చం. సిరిగలనాడు - 100 పద్యాలు
చం. సిరిగలనాడు | |
సిరిగల నాడు మైమరచి చిక్కిన నాడు దలంచి పుణ్యముల్ | |
1. సిరిగల నాడు మైమరచి 2. చిక్కిన నాడు దలంచి 3. పుణ్యముల్ 4. పొరిబొరి సేయనైతినని 5. పొక్కిన గల్గునె | 6. గాలిచిచ్చుపై గెరలిన వేళ 7. దప్పికొని కీడ్పడు వేళ 8. జలంబు గోరి 9. తత్తరమున ద్రవ్వినం గలదె 10. దాశరథీ! కరుణాపయోనిధీ! |
అర్ధాలు: సిరి = శ్రీ = ధనము; కల నాడు = ఉన్నప్పుడు; మైమరచి = అన్నీ మరచిపోయి ; చిక్కిన నాడు =చిక్కిపోయినప్పుడు; తలంచి = ఆలోచించి ; పుణ్యముల్ = మంచి పనులు ; పొరిబొరి = మరలమరల, ఎప్పటికప్పుడు; సేయనైతినని = చేయలేక పోయానే అని; పొక్కిన = బాధపడితే; కల్గునె = ఉపయోగం ఉంటుందా ; చిచ్చు = మంట, నిప్పు; పై = మీద; కెరలిన వేళ = పెరిగిన వేళలోను; దప్పికొని = దాహంతో;కీడ్పడు వేళ = కష్టపడే వేళలో; జలంబు = నీరు; కోరి = కోరుకుని; తత్తరమున = కంగారుగా, హడావిడిగా;త్రవ్వినం = త్రవ్వితే; కలదె = ఉపయోగం ఉంటుందా ; దాశరథీ = దశరథ నందనా!!; కరుణాపయోనిధీ= కరుణాసముద్రా!; | |
భావం: రామదాసు వ్రాసిన దాశరథీ శతకంలోని పద్యము.
ఓ శ్రీరామా! కరుణాసుద్రా! ధనము, శక్తి ఉన్నప్పుడు అన్నీ మరచిపోయి, లేనప్పుడు “అయ్యో! మంచి పనులు ఎప్పటికప్పుడు చేయలేక పోయానే” అనుకుంటే ఉపయోగం ఉంటుందా? మంటలు రేగినప్పుడు, దాహం వేసినప్పుడో నీరు కోసం తవ్వితే ఉపయోగం ఉంటుందా?
అందుకనే చేయదగిన పనులు సమయానికి చేయాలి. దైవభక్తి కూడా అటువంటిదే. |
Comments
Post a Comment