ఉ. శ్రీరఘురామ - దాశరథీ శతకం - 100 పద్యాలు
ఉ. శ్రీరఘురామ | |
శ్రీరఘురామ, చారు తులసీదళ దామ, శమక్షమాది శృం | |
1. శ్రీరఘురామ 2. చారు తులసీదళ దామ 3. శమక్షమాది 4. శృంగారగుణాభిరామ 5. త్రిజగన్నుత | 6. శౌర్య రమా లలామ 7. దుర్వార కబంధ రాక్షస విరామ 8. జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ 9. భద్రగిరి 10. దాశరథీ! కరుణాపయోనిధీ! |
అర్ధాలు: శ్రీరఘురామ = శ్రీరామచంద్రా!; చారు = శ్రేష్ఠమైన, మంచి ; తులసీ దళ = తులసీ దళాలతో చేసిన; దామ =దండ (ధరించిన రామా); శమ = ఓర్పు; క్షమ = క్షమా గుణం ; ఆది = మొదలైన; శృంగార = అందమైన;గుణాభి రామ = గుణాలు కలిగిన రామా! ; త్రిజగన్నత = త్రి జగత్ + నుత = ముల్లోకాల నుండి పొగిడబడిన;శౌర్య రమా లలామ = శౌర్యములో శ్రేష్ఠమైన (రామా!); దుర్వార = భయంకరమైన; కబంధ రాక్షస = కబంధుడు వంటి రాక్షసులను; విరామ = ఓడించినవాడా!; జగజ్జన = జగత్ + జన = ప్రపంచములోని ప్రజలందరూ;కల్మషార్ణవోత్తారక = కల్మష + అర్ణవ + ఉత్తారక = పాపాల సముద్రం నుంచి రక్షించే; నామ = పేరు కలవాడా!; భద్రగిరి = భద్రాచలములోని; దాశరథీ = రామా!; కరుణాపయోనిధీ = కరుణా సముద్రా! ; | |
భావం: ఈ పద్యం రామదాసు వ్రాసిన “దాశరథీ శతకం”లోని మొదటి పద్యం.
ఓ రఘురామా! మంచి తులసీదళాలతో చేసిన దండ ధరించిన రామా! ఓర్పు, క్షమ వంటి మంచి గుణాలు కలిగిన రామా! ముల్లోకాలలోనూ శౌర్యవంతునిగా పేరొందిన రామా! కబంధుడు వంటి భయంకరమైన రాక్షసులను ఓడించిన రామా! సమస్త జగత్తులోని ప్రజలందరినీ పాపాల నుంచి రక్షించే పేరుగల రామా!భద్రాచలములో కొలువున్న రామా! ఓ కరుణా సముద్రా!
|
Comments
Post a Comment