ఉ. చక్కెరమాని వేము - 100 పద్యాలు

 

ఉ. చక్కెరమాని వేము

క్కెరమాని వేము దినఁజాలిన కైవడి మానవాధముల్
పెక్కురు బక్కదైవముల వేమఱుగొల్చెద రట్లకాదయా
మ్రొక్కిన నీకె మ్రొక్కవలె మోక్షమొసంగిన నీవె యీవలెన్
క్కినమాట లేమిటికి దాశరథీ! కరుణాపయోనిధీ!

1.     చక్కెర మాని 

2.     వేము దినఁజాలిన కైవడి 

3.    మానవాధముల్

4.    పెక్కురు

5.    బక్కదైవముల వేమఱుగొల్చెదరు

6.    అట్లకాదయా

7.     మ్రొక్కిన నీకె మ్రొక్కవలె 

8.    మోక్షమొసంగిన నీవె యీవలెన్

9.    తక్కినమాట లేమిటికి 

10. దాశరథీ! కరుణాపయోనిధీ!

అర్ధాలు:

చక్కెర పంచదార (తీపి)మాని = మానివేసివేమున్ = వేప ఆకును (చేదు)తినజాలిన = తినాలి అనుకునేకైవడి విధంగాపెక్కురు = చాలామందిపక్కదైవము = వేరు దైవాలనువేమఱున మాటిమాటికికొల్చెదరు కొలుస్తారుమ్రొకిన భక్తితో నమస్కరించాలంటే; మోక్షమొసంగిన మెక్షము ప్రసాదించాలంటేతక్కిన మాటలు వేరు మాటలు; ఏమిటికి ఎందులకుదాశరథీ రామా!; కరుణాపయోనిధీ = దయా సముద్రుడా!

భావం: ఈ పద్యం రామదాసు వ్రాసిన దాశరథీ శతకం లోనిది.

 

తీయని పంచదారను కాదని చేదు వేపాకును తినేవారి వలె, చాలా మంది పలు మార్లు వేరు దైవాలను భక్తితో నమస్కరిస్తారు. అసలు కొలవాలంటే నిన్నే కొలవాలి. మోక్షము ప్రసాదించాలంటే నీవే చేయాలి. ఇక వేరే మాటలెందుకయ్యా? రామా! దయా సముద్రుడా!

Comments