Posts

Showing posts from May, 2019

Rukmini Kalyanam - Kuchipudi Ballet

Image
“ Chicago Thyagaraja Utsavam ” ( #CTU2019 ) is an organization that coordinates, annual 3-day long, Thyagaraja Aradhana during memorial day long weekend at HTGC temple auditorium .  May 25th 2019 was the first day of the aradhana. The end-of-the-day, highlight event was a 2 hour long Kuchipudi dance ballet, “Rukmini Kalyanam” by Dr. Kamala Reddy and her students from Pittsburgh. I have written earlier on the ghatta of Rukmini Kalyanam from Potana’s Bhagavatam. I was eager to see how it will be adapted and presented on stage. Ballet has been divided into 10 scenes with narration before each scene in English. Intro of Rukmini Intro of Krishna Swayamvara - Rukmini choosing Krishna Intro of Sisupala Lekha - Writing a letter to Krishna Krishna receiving the message Making of Bride and worried Rukmini Krishna taking Rukmini away Rukmi and Sisupala’s defeat Wedding celebrations in Dwaraka Scenes 1-5 were elaborate, each going for 10-15 minutes. Scenes 6-10 were around 5-10 minutes each. ...

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 7

ఈ భాగంలో రెండు పద్యాలకు బదులుగా మూడు పద్యాలు చూద్దాం. ముందు భాగాలతో పోల్చిస్తే భాష/శబ్దం సామీప్యం తక్కువ. అర్ధంసామీప్యం కూడా కొంచెమే. కానీ సందర్భ సామీప్యం, పరమార్ధ సామీప్యం ఉన్నాయని చెప్పుకోవాలి. అందుకే పోతన ఎన్నుకున్న రచనాశైలి, శిల్పం ఒక్కటే. మూడూ “తిట్టు” పద్యాలు. పైకి నిందా పద్యాలుగా ఉన్నా, తరచి చూస్తే అవి నిందాస్తుతి పద్యాలని తెలుస్తుంది. ముందుగా మూడు కథలు. మొదటి కథ. నాలుగవ స్కంధంలోని దక్షయజ్ఞం ఘట్టంలోనిది. శివుడు ఒక యజ్ఞానికి వెళ్లాడు. శివుని మామగారైన దక్షుడు, యజ్ఞవాటికకు రాగానే సభలోని వారందరూ నిల్చొన్నారు. బ్రహ్మ, శివుడు కూర్చొనే ఉన్నారు. ముఖ్య అతిథి అయిన బ్రహ్మకు నమస్కరించాడు. కూర్చొని ఉన్న శివుని వంక చూసి తనను అవమానించుట కొరకే నిలబడలేదని నానా మాటలు అన్నాడు. రెండవ కథ. దశమ స్కంధం పూర్వభాగం లోని రుక్మిణీ కల్యాణ ఘట్టంలోనిది. రుక్మిణి లేఖ మేరకు, కృష్ణుడు వెళ్లి ఆమెను తీసుకొని రధం మీద ద్వారకకు వెళ్లిపోతున్నాడు. రుక్మిణి పెద్ద అన్న అయిన రుక్మి వెంబడిచాడు. కృష్ణుని సమీపించి నానా మాటలు అన్నాడు. మూడవ కథ. దశమ స్కంధం ఉత్తరభాగం లోని శిశుపాలవధ ఘట్టంలోనిది. ధర్మరాజు రాజసూయం చేస్తున్నాడు. భీష్...

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 6

పోతన ద్వంద్వ శిల్పం వ్యాసక్రమంలో ఇది ఆరవది. ముందుగా పద్యాల సందర్భం. మొదటి పద్యం మొదటి స్కంధంలోనిది. పోతన భాగవతం, మహాభారతంలో యుద్ధసమాప్తం దగ్గర మొదలుపెడుతున్నాడు. ద్రౌపది ఉపపాండవులను కోల్పోయింది, కారకుడైన అశ్వత్థామను తరిమితరిమి పట్టుకొని విడిచిపెట్టేసారు, ధర్మరాజునకు పట్టాభిషేకమయింది. చాలా రోజుల తరువాత శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చాడు. భార్యలందరూ ఆతృతగా వేచి చూస్తున్నారు. అందరి దగ్గరికి మాయారూపం ధరించి ఒకేసారి వెళ్లాడు. ప్రతి భార్య, తన దగ్గరకే ముందు వచ్చాడని మురిసిపోతున్నారు. ఒక్కొకరిని ఒక్కో విధంగా పలుకరిస్తున్నాడు. ఆ పరామర్శ చేస్తున్నప్పటి పద్యం. రెండవ పద్యం దశమ స్కంధంలోని రుక్మిణీకల్యాణం ఘట్టంలోనిది. రుక్మిణికి ఇష్టంలేని పెళ్లి నిశ్చయం చేసారు. శ్రీకృష్ణుడిని వచ్చి పెళ్లిచేసుకోమని లేఖ వ్రాసింది. ముహూర్తం రెండురోజులలోకి వచ్చింది. ఇంకా శ్రీకృష్ణుడు రాలేదు. రుక్మిణికి దేని మీదా మనసు కుదరటంలేదు. దృష్టంతా శ్రీకృష్ణుని రాకమీదనే ఉంది. తన గురించి తాను అసలు పట్టించుకోవడం లేదు. ఆ ఎదురుచూపు పరిస్థితిని వర్ణిస్తున్న పద్యం. 1-269-సీ . (పరామర్శ)  తిలక మేటికి లేదు తిలకనీతిలకమ! ; పువ్వులు దు...

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 5

నాల్గవ భాగంలో వివరించిన, ఏడవ స్కంధంలోని ప్రహ్లాదచరితంలోని మరో ద్వంద్వం ఇప్పుడు చూద్దాం. మొదటి పద్యం. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు, ఘోర తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమౌతాడు. పంచభూతాలో (గాలి, నేల, అగ్ని, నీరు, ఆకాశం), దిక్కులలో, రాత్రి, పగలు, చీకటి, వెలుగు, జంతువులు (ఉభయచర, నేల, నీరు, పాము), దేవతలు, నరులు, సమస్త అస్త్ర శస్త్రాలు వగైరా ద్వారా మృత్యువులేని జీవనము కావాలి అని వరము పొందుతాడు. ఇక రెండవ పద్యం. హిరణ్యకశిపుని పుత్రుడు ప్రహ్లదుడు విష్ణుభక్తుడు. తండ్రి, కొడుకు యొక్క విష్ణుభక్తితో విసిగిపోయి, “ఎక్కడరా హరి?” అని అడుగుతాడు. విష్ణువు ఎక్కడ ఉన్నదీ తండ్రికి వివరిస్తాడు. పంచభూతాలలో, దిక్కులలో, పగలు, రాత్రులలో, సూర్యచంద్రులోలో,ఆత్మ, ఓంకారము, త్రిమూర్తులు, త్రిలింగవ్యక్తులు (ఆడ, మగ, నపుంసక) కలడు అని చెప్తాడు. ఇవీ పద్యాలు: 7-90-శా . గాలిం, గుంభిని, నగ్ని, నంబువుల, నాకాశస్థలిన్, దిక్కులన్, రేలన్, ఘస్రములం, దమఃప్రభల, భూరిగ్రాహ, రక్షో, మృగ వ్యా ళాదిత్య, నరాది జంతు కలహవ్యాప్తిన్, సమస్తాస్త్ర శ స్త్రాళిన్, మృత్యువు లేని జీవనము లోకాధీశ! యిప్పింపవే. 7-274-మ . "కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకా...

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 4

ఇంతకు ముందు భాగాలలో పోలిస్తే ఈ భాగంలో ద్వంద్వ పద్యాలు చాలా దగ్గరలో ఉంటాయి.  రెండింటికి మధ్యలో కేవలం 35పద్యాలు ఉన్నాయి. ఒకటే ఘట్టంలోనివి. ఏడవ స్కందంలోని ప్రహ్లాద చరితము ఘట్టములోనివి. ముందుగా క్లుప్తంగా సందర్భం. తెలిసిన కథే. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతని కొడుకు ప్రహ్లాదుడు. చదువుకోసం గురుకులానికి వెళ్లి తిరిగి వస్తాడు. మొదటి పద్యం, చదువుకోసం గురుకులానికి వెళ్లబోయే కొడుకునకు తండ్రి జాగ్రత్తలు చెప్పే సందర్భంలోనిది. “చదవనివాడు మూర్ఖుడు, చదివితే వివేకం, చతురత కలుగుతాయి. ఆచార్యులవద్ద చదువుకో” అంటాడు. ఇక రెండవ పద్యం - తిరిగి వచ్చిన ప్రహ్లాదుడు తాను ఏమి నేర్చుకున్నాడో చెప్పినది. “గురువులు ధర్మార్థ శాస్త్రాలు చుదువుకున్నాను. అసలు చదువులో మర్మములన్నీ తెలుసుకున్నాను” అంటాడు.  ఇవిగో పద్యాలు. 7-130-క.   చదువనివాఁ డజ్ఞుం డగు,  జదివిన సదసద్వివేక చతురత గలుగుం  జదువఁగ వలయును జనులకుఁ,  జదివించెద నార్యులొద్ధఁ జదువుము తండ్రీ! 7-166-క.   చదివించిరి నను గురువులు,  చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నేఁ  జదివినవి గలవు పెక్కులు,  చదువులలో మర్మ మెల్ల...