భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 11
ఈ భాగంలో రెండు తడబాటు / సందిగ్ధం పద్యాలు చూద్దాం. ఒక్కొక్క సారి మనకు గొంతు నుంచి మాటపెగలదు. అడుగు ముందుకు పడదు. ఏం చేయాలో తోచదు. ఏదో మాట్లాడదామనుకుంటాం. కానీ చేయలేము. ఇటువంటి పరిస్థితే లక్ష్మీదేవికి రెండు సందర్భాలలో కలిగింది. రెండు సందర్భాలలోనూ ఒకే రకమైన పద్యం వచ్చింది. ముందుగా కథ.
మొదటిది. సప్తమ స్కంధం. ప్రహ్లాదచరితం ఘట్టం లోనిది. నరసింహావతారం ఆవిర్భవించింది. హిరణ్యకశిపుని సంహారం జరిగింది. ఆ భయంకర విరాట స్వరూపాన్ని ఉపశమింపచేయాలని దేవతలు అందరూ ప్రస్తుతించారు. కానీ ఆ ఉగ్రరూపం అలాగే ఉన్నది, చల్లబడలేదు. లక్ష్మీదేవిని ప్రయత్నించమని అడిగారు. ఆమె ఎప్పుడూ విష్ణువును అలా చూసి ఎరుగదు. మాట పెగలటం లేదు. అలా నిలబడిపోయింది.
రెండవది. ఎనిమిదవ స్కంధం. గజేంద్రమోక్షం ఘట్టంలోనిది. గజేంద్రుని మొర విని, విష్ణువు హుటాహూటిన బయలుదేరాడు. చేతిలో లక్ష్మీదేవి చీర కొంగు కూడా వదలలేదు. ఆమె వెనుకనే వస్తోంది. ఇంత హడావిడిగా వెడలిపోతున్న మగడిని, ఏమి అడగాలా అని తడబడుతోంది.
ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండూ కంద పద్యాలు. అందునా సర్వలఘు కందాలు. తడబాటు పడుతున్న లక్ష్మీదేవి పరిస్థితిని వర్ణిస్తున్న పద్యాలు. ఒకటి “పలికెదనని” అంటూ మొదలైతే, రెండవది “అడిగెదనని” అంటూ మొదలు. రెండింటిలోనూ “బదులివ్వడు” అనే అర్ధం ఇచ్చే, “ప్రతి వచనములం పలుకడని”, “మగుడ నుడుగడని” ఉన్నాయి.
ఇక్కడే పోతన సమయస్ఫూర్తి, చమత్కారం, శబ్దచాతుర్యం, చిత్రణ తెలుస్తాయి. నరసింహావతార ఘట్టంలో లక్ష్మీదేవి విష్ణువుకు ఎదురుగా నిలబడి చూస్తూ ఉన్నది. ప్రచండమైన వెలుగుతో ఉన్న ఉగ్ర నారసింహునికి ఎదురుగా “శశిముఖి” (చంద్రుని వంటి ముఖము, చల్లని తల్లి), “భయమున” ఉన్నది. ముఖానికి ప్రాధాన్యత. గజేంద్రమోక్షంలో ఆయన వెనుక నడుస్తూ ఉన్నది. నడకకు ప్రాధాన్యత. ఇక్కడ నడుస్తూన్నది కావటం చేత, “అడుగు” (కాలు/పాదము, మాటలాడు/ప్రశ్నించు) అనే రెండు అర్థాలున్న శబ్దాన్ని ఎంచుకుని రెండు అర్థాలనూ వాడుకున్నారు. ఆయన వెనుక నడుస్తున్నది కనుకనే ఈవిడ వెనకనున్న “సిడిముడి” తడబడుతోంది.

పలికెద నని గమకముఁ గొను;
బలికినఁ గడు నలుగు విభుఁడు ప్రతివచనములం
బలుకఁ డని నిలుచు; శశిముఖి
బలువిడి హృదయమునఁ జనవు భయమును గదురన్
అడిగెద నని కడువడిఁ జను;
నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్;
వెడవెడ సిడిముడి తడఁబడ
నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్.
ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండూ కంద పద్యాలు. అందునా సర్వలఘు కందాలు. తడబాటు పడుతున్న లక్ష్మీదేవి పరిస్థితిని వర్ణిస్తున్న పద్యాలు. ఒకటి “పలికెదనని” అంటూ మొదలైతే, రెండవది “అడిగెదనని” అంటూ మొదలు. రెండింటిలోనూ “బదులివ్వడు” అనే అర్ధం ఇచ్చే, “ప్రతి వచనములం పలుకడని”, “మగుడ నుడుగడని” ఉన్నాయి.
ఇక్కడే పోతన సమయస్ఫూర్తి, చమత్కారం, శబ్దచాతుర్యం, చిత్రణ తెలుస్తాయి. నరసింహావతార ఘట్టంలో లక్ష్మీదేవి విష్ణువుకు ఎదురుగా నిలబడి చూస్తూ ఉన్నది. ప్రచండమైన వెలుగుతో ఉన్న ఉగ్ర నారసింహునికి ఎదురుగా “శశిముఖి” (చంద్రుని వంటి ముఖము, చల్లని తల్లి), “భయమున” ఉన్నది. ముఖానికి ప్రాధాన్యత. గజేంద్రమోక్షంలో ఆయన వెనుక నడుస్తూ ఉన్నది. నడకకు ప్రాధాన్యత. ఇక్కడ నడుస్తూన్నది కావటం చేత, “అడుగు” (కాలు/పాదము, మాటలాడు/ప్రశ్నించు) అనే రెండు అర్థాలున్న శబ్దాన్ని ఎంచుకుని రెండు అర్థాలనూ వాడుకున్నారు. ఆయన వెనుక నడుస్తున్నది కనుకనే ఈవిడ వెనకనున్న “సిడిముడి” తడబడుతోంది.
Comments
Post a Comment