ఉ. బొంకని వాడె - దాశరథీ శతకం - 100 పద్యాలు

 

ఉ. బొంకనివాఁడె యోగ్యుఁ

బొంనివాఁడె యోగ్యుఁ డరిబృందము లెత్తినచోటఁ జివ్వకుం
జంనివాఁడె జోదు రభసంబున నర్థికరంబు సాఁచినం
గొంనివాఁడె దాత మిముఁ గొల్చి భజించినవాఁడె పో నిరా
తంమనస్కుఁడెన్నగను దాశరథీ! కరుణాపయోనిధీ!

1.   బొంకనివాఁడె యోగ్యుఁ డు

2.   అరిబృందము లెత్తినచోటఁ 

3.   జివ్వకుం జంకనివాఁడె జోదు 

4.   రభసంబునన్ 

5.    అర్థికరంబు సాఁచినం

6.   గొంకనివాఁడె దాత 

7.   మిముఁ గొల్చి భజించినవాఁడె పో 

8.   నిరాతంక మనస్కుఁడెన్నగను 

9.    దాశరథీ! కరుణాపయోనిధీ!

అర్ధాలు:

బొంకనివాఁడె = అబద్ధము చెప్పనివాడు; యోగ్యుఁ డు = గొప్పవాడు ; అరిబృందములు = శత్రువులు ;ఎత్తినచోటఁ = వచ్చినప్పుడు ; జివ్వకుం = యుద్ధానికి; జంకనివాఁడె = వెనుకాడనివాడు; జోదు = వీరుడు;రభసంబునన్ = ఆతృతతో; అర్థికరంబు = అడిన చేయి ; సాఁచినం = చాచినప్పుడు ; కొంకనివాఁడె =సందేహించనివాడు ; దాత = దాత; మిముఁ = నిన్ను (రాముడిని) ; గొల్చి = కొలిచి ; భజించినవాఁడె =భజించినవాడే; పో = పో (అసలైన) ; నిరాతంక = కల్మషంలేని ; మనస్కుఁడె = మనసున్న వాడు ; ఎన్నగను =లెక్కచూస్తే ; దాశరథీ = రామా! కరుణాపయోనిధీ = కరుణా సముద్రా! ;

భావం:

ఓ రామా! కరుణా సముద్రా! అబద్ధము చెప్పనివాడే గొప్పవాడు. శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు వెనుకాడనివాడే వీరుడు! సహాయం కోసం ఎవరైనా చేయి చాస్తే సందేహించనివాడే దాత! అలాగే నిన్ను కొలిచినవాడే అసలైన భక్తుడు!

Comments