సీ. సగరమాంధాతాది - 100 పద్యాలు
సీ. సగర మాంధాతాది | |
సగర మాంధాతాది షట్చక్రవర్తుల యంకసీమల నిల్చినట్టి సాధ్వి సింధు గంగానదీ జలక్షీరమెపుడు గురిసి బిడ్డల బోషించుకొనుచునున్న | |
1. సగర మాంధాతాది 2. షట్చక్రవర్తుల 3. యంకసీమల నిల్చినట్టి సాధ్వి 4. కమలనాభుని 5. వేణుగానసుధాంబుధి 6. మునిగి తేలిన పరిపూతదేహ 7. కాళిదాసాది 8. సత్కవి కుమారుల గాంచి 9. కీర్తి గాంచిన పెద్ద 10. గేస్తురాలు | 11. బుద్ధాది 12. మునిజనంబుల తపంబున 13. మోద బాష్పముల్ విడిచిన 14. భక్తురాలు 15. సింధు గంగానదీ 16. జల క్షీరమెపుడు గురిసి 17. బిడ్డల బోషించుకొనుచునున్న 18. పచ్చి బాలెంతరాలు 19. మా భరతమాత 20. మాతలకు మాత సకల సంపత్సమేత |
అర్ధాలు: షట్చక్రవర్తులు = ఆరుగురు చక్రవర్తులు; అంక సీమల = ఒడిలో; గేస్తురాలు = గృహిణి; మోద = ఆనంద; జల క్షీరము = నీరు అనే పాలు; బాలెంతరాలు = క్రొత తల్లి; సంపత్సమేత = సంపత్ సమేత = సంపదలు కూడినది ; | |
భావం: గుఱ్ఱం జాషువా వ్రాసిన ఈ పద్యం భరతమాతను వర్ణిస్తున్నది.
సగరుడు, మాంథాత వంటి గొప్ప చక్రవర్తుల ఒడిలో పెరిగిన సాధ్వి, శ్రీకృష్ణుని వేణుగానము అనే అమృతములో ఓలలాడిన పవిత్రమైన శరీరము కలది, కాళిదాసు వంటి గొప్ప కవులను కన్న గృహిణి, బుద్ధుడు వంటి మునుల తపస్సు వలన ఆనందభాష్పములు విడిచిన భక్తురాలు, సింధు, గంగా నది జలాలతో తన పిల్లలను పోషించుకుంటున్న భరతమాత, అమ్మలను కన్న అమ్మ. సకల సంపదలకునెలవు. |
Comments
Post a Comment