ఊర్వశి గ్లౌభా - మహర్షి సినిమా - సంస్కృతంలో పాట
మహర్షి (1987) సినిమాలో సంస్కృత భాషలో వ్రాసిన " ఊర్వశీ గ్లౌభా " పాట. రచయిత - జొన్నవిత్తుల సంగీతం - ఇళయరాజా గాయకుడు - బాలసుబ్రహ్మణ్యం దర్శకుడు - వంశీ -- ఊర్వశి గ్లౌభా ప్రేయసి హ్రీం మా (2) గ్లౌ = చందమామ; భా = వెలుగు; హ్రీం = సిగ్గు; మా = మాను, వద్దు అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వంయేవ రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వంయేవ (2) అస్మత్ = నా ; విద్వత్ = విద్య ; విద్యుత్ = మెరుపు ; దీపిక = వెలుగు; త్వం = నీవు ; ఏవ = మాత్రమే; రసవత్ = రసవంతమైన; విలసత్ = విలాసవంతమైన, మెరిసే; విభవత్ = ఉన్నటువంటి; గీతిక = పాట; త్వం = నీవు ; ఏవ = మాత్రమే; లసత్ చమత్కృతి నటత్ ప్రతిద్యుతి ఘనత్ హరిత్మణి త్వంయేవ శుంబత్ ప్రమోద ఝుంబత్ ప్రవాహ ధవళ గగనధుని త్వంయేవ లసత్ = ప్రకాశవంతమైన; చమత్కృతి = ఆశ్చర్యకరమైన ; నటత్ = ఆడుతున్న; ప్రతిద్యుతి = ప్రతిబింబిస్తున్న; ఘనత్ = గొప్పదైన; హరిత్మణి = పచ్చని మణి; శుంబత్ = అందమైన ; ప్రమోద = ఆనందమైన ; ఝుంబత్ = ఝంకార; ప్రవాహ = ప్రవాహం; ధవళ = స్వచ్ఛమైన; గగన ధుని = ఆకాశవాణి; భజే భజే భజరే భజే భజే - భజే భజే భజరే భజే భజే భజరే భజించరే - జపరే జపించరే (2) ...