చ. బలయుతుడైన వేళ

 

ఉ. బలయుతుడైన వేళ

బలయుతుఁ డైన వేళ నిజ బంధుఁడు తోడ్పడుఁ గాని యాతఁడే
బలము తొలంగెనేని తన పాలిటి శత్రు; వదెట్లు పూర్ణుఁడై
జ్వలనుఁడు కానఁ గాల్చు తఱి సఖ్యముఁ జూపును వాయుదేవుఁడా
బలియుఁడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా!

1.     బలయుతుఁ డైన వేళ 

2.     నిజ బంధుఁడు తోడ్పడుఁ గాని 

3.     యాతఁడే

4.     బలము తొలంగెనేని 

5.     తన పాలిటి శత్రువు 

6.     అదెట్లు 

7.     పూర్ణుఁడై జ్వలనుఁడు 

8.     కానఁ గాల్చు తఱి 

9.     సఖ్యముఁ జూపును 

10.  వాయుదేవుఁడా

11.   బలియుఁడు 

12.   సూక్ష్మదీపమగు పట్టునన్  

13.   ఆర్పదె గాలి 

14.  భాస్కరా!

అర్ధాలు:

బలయుతుఁ డైన వేళ = బలవంతునిగా ఉన్న సమయములో ; నిజ బంధుఁడు = తన స్వంత బంధువు;

తోడ్పడుఁ గాని = సహాయం చేస్తుడు; యాతఁడే = అతనే; బలము తొలంగెనేని = బలము పోయినపుడు;

తన పాలిటి శత్రువు = తనకు శత్రువుగా మారతాడు; అదెట్లు = అదెలాగంటే; పూర్ణుఁడై జ్వలనుఁడు =అగ్ని; కానన్ = అడవిని; కాల్చు తఱి = కాల్చునప్పుడు; సఖ్యముఁ జూపును = స్నేహంగా ఉంటాడు;

వాయుదేవుఁడా = గాలి; బలియుఁడు = ఆ బలమైన అగ్ని; సూక్ష్మదీపమగు = చిన్న దీపంగా;  పట్టునన్  =ఉన్నప్పుడు; ఆర్పదె గాలి = ఆ గాలి ఆర్పేస్తుంది కదా!;

భావం: ఈ పద్యం భాస్కర శతకం లోనిది.

ఓ భాస్కరా! మనం బలంగా ఉన్నప్పుడే బంధువులు సహాయం చేస్తారు. ఆ బలం లేని నాడు బంధువులే శత్రువులుగా మారతారు. ఉదాహరణకు బలమైన దావాగ్నికి గాలి సహాయం చేస్తుంది కానీ, చిన్న దీపంగా ఉన్న అగ్నిని గాలి ఆర్పేసుంది కదా!

Comments