శా. నిన్నున్నమ్మిన రీతి - 100 పద్యాలు

 

శా. నిన్నున్నమ్మిన రీతి

నిన్నున్నమ్మిన రీతి నమ్మనొరులన్, నీకన్న నాకెన్నలే
న్నల్దమ్ములు తల్లిదండ్రులు గురుండాపత్సహాయుండు నా
న్నా! యెన్నడు నన్ను సంస్కృతి విషాదాంభోధి దాఁటించి య
చ్ఛిన్నానంద సుఖాబ్ధిఁ దేల్చెదొ కదే శ్రీకాళహస్తీశ్వరా!

1.      నిన్నున్నమ్మిన రీతి 

2.     నమ్మనొరులన్, 

3.     నీకన్న నాకెన్నలేరు

4.     అన్నల్దమ్ములు తల్లిదండ్రులు 

5.     గురుండాపత్సహాయుండు 

6.     నాయన్నా! 

7.      యెన్నడు నన్ను 

8.     సంస్కృతి విషాదాంభోధి 

9.     దాఁటించి 

10.   అచ్ఛిన్నానంద సుఖాబ్ధిఁ 

11.  దేల్చెదొ కదే 

12.   శ్రీకాళహస్తీశ్వరా!

అర్థం:

నిన్నున్నమ్మిన రీతి నిన్ని నమ్మిన విధముగానమ్మనొరులన్ = నమ్మను ఒరులను ఇతరులను నమ్మనునీకన్న = నిన్ము మించిననాకెన్నలేరు = నాకు ఎన్నలేరు నాకు ఎక్కువ అయిన వారు లేరు;

అన్నల్దమ్ములు = తోబుట్టువులుతల్లిదండ్రులు = అమ్మానాన్నలుగురుండు = దిశా నిర్దేశం చేసే గురువు;

ఆపత్సహాయుండు = ఆపదలో సహాయం చేసేవాడునాయన్నా!  = ఓ శివా!యెన్నడు = ఏ నాడు;

సంస్కృతి విషాదాంభోధి = ప్రపంచమనే శోక సముద్రముదాఁటించి = దాటించిఅచ్ఛిన్నానంద సుఖాబ్ధిఁ =ఆనందమనే సముద్రముదేల్చెదొ కదే = చేర్చుతావో కదాశ్రీకాళహస్తీశ్వరా! = శ్రీకాళహస్తిలో నెలవున్న శివా!

భావం: 

శ్రీకాళహస్తిలో నెలకున్న ఓ పరమశివా! నీవే నాకు దిక్కు. నీకన్నా నాకు ఎక్కువైన వారు ఎవరూ లేరు. నా తోబుట్టువులు, తల్లితండ్రులు, గురువులు, సహాయకులను మించిన వాడవు నీవు. ఈ సంసారమనే శోక సముద్రాన్ని దాటించి ఆనందమనే సుఖ సముద్రంలో ఏనాడు తేల్చుతావో కదా! 

 

 పునర్జన్మ లేకుండగ మోక్షాన్ని ప్రసాదించ గలవాడు ఆ పరమశివుడు ఒక్కడే అని భావం.

Comments