భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 12
చిన్న ఉపోద్ఘాతం. 1997/98 నాటి విషయం. పైచదువులకోసం భారతదేశం నుండి వచ్చిన క్రొత్తలు. ఒక స్నేహితుడు “Thesis defense” చేస్తున్నాడని, తోటివారమంతా వెళ్లాం. అతను మొదలు పెట్టిన రెండో నిమిషంలో ఒక ప్రొఫెసరు ఆపి, “What is your Thesis?” అని అడిగారు. తను థీసిస్ యొక్క శీర్షిక (Title) చెప్పాడు. అప్పుడు ఆ ప్రొఫెసరు, “That is title. I want to know what your Thesis is.” అన్నారు. తనతో పాటు, మేమందరం కూడా బిక్కముఖం వేశాం. అప్పుడు ఆయనే వివరించారు. Thesis అంటే ప్రతిపాదన. నువ్వేమి ప్రతిపాదిస్తున్నావు. దానిని రెండుముక్కలలో ముందు చెప్పు తరువాతదంతా దాని గురించిన వివరణ, సమర్ధన (defense). వ్రాసినప్పుడు కూడా చెప్పాలనుకున్న విషయాన్ని సంక్షిప్తంగా (abstract) చెబుతాము కదా. ఎందుకో ఆయన చెప్పినది నా మనసులో ఉండిపోయింది. భాగవతం కూడా ఆ దృష్టితో చూస్తే, పోతన తన మొదటి పద్యం ఒక ప్రతిపాదనా పద్యంలాగా కనబడుతుంది. అయితే దేని గురించి ప్రతిపాదన చేస్తున్నారు? భగవంతుని తత్వం గురించి ప్రతిపాదన. ఇదిగో భాగవతంలోని మొట్టమొదటి పద్యం. లంకె మీద నొక్కితే లోతైన వివరణ ఉన్నది. 1-1-శా. (ప్రతిపాదనా పద్యం) శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ ల...