ఉ. వచ్చినవాడు ఫల్గుణుడు - 100 పద్యాలు

 

ఉ. వచ్చినవాడు ఫల్గుణుడు


చ్చినవాఁడు ఫల్గుణు డశ్యము గెల్తు మనంగరాదురా
చ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వ నేర్చునే? 
హెచ్చగుఁ గుందగుం దొడరు టెల్ల విధంబుల కోర్చుటట్లుగా
కిచ్చఁ దలంచి యొక్కమెయి నిత్తఱిఁ బొందగు చేఁతయుం దగున్

1.      వచ్చినవాఁడు ఫల్గునుఁ డు

2.     అవశ్యము గెల్తు మనంగ రాదు

3.     రాలచ్చికినై పెనంగిన 

4.     లంబులు రెండును 

5.     గెల్వ నేర్చునే? 

6.     హెచ్చగుఁ గుందగుం 

7.      తొడరు టెల్ల విధంబుల కోర్చుట

8.     అట్లుగాక

9.     ఇచ్చఁ దలంచి 

10.   యొక్కమెయి నిత్తఱిఁ 

11.    పొందగు చేఁతయుం దగున్

ఫల్గుణుడు అర్జునుడు; అవశ్యము  తప్పకుండా; గెల్తుమనంగ  గెల్తుము అనంగ  గెలుస్తామని; రాలచ్చి రాజ్యలక్ష్మి;కినై కోసమై; పెనంగిన  యుద్ధం చేసిన; ఏర్చునే = ఏర్పడుతుందా కుదురుతుందా; హెచ్చగు  గెలుపు; కుందగు  ఓటమి; తొడరుట  = జరుగుట ; ఎల్ల  ఏదైనా; ఓర్చుట  = తట్టుకోవాలి; అట్లుగక  అలాగ కాకుండా; ఇచ్చదలంచి  ఆలోచించి; ఒక్క మెయి  ఒక విధంగా; ఇత్తరి ఇక్కడ; పొందు సంధి; చేతయున్ చేసుకొనుట; తగున్ తగిన పనే;

సందర్భం – మహాభారతంలోని (తిక్కన వ్రాసినది) విరాట పర్వంలో అజ్ఞాతవాసం చివరిలో అర్జునుడిని గుర్తుపట్టిన భీష్ముడు దుర్యోధనుడితో అన్న మాటలు.

దుర్యోధనా! వచ్చిన వాడు అర్జునుడు. అన్ని సార్లూ మనమే గెలవలేము. రాజ్యలక్ష్మి కోసం యుద్ధం చేస్తే ఇద్దరూ గెలవలేరు కదా. ఒకరు పైన, మరొకరు క్రింద జరుగుతుంది. ఆలోచిస్తే, ఒక విధంగా సంధి చేసుకోవడం కూడా తగిన పనే.

Comments