ఛందస్సు పద్యాలు చదువుకోవడం ఎలా - 3?
మొదటి భాగంలో లఘువులు, గురువుల ద్వారా పదాల కూర్పును చూసాం. గురువులు పద్యాల ఎత్తుగడకు ఉపయోగపడతాయి. లఘువులు దమ్ము తక్కువగా ఉన్నప్పుడు వాడతారు. రెండవ భాగంలో ఆ లఘువులు, గురువులగు అమర్చుకోవడం ద్వారా నడకలు ఎలా ఏర్పాడతాయో చూసాం. ఈ భాగంలో ఈ లఘువులు, గురువుల అమరికను రసపోషణకు ఎలా వాడతారో చూద్దాం. రసపోషణ - పద్యనిర్మాణం ఊపిరి/దమ్ము ఎక్కువగా ఉన్నప్పుడు, గురువు ఎత్తుకోవడానికి అనువు అని మొదటి భాగంలో చెప్పుకున్నాం. మన మనస్సులో ఏ భావం ఉన్నప్పుడు ఊపిరి బిగపడతాం? ఆ భావం వ్యక్తపరచడానికి గురువులు ఎక్కువగా ఉన్న పద్యం ఎత్తుకుంటారా? ఉదాహరణకు ఏదైనా ఉద్వేగం, ఉత్కంఠం అయిన సన్నివేశం చెప్పాలంటే గురువులు ఎక్కువగా ఉన్న పద్యం వ్రాస్తారా? మరి పద్యంలో లఘువులు ఎక్కువగా ఉంటే ఏ భావం పలుకుతుంది? ఏదైన కరుణ రసం పలికించాలంటేనో లేదా నీతి బోధ వంటివి చేయాలంటేనో ఎక్కువగా లఘువులు ఉన్న పద్యం ఎత్తుకోవాల్సిందేనా? లఘువులు, గురువులు కాస్త అటూ ఇటూగా సమానంగా ఉంటే సాధారణ వర్ణనకు అనుకూలం. గురువులు ఒక రవ్వ ఎక్కువగా ఉంటే గాంభీర్యానికి అనుకూలం. పట్టిక వృత్త పద్యాలను పూర్వభాగం (మొదటి అక్షరం నుండి యతి వ...