సీ. మందార మకరంద - 100 పద్యాలు

 

సీ. మందార మకరంద మాధుర్యమున

మందార మకరంద మాధుర్యమున దేలు ధుపంబు వోవునే దనములకు

నిర్మల మందాకినీవీచికల దూగు రాయంచ చనునే తరంగిణులకు
లిత రసాల పల్లవ ఖాదియై సొక్కు కోయిల జేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు

అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త
చిత్త మేరీతి నితరంబు జేర నేర్తు! వినుత గుణశీలమాటలు వేయునేల?

1.     మందార మకరంద 

2.     మాధుర్యమున దేలు మధుపంబు

3.     వోవునే మదనములకు

4.     నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ

5.     చనునే తరంగిణులకు

6.     లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు కోయిల 

7.     చేరునే కుటజములకు

8.     పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరకము 

9.     అరుగునే సాంద్ర నీహారములకు 

10.  అంబుజోదర దివ్య పాదారవింద 

11.   చింతనామృత పాన 

12.   విశేష మత్తచిత్త మేరీతి 

13.   నితరంబు జేర నేర్తు! 

14.  వినుత గుణశీలమాటలు వేయునేల?

అర్ధాలు:

మకరంద తేనెమధుపంబు తేనటీగమదనము = ఉమ్మెత్తపూవు; మందాకినీ గంగానదితూగు = తిరుగాడురాయంచ రాజహంసతరంగిణులు చిన్ననీటి కాలువలుఖాదియై తినునట్టికుటజములకు కొండపూల చెట్లునీహారము మంచు; అంబుజోదర = పద్మనాభునిపాదారవింద = పాద పద్మములు;ఏరీతిన్ = ఏవిధముగాఇతరంబు = ఇతరమైన వాటిని; మాటలు వేయున్ = వేయి మాటలు; ఏల = ఎందుకు;

భావం:

ఈ పద్యం పోతన వ్రాసిన భాగవతంలోనిది. ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో, ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపునితో విష్ణునామము గొప్పతనం వివరిస్తున్నది.

·      తియ్యని మందార పూవుల తేనెలను తేనెటీగ ఉమ్మెత్త పూల దగ్గరకు పోదు

·      చక్కని గంగానదిలో తిరిగే రాజ హంసలు చిన్నచిన్న వాగులకు పోవు

·      లేత మామిడి చిగుళ్లను తినే కోయిల కొండపూలను తినవు

·      పౌర్ణమి వెన్నెల తాగే చకోరపక్షి మంచులో తిరగవు

·       అలాగే ఆ హరి నామమనే ఆలోచనే తప్ప నాకు వేరే వాటి దగ్గరకు వెళ్లను. తండ్రీ, నీవు గొప్పగుణశీలివి. నీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా.

Comments