కుమారీ శతకం - పరిచయం
నిన్న అమ్మ ద్వారా తెలిసిన విషయం. 1960-1970ల కాలం వరకూ, "కుమారీ శతకం" అనే పద్యాలు ఆడవాళ్లకు నేర్పేవారట.
ఈ శతకంలో ఆడవాళ్లు, అత్తవారింట్లో అందునా ఉమ్మడి కుటుంబాలలో, మెసలుకునే పద్ధతి గురించిన పద్యాలు ఉన్నాయి. నలుగురు ఉన్న కుటుంబాలలో ఎలా సర్దుకు పోవాలో చెప్పే పద్యాలు ఇవి. కోపం చేయకు, బాధ పడకు, మనసులో పెట్టుకోకు, సర్దుకుపో, మాట విను - ఇలాంటి నీతులతో నడిచే పద్యాలు. కాలక్రమేణా ఉమ్మడి కుటుంబాలు లేకపోవడంతో, మారిన విలువలతో ఆ పద్యాలకూ కాలం చెల్లింది.
ఈ పద్యాలు వ్రాసినది పక్కి వేంకటనరసింహ కవి. క్రింది లింకులో లభిస్తున్న పుస్తకం 1932లో ముద్రించబడినది. మొదటి ముద్రణ 1869లో జరిగినదని వికీపీడియా ద్వారా తెలుస్తున్నది. అన్నీ కంద పద్యాలు.
ఇదిగో ఆ పద్యాలకు లింకు. https://archive.org/details/SaiRealAttitudeManagement-Telugu-Devotional-Spiritual-Free-eBooks-Satakalu/SH015-KumariShatakmu
మచ్చుకు కొన్ని పద్యాలు:
బాటిల్లు కాపురములో వాటమెఱిగి బాలతిరుగ వలయు కుమారీ - #2
గోరంత తప్పితిరుగకు మీఱకు మీయత్తపనుల మెలఁగు కుమారీ - #10
నీ తలిదండ్రులకు నపఖ్యాతులు రానీయగూడదమ్మ కుమారీ - #18
మొత్తినదనకే కీడగు చిత్తములో దీని చింతసేయు కుమారీ - #28
Comments
Post a Comment