.1-85-క. తిరుగుచు గుడుచుచు ద్రావుచు నరుగుచు గూర్చుండి లేచు చనవరతంబున్‌ హరి దలచి దలచి జగమా హరి మయమని జూచె కంసు డారని యలుకన్‌ ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండింటి లోనూ, సదా శ్రీహరి ధ్యానములో నిమగ్నమైన వ్యక్తులను...