Posts

Showing posts from August, 2023

ఎక్కడదీ పద్యం - జయ జయ దానవదారణకారణ?

ఆదిత్య 369 సినిమాలోని ఒక ఘట్టం. శ్రీకృష్ణదేవరాయలు పాత్ర కార్తీక పౌర్ణమి నాడు విష్ణుమూర్తి విగ్రహానికి పూజ చేస్తూ జయజయ అంటూ పద్యం గానం చేస్తుంది. ఈ పద్యం,  చారిత్రక రాయలు వ్రాసిన "ఆముక్తమాల్యద"  కావ్యంలోనిది.  క్లుప్తంగా కథ. విలుబుత్తూరు అనే ఊరిలో విష్ణుచిత్తుడు అనే గొప్ప విష్ణుభక్తుడు ఉన్నాడు. నిత్యమూ విష్ణుభక్తి పరాయణుడై ఉండేవాడు. అతడు  ఒకానొక నాడు శ్రీమహావిష్ణువును స్తుతించే సందర్భంలోనిది ఈ పద్యం.  చతుర్థాశ్వాసంలోనిది పద్యం. పూర్తి పద్యం, ఆముక్తమాల్యద - కవిరాజ విరాజితము - 4-16 జ య   జయ దానవ దా రణకారణ  శా జ్గ్రరధాంగగ దా సిధరా జ య   జయ చంద్రది నేం ద్రశతాయుత  సాం ద్రశరీరమ హా ప్రసరా జ య   జయ తామర సో దర సోదర  చా రుపదోజ్ఘిత గాం గఝరా జ య   జయ కేశవ  కే శినిషూదన  శౌ రి శరజ్జల జా క్ష హరీ పద్యం  టీకా, తాత్పర్యము  - వేదము వేంకటరాయశాస్త్రి పుస్తకం నుండి. సినిమాలోని ఘట్టము  ఇక్కడ  -- ఇదే పద్యం కాస్త మార్పుతో పెద్దన వ్రాసిన స్వారోచిషమనుసంభవం (మనుచరిత్ర) అనే కావ్యం లో ఉన్నది.  జ య   జయ దానవ దా రణకారణ...