Posts

Showing posts from July, 2021

అయోధ్యాకాండ: 1572-1598 - రాముడు భరతుడిని క్షేమమడుగుట - రంగనాథ రామాయణం

సందర్భము: తనను అయోధ్యకు తోడ్కొని పోదామని వచ్చిన భరతునితో శ్రీరాముని పరామర్శ. అయోధ్యాకాండ: 1572-1598 ధ ర ణిజకును సుమి త్రా   తనూజునకు -  భ ర త శత్రుఘ్నులు  ప్ర ణమిల్లి కొలువఁ  గు శ పీఠముల నిల్వఁ  గో రి రాఘవుఁడు -  ద శ రథు సేమంబు  త ల్లుల శుభము ప లు మాఱు నడుగుచు  భ రత! నీవేల -  యి ల యేల కింత ద  వ్వే గుదెంచితివి?  భూ త లాధీశు పం పు న రాజ వగుచు -  నీ తి తో, జేయుదే  నీ వు రాజ్యంబు? భావం: సీతకు, లక్ణ్మణునకు భరత శత్రఘ్నులు నమస్కరించిన పిదప, వారిని దర్భాసనాల మీద కూర్చుండమని కోరి, శ్రీరాముడు, వారిని దశరథుని క్షేమము, తల్లుల శుభము పలుమార్లు అడుగుచు, "భరతా! ఇలా ఎందుకు ఇంత దూరం వచ్చావు? దశరథుని ఆజ్ఞ మేరకు రాజుగా నీతితో రాజ్యము చేస్తున్నావా?" ద శ రథేశునకు స త్య ప్రకాశునకు -  వి శ ద పుణ్యునకుఁ గా విం తువే పూజ ? త ల్లు ల నెల్ల నా ద ర ముల్లసిల్ల -  ను ల్లం బు చల్లఁగా  నూ ఱడింపుదువె ? కో వి దు మత్కుల  గు రుఁ దపోనిష్ఠు -  నా   వ సిష్ఠు గరిష్ఠు  న ర్చించి నీవు  అ గ్ని హోత్రముల సం ధ్యా కాల నియతి -  ...

అయోధ్యాకాండ: 1516-1531 - చిత్రకూట పర్వతము వర్ణన - రంగనాథ రామాయణం

 సందర్భము: శ్రీరాముడు జానకితో చిత్రకూట పర్వతమును వర్ణన చేయుట అయోధ్యాకాండ: 1516-1531 " క నుఁ గొంటివే యిన్న గం బు బింబోష్ఠి -  క ను దమ్ముల కు విందు  గా వించె మనకు  ని న్న గ మహిమఁ దా నె న్నఁగ వశమె? -  ప న్న గ పతికైన  భా మాలలామ  భావం: సీతా! చూసావా ఈ పర్వతాన్ని. కళ్లకు ఎంత కమనీయగా విందు చేస్తున్నాయో. ఈ పర్వత మహిమను వర్ణించుట (అనేక నాల్కలు ఉన్న) ఆ ఆదిశేషునికైనా సాధ్యమేనా?  గు ఱు తైన సెలయేటి  ఘు మఘుమ ధ్వనులు -  ఉ ఱు ము లటంచుఁ బె ల్లు బ్బి నీకురులు  పు ర డింపఁ దనగొప్ప  పు రి విచ్చి నెమలి -  పొ రిఁ బొరి యాడెడుఁ  బూఁ బోణి చూడ భావం: సీతా! ఈ సెలయేటి నుండి వచ్చే అలల ధ్వనులు విని, ఉరుముల శబ్దమేమో అని, ఆ నెమళ్లు పురి విప్పి ఆడుతున్నాయి చూడు. కాం త రో! యీ చెంచు  కాం తల కంటె -  దం తి   కుంభంబులు  త మ చన్నుఁగవకు  నె న   వచ్చు టెట్లని  యి భకుంభ దళన -  మొ న రించి తన్మణు  లొ ప్పఁ దాల్చెదరు  భావం: సీతా! ఈ చెంచు యువతులు చూడు, ఏనుగుల కుంభములు తమ చన్నుల ధీటుగా ఉన్నాయని వాటిని భేదించి వాటిలోన...

అయోధ్యకాండ: 1499-1508 - భరతుడు తల్లులను పరిచయం చేయుట

 సందర్భము: భరతుడు, అడవులకి వెళ్లిన శ్రీరాముడిని వెతుక్కుంటూ, తల్లులతోనూ సపరివారంతోనూ బయలుదేరాడు. మార్గమధ్యంలో భరధ్వాజ ఋషి ఆశ్రమంలో ఆగాడు. భరతుడు, భరధ్వాజ ఋషికి తన ముగ్గురు తల్లులనూ పరిచయం చేస్తున్నాడు. అయోధ్యకాండ: 1499-1508 "ధీ రా త్మ నృపుపెద్ద  దే వులై యెల్ల -  వా రి లో వాసియు  వ న్నెయుఁ గాంచి  క డు పు చల్లఁగ రాముఁ  గాం చియు వగల -  ను డు కుచున్నది తద్వి యో గాగ్నిశిఖలఁ  బ రి చిత జన్మ సా ఫ ల్య కౌసల్య -  ప రి కింపు మిది ముని ప తి సార్వభౌమ  కౌ స ల్య సతి వామ  క ర మంటఁ బట్టి -  కై సేఁ త లుడిపోయి  గ త పుష్పకర్ణి  కా ర  శాఖయుఁ బోలి  కై వ్రాలి యున్న -  యీ రా మ శ్రీరాము  నె డఁబాయ లేని  యా ల క్ష్మణునిఁ గన్న య ట్టి పుణ్యాత్ము -  రా లు   సుమిత్ర ప రా కు! మునీంద్ర!  యే   త ల్లికై కాన కే గె మాయన్న? -  యే త ల్లి కతము న  నీ ల్గె మాతండ్రి ? యే త ల్లి కోర్కి న న్నిం తకుఁ దెచ్చె? -  నీ త ల్లి మాతల్లి  హి త పుణ్యపాక  కై కఁ   గన్గొను" మంచు  గ ద్గద కంఠుఁ -...