కనకన రుచిరా - త్యాగయ్య కృతి
కనకన రుచిరా కనకవసన! నిన్ను ॥కనకన॥ అర్థం: నిన్ను మరలమరలా చూడాలని (కన-కన) కోరికగా (రుచి) ఉన్నది! ఓ లక్ష్మీనివాసా! దినదినమును మనసున చనువున నిన్ను ॥కనకన॥ అర్థం: ప్రతిదినమూ మనసులో ఇష్టంతో నిన్ను ...(మరల మరల చూడాలని కోరికగా ఉన్నది) పాలుగారు మోమున శ్రీ యపార మహిమ దనరు నిన్ను ॥కనకన॥ అర్థం: పాలుకారుతున్న ముద్దులొలుకు ముఖాన్ని కలగిన నిన్ను... (మరల మరల చూడాలని కోరికగా ఉన్నది) కలకలమను ముఖకళగలిగిన సీత కులుకుచు నోరకన్నులను జూచె నిన్ను ॥కనకన॥ అర్థం: అందగాడివైన నిన్ను, జానకి తన ఓర చూపులతో చూచిన నిన్ను ... (మరల మరల చూడాలని కోరికగా ఉన్నది) బాలార్కాభ! సుచేల! మణిమయ మాలాలంకృత కంధర! సరసిజాక్ష! వర కపోల సురుచిర కిరీటధర! సతతంబు మనసారగ ॥కనకన॥ అర్థం: ఉదయిస్తున్న సూర్యుడి తేజుడవైన నిన్ను, మంచి వస్త్రాలను ధరించే నిన్ను, మణిమయమైన మాలలతో అలంకరించిన నిన్ను, పద్మాలవంటి కన్నులు కలిగిన నిన్ను, చక్కటి చెక్కిళ్లు కలగిన నిన్ను, అందమైన కిరీటము ధరించిన నిన్ను, ఎల్లప్పుడూ మనసు నిండునట్లుగా ... (మరల మరల చూడాలని కోరికగా ఉన్నది) సాపత్నీ మాతయౌ సురుచి వే కర్ణశూలమైన మాట వీనుల చురుక్కున తాళక శ్రీహరిని ధ్...