శా. కేదారాది సమస్త - 100 పద్యాలు
శా. కేదారాదిసమస్త తీర్థములు | |
కేదారాది సమస్త తీర్థములు కోర్కింజూడఁ బోనేఁటికిం | |
1. కేదారాది 2. సమస్త తీర్థములు 3. కోర్కిం జూడఁన్ 4. పోనేఁటికిం 5. కాదా ముంగిలి వారణాసి 6. కడుపే కైలాసశైలంబు | 7. మీ పాద ధ్యానము 8. సంభవించునపుడే 9. భావింపన్ 10. అజ్ఞాన లక్ష్మీదారిద్ర్యులుగారె 11. లోకులకటా! 12. శ్రీకాళహస్తీశ్వరా! |
కేదారాది = కేదార + ఆది = కేదారము వంటి; సమస్త = చాలా; తీర్థములు = పుణ్యక్షేత్రములు ; కోర్కిం = కోర్కెతో; జూడఁన్ = చూడటానికి; పోనేఁటికిం = పోవటం ఎందుకు?; కాదా = ఔను కదా; ముంగిలి = ఇంటి దగ్గరే; వారణాసి = కాశీ; కడుపే = కడుపే; కైలాస శైలంబు = కైలాస పర్వతము; మీ పాద ధ్యానము = మీ పాదాల మీద ధ్యానము; సంభవించునపుడే = చేసినప్పుడే; భావింపన్ = ఆలోచన చేస్తే; అజ్ఞాన లక్ష్మీదారిద్ర్యులుగారె = అజ్ఞానము పోగొట్టుకన్నవారు; లోకులకటా = లోకంలోని వారు; శ్రీకాళహస్తీశ్వరా = శ్రీకాళహస్తిలో నెలకొన్న శివా!; | |
భావం: శ్రీకాళహస్తిలో నెలకున్న ఓ పరమశివా! కేదారము (కేదారనాథ్) వంటి పుణ్యక్షేత్రాలు చూడటానికి కోరికలతో పోవటం ఎందుకు? ఆ పరమ శివుని మీద మనసు పెట్టి ధ్యానం చేస్తే, మన ఇల్లే వారణాసి వంటి పుణ్యక్షేత్రము, మన కడుపే కైలాస పర్వతము అవుతుంది. అజ్ఞానము అనే సంపద దూరమువుతుంది.
కోరికలతో పుణ్యక్షేత్రాలు దర్శించే కంటే దేవుని మీద ధ్యాస, భక్తి మంచిది. అదే జ్ఞాన సంపద అని భావం. |
Comments
Post a Comment