Posts

Showing posts from October, 2020

కావ్య భాష - పత్రికల భాష - పోలిక

 సరదాగా కొన్ని చొప్పదంటు ప్రశ్నలు. పోతన భాగవతంలోని కావ్యభాషలో ఏ అక్షరం ఎక్కవ వాడబడినది? పొడి అక్షరాలు ఎక్కువ వాడబడ్డాయా లేకపోతే సంయుక్తాక్షరాలా? ద్విత్వాలా? అసలు ఎన్ని అక్షరాలు వాడబడ్డాయి? ఏ అక్షరం ఎన్నిసార్లు వాడబడినదో ఒక పట్టిక తయారుచేయచ్చా? అలాగే, ఈ కాలంలోని వార్తాపత్రికలలోని తెలుగు భాషకు కూడా ఒక అక్షరాల పట్టిక తయారుచేసి, పోతన భాగవతం ద్వారా వచ్చిన అక్షర పట్టికతో పోలిస్తే ఏమవుతుంది? ఏమి విషయాలు తెలుకోవచ్చు? మొబైల్ యాప్స్ చేసిన అనుభవంతో ఇలాంటి గణాంకాల పట్టిక ఒకటి తయారు చేసాను. ఈ క్రింది పట్టిక లోని మొదటి రెండు నిలువరసలు చూడండి. పోతన భాగవతంలో ఎక్కవగా వాడబడిన మొదటి 25 అక్షరాలు. మూడవ వరుసలో ఆ పాతిక అక్షరాలు, వార్తాపత్రికలలో, ఎలా వాడబడినాయో గణాంకాల శాతం. పోతన భాగవతం ~1500 CE వార్తాపత్రికలు - 2020 CE న 3.66% 2.14% ల 2.83% 1.99% ము 2.66% 0.62% ని 2.23% 1.97% డు 2.18% 0.92% అ 2.07% 1.66% న్ 2.06% 0.41% ను 2.02% 0.98% క 1.93% 1.70% లు 1.81% 2.19% త 1.71% 1.41% వ 1.62% 1.58% ర 1.61% 1.47% మ 1.46% 1.34% ప 1.39% 1.25% వి 1.24% 0.86% బు 1.15% 0.17% గ 1.13% 0.76% ద 1.13% 0.92% రు 1.12% 1.25% ...

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 27

Image
 ఈ భాగంలో, భాగవతంలోని, చాలా ప్రాచుర్యంలో ఉన్న రెండు పద్యాలు ద్వంద్వ శిల్పం దృష్టితో చూద్దాం. ముందుగా కథా సందర్భం.  భాగవతంలోని అష్టమ స్కంధంలోని గజేంద్రమోక్షం ఘట్టంలోనివి. గజేంద్రుడు అడవిలోని సరస్సును చెల్లాచెదరు చేస్తూ మొసలి బారిన పడ్డాడు. ఆ మొసలితో పోరాడిపోరాడి డస్సిపోయాడు. నీవే దిక్కని పరమాత్మకు మొక్కాడు. "అల వైకుంఠపురంబు"లోని విష్ణువు, లక్ష్మీదేవితో పరాచికాలాడుతూ పట్టుకున్న కొంగును కూడా విడవకుండా హుటాహుటిన బయలుదేరాడు. ఆయన వెనకాలనే లక్ష్మీదేవి, పరివారంతో సహా కూడా నడచి వస్తోంది. ఇవిగో పద్యాలు. 8-96-మ. సి రి కిం జెప్పఁడు ; శంఖ చక్ర యుగముం జే దోయి సంధింపఁ ; డే ప రి వారంబునుఁ జీరఁ ; డభ్రగపతిం బ న్నింపఁ ; డాకర్ణికాం త ర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు ; వివా ద ప్రోత్థితశ్రీకుచో ప రి చేలాంచలమైన వీడఁడు గజ ప్రా ణావనోత్సాహియై .  8-98-మ. త న వెంటన్ సిరి; లచ్చివెంట నవరో ధ వ్రాతమున్; దాని వె న్క నుఁ   బక్షీంద్రుఁడు; వాని పొంతను ధనుః కౌ మోదకీ, శంఖ, చ క్ర ని కాయంబును; నారదుండు; ధ్వజినీ కాం తుండు రా వచ్చి రొ య్య న   వైకుంఠపురంబునం గలుగువా  రా బాలగోపాలమున్.  ఇప...

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 26

  24 , 25 వ భాగాలలో చూసిన కర్మ, జ్ఞానేంద్రియాల ద్వారా భగవంతుని స్పృహ గురించిన మరొక రెండు పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. రెండూ దశమ స్కంధం పూర్వ భాగంలోనివి. మొదటిది. దశమ స్కంధంలోని మొదటి ఘట్టం, శ్రీకృష్ణజననం. దేవకి, కంసుని చెరలో ఉన్నది. అష్టమ గర్భం ధరించింది. నెలలు నిండాయి. కాన్పు ఇవాళో రేపో అన్నట్టుగా ఉంది. కంసుడు ప్రతిదానికీ ఉలికి ఉలికి పడుతున్నాడు. రెండవది. దశమ స్కంధంలోని చివరి ఘట్టం, రుక్మిణీకల్యాణం. రుక్మిణికి ఇష్టంలేని పెళ్లి నిర్ణయించారు. శ్రీకృష్ణుడికి సందేశం పంపించినది. ఇవిగో పద్యాలు. 10.1-87-సీ. (కంసుని మానసిక స్థితి) శ్ర వణరంధ్రముల నే శ బ్దంబు వినఁబడు న ది హరిరవ మని యా లకించు; న క్షిమార్గమున నె య్య ది చూడఁబడు నది హ రిమూర్తి గానోపు నం చుఁ జూచుఁ; ది రుగుచో దేహంబు తృ ణమైన సోఁకిన హ రికరాఘాతమో య నుచుఁ నులుకు; గం ధంబు లేమైన ఘ్రా ణంబు సోఁకిన హ రిమాలికాగంధ మ నుచు నదరుఁ; బ లుకు లెవ్వియైనఁ బ లుకుచో హరిపేరు ప లుకఁబడియె ననుచు బ్ర మసి పలుకుఁ; ద లఁపు లెట్టివైనఁ ద లఁచి యా తలఁపులు హ రితలంపు లనుచు న లుఁగఁ దలఁచు. 10.1-1711-సీ (రుక్మిణి లేఖ) ప్రా ణేశ! నీ మంజు భా షలు వినలే...

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 25

24వ భాగంలో కర్మ, జ్ఞానేంద్రియాల ద్వారా, పరమాత్మ యొక్క స్పృహ, భక్తుల విషయంలో ఎలా చిత్రించారో చూసాం. అదే విషయం గోపికల ద్వారా ఎలా చూపించారో, దశమ స్కంధం నుంచి మూడు పద్యాలలో చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. శ్రీకృష్ణుడు కాళింది మడుగులోకి దూకాడు. గోపికలతో సహా అందరూ ఆదుర్దా పడుతున్నారు. రెండవది. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం, చిటికెన వేలుపై ఎత్తి, ఏడురోజుల పాటు గాలివానల నుండి అందరినీ కాపాడాడు. వానాకాలం పోయి శరదృతువు వచ్చింది. గోపికలు శ్రీకృష్ణుని రాక కోసం చూస్తున్నారు. మూడవది. కంసుడు, అక్రూరుని ద్వారా బలరామకృష్ణులకు ఆహ్వానం పంపించాడు. ఇద్దరూ మధుర విడిచి ద్వారక వెళ్లారు. కంసుని సంహరించారు. శ్రీకృష్ణుని సందేశంతో ఉద్ధవుడు మధురకు వచ్చాడు. గోపికలు నిష్ఠూరాలు పోతూ బాధపడుతున్నారు. ఇవిగో పద్యాలు. 10.1-659-సీ. (కాళింది మడుగు వద్ద గోపికలు విలపించుట)  శ్రవణరంధ్రంబులు సఫలతఁ బొందంగ నెలమి భాషించు వా రెవ్వ రింకఁ?  గరచరణాదుల కలిమి ధన్యత నొంద నెగిరి పైఁ బ్రాఁకు వా రెవ్వ రింక?  నయనయుగ్మంబు లున్నతిఁ గృతార్థములుగా నవ్వులు చూపు వా రెవ్వ రింక?  జిహ్వలు గౌరవశ్రీఁ జేరఁ బాటల యెడఁ బలికించు వ...