ఉ. అమ్మలగన్న యమ్మ - 100 పద్యాలు
ఉ. అమ్మల గన్నయమ్మ | |
అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె | |
1. అమ్మల గన్నయమ్మ 2. ముగురమ్మల మూలపుటమ్మ 3. చాల పెద్దమ్మ 4. సురారులమ్మకడుపాఱడిపుచ్చినయమ్మ 5. తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల | 6. మనమ్ములనుండెడియమ్మ 7. దుర్గ మా యమ్మ 8. కృపాబ్ధి యీవుత 9. మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.
|
అర్ధాలు: అమ్మలన్ = అమ్మలను; కన్న = మించిన; అమ్మ = తల్లి; ముగురు అమ్మల = లక్ష్మి, సరస్వతి ,పార్వతి లకి; మూలపు = మూల మైన; చాలన్ = చాలా; పెద్దమ్మ = పెద్ద అమ్మ; సురారుల అమ్మ = రాక్షసుల యొక్క తల్లి; ఆఱడిపుచ్చిన = దుఃఖపెట్టిన; అమ్మ = అమ్మ; తన్ను = తనను; లోన్ = (మనసు) లోపల; నమ్మిన = నమ్మిన; వేల్పుల అమ్మల = దేవతల తల్లుల; మనమ్ముల = మనసులలో; ఉండెడి = ఉండే; దుర్గ = దుర్గాదేవి; అమ్మ = అమ్మ; కృప + అబ్ధి = దయా సముద్రముతో; ఇచ్చుత = ఇచ్చుగాక; మహత్త్వ = గొప్పదైన; కవిత్వ = కవిత్వంలో; పటుత్వ = పటుత్వమనే; సంపదల్ = సంపదలు. | |
భావం: ఈ పద్యం పోతన వ్రాసన భాగవతంలోనిది. కావ్యంలోని ఇష్టదేవతారాధన పద్యాలలోనిది.
ఆమె అమ్మలకే అమ్మ. చాలా పెద్దమ్మ. సరస్వతి, లక్ష్మి, పార్వతి ఈ ముగ్గురికీ మూలమైన తల్లి. మహాబలవంతులైన రాక్షసులను మట్టుపెట్టింది. తనను నమ్మిన దేవతల తల్లుల హృదయాలలో కొలువుంటుంది. అలాంటి దుర్గమ్మ నాకు ఈ భాగవతాన్ని తెలుగులో రాసే గొప్ప కవిత్వ శక్తిని సామర్ధ్యాన్ని ప్రసాదించుగాక అని భావం. |
Comments
Post a Comment