సీ. లోకాల చీకట్లు - 100 పద్యాలు

 

సీ. లోకాల చీకట్లు పోకార్ప

లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక
గతిపై బడవచ్చు లరాశి కెరటాలు మామూలు మేరకు డవలేక
ని మాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె డియారముల కీలు దపలేక
అందాలు చింద నీలాకాశ వేదిపై చుక్కల మ్రుగ్గులు చెక్కలేక

ఎంత శ్రమ నొందుచుంటివో యేమొ స్వామి!  అడుగిడితి వెట్లొ నేడు మా గడపలోన; 
గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు అందుకోవయ్య హృదయ పుష్పాంజలులను

1.      లోకాల చీకట్లు పోకార్ప 

2.      రవిచంద్ర  దీపాలు గగనాన త్రిప్పలేక

3.      జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు 

4.     మామూలు మేరకు మడవలేక 

5.     పని మాలి ప్రతిరోజు 

6.     ప్రాణికోటుల గుండె గడియారముల కీలు కదపలేక

7.      అందాలు చింద నీలాకాశ వేదిపై 

8.     చుక్కల మ్రుగ్గులు చెక్కలేక

9.     ఎంత శ్రమ నొందుచుంటివో యేమొ స్వామి! 

10.   అడుగిడితి వెట్లొ నేడు మా గడపలోన;

11.    గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు 

12.   అందుకోవయ్య హృదయ పుష్పాంజలులను

అర్ధాలు:
పోకార్ప 
పోగొట్టురవిచంద్ర సూర్యుడు, చంద్రుడుగగనాన ఆకాశానజలరాశి సముద్రముకెరటాలు అలలు; పనిమాలి అదే పనిగాకీలు సీలవేదిపై వేదికపైచెక్కలేక తయారు చేయలేకకుదిలించి =బాగా కదిపి ; కుప్పవోతు = కుప్పగా పోసెదను; పుష్పాంజలులు పుష్ప అంజలి పూవలతో నమస్కారము;

భావం:
భగవంతుడా! లోకాలలోని చీకటులను పోగొట్టటానికి సూర్యుడిని, చంద్రుడిని ఆకాశంలో త్రిప్పుతున్నావు. భూమి మీదకు మరల మరల వచ్చి పడే సముద్రపు అలలను వెనక్కు పంపుతున్నావు. అదే పనిగా సకల ప్రాణుల గుండెలనే గడియారాలను సరిచేస్తున్నావు. రాత్రిపూట ఆకాశంలో అందమైన చుక్కల ముగ్గులు తయారు చేస్తున్నావు. 


ఎంత అలసి పోయావో కదా! ఎలాగో నా ఇంటి వచ్చినావు. నా గుండెను కదిలించి నీ ముందు కుప్పగా పోస్తాను. నా హృదయమునే నీకు సమర్పిస్తాను. 

Comments