Posts

Showing posts from September, 2023

పోతన భాగవతంలో భారత వర్షం

పోతన ( 1450 - 1510) వ్రాసిన ఆంధ్రమహాభాగవతంలో భారతవర్షం యొక్క భౌగోళిక వివరాలు తెలియజేసాడు. పంచమ స్కంధంలోని ఉత్తరభాగంలో ఈ వివరాలు ఉన్నవి. మలయపర్వతము వంటి రకరాకాల పర్వతాలు, చంద్రవటి వంటి నదులు (తూర్పునకు ప్రవహించేవి, నర్మద వంటి నదాలు (పశ్చిమాని ప్రవహించేవి), వీటిలో పుట్టిపెరిగిన మనుషులు ఉత్తమగతులు చెందుతారు (5.2-55) ".....మలయపర్వతంబును..<<>>..రామగిరియును నాదిగాఁ గల పుణ్య పర్వతంబు లనేకంబులు గలవా పర్వతపుత్రిక లైన చంద్రవటయు, దామ్రపర్ణియు,.. <<>> ..విశ్వయు నను నీ మహానదులును,నర్మద,.. <<>> ..యను నదంబులును నైన మహా ప్రవాహంబు లీ భారతవర్షంబునఁ గల; వందు సుస్నాతులైన మానవులు ముక్తిం జెందుదురు;మఱియు నీ భారత వర్షంబున జన్మించిన పురుషులు శుక్ల లోహిత కృష్ణవర్ణ రూపంబు లగు త్రివిధ కర్మంబులంజేసి క్రమంబుగ దేవ మనుష్య నరక గతులను త్రివిధ గతులం బొందుదురు; వినుము; రాగద్వేషాది శూన్యుండు, నవాఙ్మానసగోచరుండు, ననాధారుండు నగు శ్రీవాసుదేవమూర్తి యందుఁ జిత్తంబు నిలిపి భక్తియోగంబున నారాధించెడు మహాత్ముల విద్యాగ్రంథి దహనంబు గావించుట జేసి పరమ భాగవతోత్తములు పొందెడు నుత్తమగతిం జెందుదురు; క...