Posts

Showing posts from May, 2020

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 11

ఈ భాగంలో రెండు తడబాటు / సందిగ్ధం పద్యాలు చూద్దాం. ఒక్కొక్క సారి మనకు గొంతు నుంచి మాటపెగలదు. అడుగు ముందుకు పడదు. ఏం చేయాలో తోచదు. ఏదో మాట్లాడదామనుకుంటాం. కానీ చేయలేము. ఇటువంటి పరిస్థితే లక్ష్మీదేవికి రెండు సందర్భాలలో కలిగింది. రెండు సందర్భాలలోనూ ఒకే రకమైన పద్యం వచ్చింది. ముందుగా కథ. మొదటిది. సప్తమ స్కంధం. ప్రహ్లాదచరితం ఘట్టం లోనిది. నరసింహావతారం ఆవిర్భవించింది. హిరణ్యకశిపుని సంహారం జరిగింది. ఆ భయంకర విరాట స్వరూపాన్ని ఉపశమింపచేయాలని దేవతలు అందరూ ప్రస్తుతించారు. కానీ ఆ ఉగ్రరూపం అలాగే ఉన్నది, చల్లబడలేదు. లక్ష్మీదేవిని ప్రయత్నించమని అడిగారు. ఆమె ఎప్పుడూ విష్ణువును అలా చూసి ఎరుగదు. మాట పెగలటం లేదు. అలా నిలబడిపోయింది. రెండవది. ఎనిమిదవ స్కంధం. గజేంద్రమోక్షం ఘట్టంలోనిది. గజేంద్రుని మొర విని, విష్ణువు హుటాహూటిన బయలుదేరాడు. చేతిలో లక్ష్మీదేవి చీర కొంగు కూడా వదలలేదు. ఆమె వెనుకనే వస్తోంది. ఇంత హడావిడిగా వెడలిపోతున్న మగడిని, ఏమి అడగాలా అని తడబడుతోంది. 7-343-క .  పలికెద నని గమకముఁ గొను;  బలికినఁ గడు నలుగు విభుఁడు ప్రతివచనములం  బలుకఁ డని నిలుచు; శశిముఖి  బలువిడి హృదయమునఁ జనవు భయమును...

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 10

ఈ భాగంలోని ద్వంద్వ శిల్పానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఒక పద్యంలోని భావాన్ని తీసుకొని మరొక పద్యంలో దానిని సగమే వాడుకొని మిగతా సగాన్ని వైరుధ్యంతో (contrast) నింపబడినది. ముందుగా కథా భాగం. మొదటిది. రుక్మిణీ కల్యాణ ఘట్టం. పదవ స్కంధం పూర్వభాగంలోని చరమఘట్టం. రుక్మిణి చిన్నపిల్లగా ఉన్నది. ఆటపాటలతో పెరుగుతోంది. బాలావస్థ. వాత్సల్యపూరిత పద్యం. శాంత,కరుణరస ప్రధానం. రెండవది. నరకాసుర వధ ఘట్టం. పదవ స్కంధం ఉత్తర భాగంలోని ఘట్టం. శ్రీకృష్ణ సమేత సత్యభామ నరకాసురినితో పోరుకు సిద్ధమైనది. ఆశ్చర్యం కలిగిస్తోంది. వీరరస ప్రధానం. ఇవిగో పద్యాలు. పూర్తి అర్థం కోసం ఆయా లంకెలు నొక్కండి. 10.1-1690-సీ.  పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు; నబలలతోడ వియ్యంబు లందు;  గుజ్జెనఁ గూళులు గొమరొప్ప వండించి; చెలులకుఁ బెట్టించుఁ జెలువు మెఱసి;  రమణీయ మందిరారామ దేశంబులఁ; బువ్వుఁ దీగెలకును బ్రోది చేయు;  సదమల మణిమయ సౌధభాగంబుల; లీలతో భర్మడోలికల నూఁగు; బాలికలతోడఁ జెలరేగి బంతు లాడు; శారికా కీర పంక్తికిఁ జదువు సెప్పు;  బర్హి సంఘములకు మురిపములు గఱపు; మదమరాళంబులకుఁ జూపు మందగతులు. 10.2-180-సీ .  బొమ్మ పెండిండ్లకుఁ బో...