Posts

Showing posts from April, 2020

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 9

ఈ భాగంలోని ద్వంద్వ శిల్పం కోసం, వేరువేరు చోట్ల చూడవలసిన అవసరం లేదు. ఒక వరుసలో ఉంటాయి. జంట ద్వంద్వాలు. సందర్భం అలాంటిది. ఏడవ స్కందంలోని ప్రహ్లాదచరితంలోనిది. హిరణ్యకశిపుడు, తన కొడుకు యొక్క విష్ణుభక్తితో విసిగిపోయాడు. నానా హింసలూ పెట్టించాడు. ప్రహ్లాదుడు అన్నింటినీ నవ్వుతూ భరించాడు. ఎటువంటి మార్పూలేదు. పైపెచ్చు తోటి రాక్షస బాలకులకు కూడా విష్ణుభక్తి బోధించసాగాడు. పరిస్థితి విషమించిపోయిందని, కొడుకు చేయిదాటి పోతున్నాడని హిరణ్యకశిపుడు రంగంలోనికి దిగాడు. వినయంతో మాటకుమాట జవాబు చెబుతున్నాడు ప్రహ్లాదుడు. ఇవిగో వరుస పద్యాలు. 7-261-క. దిక్కులు గెలిచితి నన్నియు దిక్కెవ్వఁడు? రోరి! నీకు దేవేంద్రాదుల్ దిక్కుల రాజులు వేఱొక దిక్కెఱుఁగక కొలుతు రితఁడె దిక్కని నన్నున్." 7-262-క . బలవంతుఁ డ నే జగముల బలములతోఁ జనక వీరభావమున మహా బలుల జయించితి నెవ్వని బలమున నాడెదవు నాకుఁ బ్రతివీరుఁడ వై." 7-263-వ . అనినఁ దండ్రికి మెల్లన వినయంబునఁ గొడు కిట్లనియె. 7-264-క. "బలయుతులకు దుర్బలులకు బల మెవ్వఁడు? నీకు నాకు బ్రహ్మాదులకున్ బల మెవ్వఁడు ప్రాణులకును బల మెవ్వం డట్టి విభుఁడు బల మసురేంద్రా! 7-265-క. దిక్కులు...

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 8

ఈ భాగంలో రెండు బ్రతిమాలే పద్యాలు చూద్దాం. ముందుగా కథా సన్నివేశాలు. మొదటిది, సప్తమ స్కందం, ప్రహ్లాదచరితం ఘట్టంలోనిది. హిరణ్యకశిపుడు కొడుకుకు, రాచరిక విద్యలను నేర్పమని గురువులకి అప్పగించాడు. ప్రహ్లాదుడు ఇంటికి వచ్చి విష్ణువు గురించి చెప్పనారంభించాడు. హిరణ్యకశిపుడు ఆ మాటలకు కోపించాడు. గురువులు క్షమాపణలు చెప్పి, ప్రహ్లాదుడిని మళ్లీ తీసుకుని వెళ్లి, ధర్మార్ధకామ (త్రివర్గ) శాస్త్రాలలో శిక్షణ ఇచ్చి పట్టుకొచ్చారు. తండ్రి ముందు ఏమి మాట్లాడి తమ కొంప ముంచుతాడో అని భయపడుతున్నారు. ప్రహ్లాదుడిని విష్ణువు (మోక్షం) మాట ఎత్తవద్దని బ్రతిమాలుతున్నారు. రెండవది దశమస్కందం పూర్వభాగంలోనిది. కంసుడు ఆకాశవాణి మాటలు విని రథాన్ని ఆపాడు. తోడబుట్టిన చెల్లెలని కూడా ఆలోచించకుండా దేవకి మీదకు కత్తిని దూసాడు. వసుదేవుడు కంసుని బ్రతిమాలుతున్నాడు. ఇవిగో ఆ పద్యాలు.  7-158-ఉ.   "త్రిప్పకు మన్న మా మతము, దీర్ఘములైన త్రివర్గపాఠముల్ దప్పకు మన్న, నేఁడు మన దైత్యవరేణ్యుని మ్రోల నేము మున్ చెప్పినరీతి గాని మఱి చెప్పకు మన్న విరోధిశాస్త్రముల్, విప్పకుమన్న దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థ జాలముల్." 10.1-26-ఉ. "అన్నవు నీవు చె...